Fitch Ratings agency
-
India Corporates: Sector Trends 2024: ఆర్థిక వృద్ధితో కార్పొరేట్లకు అవకాశాలు
కోల్‌కతా: భారత బలమైన ఆర్ధిక వృద్ధి కార్పొరేట్ కంపెనీలకు డిమాండ్‌ను పెంచుతుందని ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. ‘ఇండియా కార్పొరేట్స్: సెక్టార్ ట్రెండ్స్ 2024’ పేరుతో నివేదికను విడుదల చేసింది. పెరుగుతున్న డిమాండ్, అదే సమయంలో ముడి సరుకుల ధరల ఒత్తిళ్లు తగ్గుముఖం పట్టడం అన్నవి వచ్చే ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ల మార్జిన్లను పెంచుతాయని తెలిపింది. స్థానికంగా బలమైన డిమాండ్ నేపథ్యంలో 2024–25లో జీడీపీ 6.5 శాతం వృద్ధి రేటుతో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆర్ధిక వ్యవస్థగా ఉంటుందని పేర్కొంది. అంతర్జాతీయంగా సవాళ్లతో కూడిన వాతావరణం, ఇటీవలి ద్రవ్య పరపతి కఠినతర విధానాలున్నప్పటికీ, భారత ఆర్ధిక వ్యవస్థ బలమైన పనితీరు కొనసాగుతుందని అంచనా వేసింది. సిమెంట్, ఎలక్ట్రిసిటీ, పెట్రోలియం ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటుందని పేర్కొంది. మౌలిక సదుపాయాల మెరుగుదల సైతం స్టీల్ డిమాండ్‌కు ఊతంగా నిలుస్తుందని తెలిపింది. యూఎస్, యూరోజోన్‌లో వృద్ధి తగ్గిపోవడంతో భారత ఐటీ కంపెనీలు మోస్తరు వృద్ధికి పరిమితం కావాల్సి వస్తుందని పేర్కొంది. వాహన విక్రయాలు కంపెనీల ఆదాయాలను పెంచుతాయని తెలిపింది. -
భారత్ బ్యాంకింగ్ పటిష్టమవుతోంది: ఫిచ్
న్యూఢిల్లీ: కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో భారతీయ బ్యాంకుల నిర్వహణా పరిస్థితులు గణనీయంగా మెరుగుపడుతున్నట్లు రేటింగ్ ఏజెన్సీ– ఫిచ్ తన తాజా ప్రకటనలో పేర్కొంది. బ్యాంకింగ్‌కు సంబంధించి పలు సూచీలు కోవిడ్ ముందుస్తు పరిస్థితులకన్నాసైతం ముందంజలో ఉన్నట్లు వివరించింది. కొన్ని రంగాల విషయంలో బ్యాంకుల రుణ బకాయిలూ తగ్గుతున్నట్లు తెలిపింది. ‘ఆరి్థక వ్యవస్థ భారీ పరిమాణం, డిమాండ్ పరిస్థితులు లాభదాయకమైన వ్యాపారాన్ని సృష్టించడానికి అలాగే ఆదాయాలు పెరగడానికి, ఇబ్బందులను తగ్గించడానికి బ్యాంకింగ్‌కు మరిన్ని అవకాశాలను అందించాల్సి ఉంది’’ కూడా ఫిచ్ పేర్కొంది. -
ఆయిల్ కంపెనీలకు ఇక మీదట లాభాలే.. మరి డీజిల్,పెట్రోల్ ధరలు తగ్గేనా?
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లాభాలు ఆర్జిస్తాయని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. గతేడాది ఇవి భారీ నష్టాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. చము రు ధరలు బ్యారెల్‌కు 78.8 డాలర్లకు క్షీణించడాన్ని సానుకూలంగా ప్రస్తావించింది. దీంతో 2022–23 ఆర్థిక సంవత్సరం నష్టాలను.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో వచ్చే లాభాలతో భర్తీ చేసుకోగలవని తెలిపింది. గతేడాది ఏప్రిల్ నుంచి ప్రభుత్వరంగ సంస్థలైన ఐవోసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ పెట్రోల్ ధరలను ఒకే స్థాయిలో కొసాగిస్తూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా రేట్లు పెరిగినప్పటికీ, దేశీయంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు సవరించకపోవడంతో అవి నష్టాల పాలయ్యాయి. చమురు ధరలు గణనీయంగా తగ్గిన తర్వాత నుంచి తిరిగి అవి లాభాలను చూస్తున్నాయి. 5 శాతం పెరగొచ్చు గడిచిన ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియం డిమాండ్ 10 శాతం పెరగ్గా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5–6 శాతం మేర పెరగొచ్చని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. అంతేకాదు మధ్య కాలానికి సైతం దేశంలో పెట్రోల్ డిమాండ్ 5–6 శాతం మేర పెరగొచ్చని పేర్కొంది. భారత్ జీడీపీ వచ్చే కొన్నేళ్లపాటు 6–7 శాతం మేర వృద్ధి చెందొచ్చని అంచనా వేసింది. ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై వ్యయాలను పెంచుతూ ఉండడం, పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకోవడం పెట్రోల్ వినియోగానికి సానుకూలంగా పేర్కొంది. ‘‘స్థూల రిఫైనింగ్ మార్జిన్లు 2023–24లో మోస్తరు స్థాయికి దిగొస్తాయి. అయినప్పటికీ స్థూల మార్జిన్లు సగటు స్థాయిలకు ఎగువనే ఉండొచ్చని అంచనా వేస్తున్నాం’’అని ఫిచ్ రేటింగ్స్ వివరించింది. మోస్తరు స్థాయిలో ధరలు చమురు ధరలు 2022–23 గరిష్టాల నుంచి చూసుకుంటే మోస్తరు స్థాయిలో, ఎగువవైపే కొనసాగొచ్చని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. దీనివల్ల చమురు ఉత్పత్తి సంస్థలైన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాలకు మంచి నగదు ప్రవాహాలు సమకూరతాయని పేర్కొంది. భారత నూతన గ్యాస్ ధరల విధానం వల్ల ఈ సంస్థలకు నగదు ప్రవాహాల్లో ఉన్న అస్థిరతలు తగ్గుతాయని తెలిపింది. ఉత్పత్తికి సంబంధించి ఈ సంస్థలకు అధిక మూలధన నిధులు అవసరం కొనసాగుతుందని అంచనా వేసింది. దేశ చమురు ఉత్పత్తి 2022–23లో 1.7 శాతం తగ్గినట్టు వివరించింది. ఓఎన్జీసీ ఉత్పత్తి 1 శాతం తగ్గగా, ఆయిల్ ఇండియా ఉత్పత్తి 5 శాతం పెరిగినట్టు తెలిపింది. పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ బలంగా ఉండడం, దేశీయంగా ఉత్పత్తి స్థిరంగా ఉండడంతో 2023–24లోనూ చమురు దిగుమతులు అధికంగానే ఉంటాయని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. -
రుణ నాణ్యతపై అదానీ గ్రూప్ ఎఫెక్ట్ ఉండదు: ఫిచ్, మూడీస్
సాక్షి,ముంబై: అదానీ గ్రూప్, హిండెన్‌బర్గ్ వివాదం నేపథ్యంలో రేటింగ్ దిగ్గజాలు కీలక వ్యాఖ్యలు చేశాయి అదానీ గ్రూపునకు బ్యాంకుల రుణాలు వాటి ‘రుణ నాణ్యతపై’ ప్రభావితం చూపే భారీ స్థాయిలో లేవని గ్లోబల్ రేటింగ్ దిగ్గజాలు- ఫిచ్, మూడీస్ పేర్కొన్నాయి. అవసరమైతే వాటికి ఆ స్థాయిలో ప్రభుత్వం నుంచి మూలధన మద్దతు అందే అవకాశం ఉందని కూడా విశ్లేషించాయి. ప్రైవేట్ రంగ బ్యాంకుల కంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు అదానీ గ్రూప్‌కు ఎక్కువ రుణాలు ఇచ్చినప్పటికీ, అవి ఆయా బ్యాంకుల మొత్తం రుణాలలో 1 శాతం కంటే తక్కువగా ఉన్నాయని మూడీస్ పేర్కొంది. ‘‘భారతీయ బ్యాంకుల కార్పొరేట్ రుణాల మొత్తం నాణ్యత స్థిరంగా ఉంది. అయితే గత కొన్ని సంవత్సరాలలో చిన్న స్థాయి కార్పొరేట్లు నష్టపోయాయి. ఇది కొన్ని బ్యాంకుల కార్పొరేట్ రుణ పుస్తకాలలో భారీ వృద్ధిని నిలువరించింది’’ అని మూడీస్ విశ్లేషించింది. ఏదైనా అవసరమైతే అసాధారణ రీతిలో బ్యాంకింగ్‌కు ప్రభుత్వ మూలధన మద్దతు ఉంటుందనడంలో సందేహం లేదని ఫిచ్ తన నివేదికలో పేర్కొంది. అదానీ గ్రూప్‌కు దేశ దిగ్గజ బ్యాంక్ రుణాలు రూ.27,000 కోట్లు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాటా రూ.7,000 కోట్లు. ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ మొత్తం రుణాల్లో అదానీ గ్రూప్ రుణ వాటా 0.94 శాతం. దేశ మౌలిక రంగం పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్న అదానీ గ్రూప్‌కు కష్టాలు కొనసాగితే, మధ్య కాలికంగా అది దేశ ఆర్థిక వృద్ధిపై నామమాత్రపు ప్రభావమే చూపుతుందని ఫిచ్ అంచనావేస్తోంది. భారత్ ఆర్థిక వృద్ధి ధోరణి పటిష్టంగా ఉందని కూడా పేర్కొంది. -
భారత్ వృద్ధి రేటు 7 శాతానికి పరిమితం: ఫిచ్ అంచనా తగ్గింపు
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ వృద్ధి రేటు ఏప్రిల్‌తో ప్రారంభమైన 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7 శాతానికి పరిమితం అవుతుందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– ఫిచ్ అంచనావేసింది. ఈ మేరకు జూన్‌లో వేసిన తొలి 7.8 శాతం వృద్ధి అంచనాలకు 80 బేసిస్ పాయింట్లు లేదా 0.80 శాతం (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) కోతపెట్టింది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు తమ తాజా అంచనాలకు కారణంగా చూపింది. 2023–24 ఆర్థిక సంవత్సరం తొలి అంచనా 7.4 శాతాన్ని తాజాగా 6.7 శాతానికి కుదిస్తున్నట్లు కూడా ఫిచ్ తాజా గ్లోబల్ ఎకనమిక్ అవుట్‌లుక్ పేర్కొంది. కాగా, 2022లో ప్రపంచ వృద్ధి రేటు 2.4 శాతానికి పరిమితం అవుతుందని ఫిచ్ పేర్కొంది. తొలి అంచనాలకన్నా ఇది అరశాతం (0.5 శాతం) తక్కువ. -
సవరించని అమ్మకాల ధరలు, ఆయిల్ కంపెనీలకు భారీ షాక్!
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నా.. వాటి విక్రయ ధరలను సవరించకుండా నిలిపివేయడం వల్ల ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలైన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ లాభాలపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభావం పడుతుందని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. ద్రవ్యోల్బణం లక్ష్యిత స్థాయికు మించి పరుగులు తీస్తుండడంతో కేంద్ర ప్రభుత్వ పరోక్ష ఆదేశాల మేరకు.. నాలుగు నెలలుగా ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరించడం లేదు. కానీ, ఇదే కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో వాటి ధరలు పెరిగినందున లాభాలపై ప్రభావం పడుతుందని ఫిచ్ తెలిపింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల క్రెడిట్ మెట్రిక్స్ బలహీనపడతాయని పేర్కొంది. చదవండి👉పెట్రో లాభాలపై పన్ను పిడుగు! కేంద్ర ఖజానాకు లక్షకోట్లు! అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గే అవకాశాల నేపథ్యంలో 2023–24 నుంచి మెరుగుపడొచ్చని అంచనా వేసింది. సమీప కాలంలోచమురు ధరలు అన్నవి.. ప్రభుత్వ ద్రవ్య అవసరాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లపై ఆధారపడి ఉంటాయని పేర్కొంది. పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వ జోక్యం మరింత కాలంపాటు కొనసాగి, చమురు మార్కెటింగ్ కంపెనీల నష్టాలకు దారితీస్తే వాటి రేటింగ్‌పై ప్రభావం పడొచ్చని తెలిపింది. -
తొమ్మిది బ్యాంకులకు ఫిచ్ రేటింగ్ అవుట్‌లుక్ అప్‌గ్రేడ్
న్యూఢిల్లీ: రేటింగ్ దిగ్గజం ఫిచ్ బుధవారం తొమ్మిది భారత్ బ్యాంకుల రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘నెగటివ్’ నుంచి ‘స్టేబుల్’కు అప్‌గ్రేడ్ చేసింది. ఫిచ్ రేటింగ్ అప్‌గ్రేడ్ అయిన తొమ్మిది బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), బ్యాంక్ ఆఫ్ బరోడా (న్యూజిలాండ్), బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లు ఉన్నాయి. తొమ్మిది బ్యాంకుల లాంగ్‌టర్మ్ ఇష్యూయర్ డిఫాల్ట్ రేటింగ్స్ (ఐడీఆర్) రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘నెగటివ్’ నుంచి ‘స్టేబుల్’కు అప్‌గ్రేడ్ చేసినట్లు ఫిచ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎగ్జిమ్ బ్యాంక్ లాంగ్‌టర్మ్ ఐడీఆర్ కూడా... కాగా, ఎగుమతులు–దిగుమతుల వ్యవహారాల భారత్ బ్యాంక్ (ఎగ్జిమ్) లాంగ్‌టర్మ్ ఐడీఆర్‌ను కూడా ‘నెగటివ్’ నుంచి ‘స్టేబుల్’కు అప్‌గ్రేడ్ చేసినట్లు ఫిచ్ మరొక ప్రకటనలో తెలిపింది. భారతదేశ సార్వభౌమ రేటింగ్‌కు సంబంధించి ‘అవుట్‌లుక్’ను ఈ నెల 10వ తేదీన ఫిచ్ రెండేళ్ల తర్వాత ‘నెగటివ్’ నుండి ‘స్థిరం’కు అప్‌గ్రేడ్ చేసింది. వేగవంతమైన ఆర్థిక పునరుద్ధరణ వల్ల మధ్య–కాల వృద్ధికి ఎదురయ్యే సవాళ్లు తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. భారత్ ఎకానమీ రికవరీ వేగవంతంగా ఉందని, ఫైనాన్షియల్ రంగం బలహీనతలు తగ్గుతున్నాయని ఫిచ్ పేర్కొంది. కమోడిటీ ధరల తీవ్రత వల్ల సవాళ్లు ఉన్పప్పటికీ ఎకానమీకి ఉన్న సానుకూల అంశాలు తమ నిర్ణయానికి కారణమని తెలిపింది. చదవండి: బ్యాంక్ ఉద్యోగ సంఘాల సమ్మె,వారానికి 5 రోజులే పనిచేస్తాం! -
పెట్రోల్ డిమాండ్ తగ్గేదేలే!
న్యూఢిల్లీ: కోవిడ్–19పరమైన ఆంక్షల సడలింపుతో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునే కొద్దీ, ప్రస్తుత త్రైమాసికంలో దేశీయంగా ఇంధనానికి డిమాండ్ మెరుగుపడటం కొనసాగనుంది. అయితే, కొంగొత్త వేరియంట్లతో కేసులు పెరగడం, తత్ఫలితంగా మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాల వల్ల ఆర్థిక వ్యవస్థ, ప్రయాణాలపై ప్రతికూల ప్రభావం పడే రిస్కులు కూడా పొంచి ఉన్నాయి. ఒక నివేదికలో ఫిచ్ రేటింగ్స్ ఈ అంశాలు వెల్లడించింది. ఇంధనానికి డిమాండ్, తద్వారా ధరల పెరుగుదలతో చమురు, గ్యాస్ ఉత్పత్తి కంపెనీల ఆర్థిక పరిస్థితులు మరింత మెరుగుపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. క్యూ 4లో ‘‘జనవరి–మార్చి త్రైమాసికంలో పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ మళ్లీ కోవిడ్ పూర్వ స్థాయికి చేరవచ్చని అంచనా వేస్తున్నాం. అయితే పూర్తి ఆర్థిక సంవత్సరానికి చూస్తే మాత్రం 2020 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 2–4 శాతం తక్కువగానే ఉండవచ్చు’’ అని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. ఫిచ్ నివేదిక ప్రకారం.. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ 5 శాతం మేర పెరిగింది. అయితే, నెలవారీ సగటు మాత్రం కోవిడ్ పూర్వ స్థాయికన్నా 8–10 శాతం తక్కువగా సుమారు 16.4 మిలియన్ టన్నుల స్థాయిలో నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో దేశీయంగా ఇంకా కొన్ని ప్రాంతాల్లో మహమ్మారి కట్టడికి సం బంధించిన ఆంక్షలు అమలవుతుండటమే ఇందుకు కారణం. ‘‘ కోవిడ్–19 కేసుల ఉధృతి, ఫలితంగా ఆర్థిక కార్యకలాపాలు, ప్రయాణాలపై ప్రభావాల రిస్కులకు లోబడి నాలుగో త్రైమాసికంలో పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్‌కు సంబంధించిన రికవరీ కొనసాగవచ్చు’’ అని ఫిచ్ తెలిపింది. మరింతగా ఓఎంసీల పెట్టుబడులు.. రిఫైనింగ్ సామర్థ్యాలు, రిటైల్ నెట్‌వర్క్‌లను పెంచుకునేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ).. ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకునేందు కు తయారీ కంపెనీలు.. మరింతగా ఇన్వెస్ట్ చేయ డం కొనసాగించనున్నట్లు ఫిచ్ రేటింగ్స్ వివరించింది. ‘‘క్రూడాయిల్ ఉత్పత్తి స్థిరంగా కొనసాగవచ్చు. అన్వేషణ, అభివృద్ధి కార్యకలాపాలపై ఉత్పత్తి కంపెనీలు మరింతగా పెట్టుబడులు కొనసాగించడం వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఇది ఒక మోస్తరుగా పెరగవచ్చు. దేశీయంగా ఉత్పత్తి పెర గడం, స్పాట్ ధరల్లో పెరుగుదల తదితర అంశాలు వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) దిగుమతులపై ప్రభావం చూపవచ్చు. అయితే, వినియోగం పుంజు కునే కొద్దీ మధ్యకాలికంగా చూస్తే ఎల్ఎన్జీ దిగుమతులు క్రమంగా పెరగవచ్చు’’ అని ఫిచ్ తన నివేదికలో పేర్కొంది. మెరుగుపడనున్న రిఫైనింగ్ మార్జిన్లు .. ఎకానమీ రికవరీ క్రమంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగే కొద్దీ కీలకమైన చమురు రిఫైనింగ్ మార్జిన్లు ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో (అక్టోబర్ 2021–మార్చి 2022) మెరుగుపడనున్నాయని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. డిమాండ్, ఉత్పత్తి ధర–విక్రయ ధర మధ్య వ్యత్యాసం, తక్కువ రేటుకు కొని పెట్టుకున్న నిల్వల ఊతంతో ప్రథమార్ధంలో (ఏప్రిల్–సెప్టెంబర్ 2021) ప్రభుత్వ రంగ ఓఎంసీలు మెరుగైన మార్జిన్లు నమోదు చేశాయి. ఒక్కో బ్యారెల్‌పై బీపీసీఎల్ 5.1 డాలర్లు, ఐవోసీ 6.6 డాలర్లు, హెచ్‌పీసీఎల్ 2.9 డాలర్ల స్థాయికి మార్జిన్లు మెరుగుపర్చుకున్నాయి. క్రూడాయిల్ అధిక ధరల భారాన్ని వినియోగదారులకు బదలాయించడం కొనసాగించడం ద్వారా ద్వితీయార్ధంలో కూడా ఓఎంసీలు స్థిరంగా మార్కెటింగ్ మార్జిన్లను నమోదు చేయగలవని అంచనా వేస్తున్నట్లు ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. -
భారత్ సావరిన్ రేటింగ్ యథాతథం
Fitch affirms India's sovereign rating: భారత్ సావరిన్ రేటింగ్‌ను యథాతథంగా నెగటివ్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ మైనస్’ వద్ద కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ దిగ్జజ సంస్థ– ఫిచ్ మంగళవారం స్పష్టం చేసింది. మధ్య కాలికంగా వృద్ధికి అవరోధాలు తగ్గినట్లు కూడా పేర్కొంది. అంతర్జాతీయంగా ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకునే సామర్థ్యం భారత్‌కు ఉందని పేర్కొంది. ఈ సందర్భంగా దేశానికి ఉన్న దాదాపు 600కుపైగా బిలియన్ డాలర్ల విదేశీ మారకపు నిల్వలను ప్రస్తావించింది. ప్రభుత్వ రుణ భారం, బలహీన ఫైనాన్షియల్ వ్యవస్థ, వ్యవస్థాగత అంశాలకు సంబంధించి కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ దేశం వీటిని తట్టుకుని నిలబడగలదని పేర్కొంది. కోవిడ్–19 సవాళ్ల నుంచి దేశం వేగంగా రికవరీ అవుతోందని, మధ్య కాలిక వృద్ధి పటిష్టతకు, ఫైనాన్షియల్ రంగంపై ఒత్తిడి తగ్గడానికి ఆయా అంశాలు దోహదపడతాయని వివరించింది. 8.7 శాతం వృద్ధి అంచనా 2022 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశం 8.7 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు నమోదవుతుందన్న అంచనాలను ఫిచ్ వెలువరించింది. 2023 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 10 శాతానికి చేరుతుందని అంచనావేసింది. మెబిలిటీసహా పలు ఇండికేటర్లు కరోనా సవాళ్ల ముందస్తు స్థాయికి చేరుతున్నాయని పేర్కొంది. కోవిడ్–19 కేసులు పెరిగినప్పటికీ, దీనవల్ల నష్టం గతంలో కన్నా తక్కువగానే ఉంటుందని భావిస్తున్నట్లు వెల్లడించింది. విస్తృత వ్యాక్సినేషన్ దీనికి కారణమని తెలిపింది. చెత్త రేటింగ్‌కు ఒక అంచె ఎక్కువ... ప్రస్తుతం ఫిచ్ దేశానికి ఇస్తున్న రేటు చెత్త (జంక్) స్టేటస్‌కు ఒక అంచె ఎక్కువ. భారత్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తన అవుట్‌లుక్‌ను ‘నెగటివ్’ నుంచి ‘స్టేబుల్’కు అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు మరో అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ మూడీస్ అక్టోబర్‌లో పేర్కొంది. ఆర్థిక, ఫైనాన్షియల్ వ్యవస్థలకు సవాళ్లు తగ్గడం దీనికి కారణంగా పేర్కొంది. అయితే సావరిన్ రేటింగ్‌ను మాత్రం యథాతథంగానే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత్‌కు మూడీస్ ‘బీఏఏ3’ రేటింగ్‌ను ఇస్తోంది. ఇది కూడా జంక్ (చెత్త) స్టేటస్‌కు ఇది ఒక అంచె ఎక్కువ. 13 సంవత్సరాల తర్వాత నవంబర్ 2017లో భారత్ సావరిన్ రేటింగ్‌ను మూడీస్ ‘బీఏఏ3’ నుంచి ‘బీఏఏ2’కు అప్‌గ్రేడ్ చేసింది. అయితే గత ఏడాది తిరిగి ‘బీఏఏ2’ నుంచి ‘బీఏఏ3’కు డౌన్‌గ్రేడ్ చేసింది. పాలసీల్లో అమల్లో సవాళ్లు, ద్రవ్యలోటు తీవ్రత వంటి అంశాలను దీనికి కారణంగా చూపింది. మరో రేటింగ్ దిగ్గజ సంస్థలు ఎస్అండ్పీ కూడా భారత్‌కు చెత్త స్టేటస్‌కన్నా ఒక అంచె అధిక రేటింగ్‌నే ఇస్తోంది. భారత్ దిగ్గజ రేటింగ్ సంస్థల రేటింగ్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. భారత్ ఆర్థిక మూలస్తంభాల పటిష్టతను రేటింగ్ సంస్థలు పట్టించుకోవడంలేదన్నది వారి ఆరోపణ. ప్రాముఖ్యత ఎందుకు? అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఇచ్చే సావరిన్ రేటింగ్ ప్రాతిపదికగానే ఒక దేశంలో పెట్టుబడుల నిర్ణయాలను ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు తీసుకుంటారు. ప్రతి యేడాదీ ఆర్థికశాఖ అధికారులు గ్లోబల్ రేటింగ్ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతారు. దేశ ఆర్థిక పరిస్థితులను వివరించి, రేటింగ్ పెంపునకు విజ్ఞప్తి చేస్తారు. - న్యూఢిల్లీ -
‘ఫిచ్ రేటింగ్స్’: దేశ జీడీపీ భారీగా తగ్గింపు, కరోనా వల్లే
న్యూఢిల్లీ: భారత్ జీడీపీ అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 8.7 శాతానికి తగ్గిస్తూ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ‘ఫిచ్ రేటింగ్స్’ తన నిర్ణయాన్ని ప్రకటించింది. కరోనా రెండో విడత ఎక్కువ కాలం పాటు ఉండడాన్ని తన అంచనాల తగ్గింపునకు దారితీసిన అంశంగా ఫిచ్ తెలిపింది. భారత్ జీడీపీ 10 శాతం మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) వృద్ధిని నమోదు చేయవచ్చని ఈ ఏడాది జూన్‌లో ఫిచ్ అంచనా వేయడం గమనార్హం. అప్పుడు కూడా అంతక్రితం అంచనాలను గణనీయంగా తగ్గించేసింది. అంతకుముందు వేసిన అంచనా 12.8 శాతంగా ఉంది. కరోనా దెబ్బకు 2020–21లో దేశ జీడీపీ మైనస్ 7.3 శాతానికి పడిపోవడం తెలిసిందే. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2019–20)లోనూ వృద్ధి 4 శాతానికి పరిమితం అయింది. ‘‘మా అభిప్రాయం మేరకు.. కరోనా రెండో విడత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం కంటే.. నిదానించేలా చేసింది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాలను ఈ ఏడాది జూన్‌లో వేసిన 8.5 శాతం నుంచి 10 శాతానికి పెంచుతున్నాం’’ అని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ద్రవ్యలోటు భారీగా.. ద్రవ్యలోటు కూడా ఎక్కువగానే ఉంటుందని ఫిచ్ రేటింగ్స్ భావిస్తోంది. జీడీపీలో 7.2 శాతంగా (పెట్టుబడుల ఉపసంహరణను మినహాయించి చూస్తే) ఉండొచ్చని తన తాజా నివేదికలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 28న ఒక ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించడం గమనార్హం. దీని ప్రభావం జీడీపీలో 2.7 శాతం మేర ఉంటుందని ఫిచ్ అంచనా. ‘‘అయినప్పటికీ ఆదాయం మంచిగా పురోగమిస్తే కనుక అధిక వ్యయాల భారాన్ని అధిగమించొచ్చు. అప్పుడు ద్రవ్యలోటు కట్టడి సాధ్యపడుతుంది. ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం ఆర్బీఐ గరిష్ట పరిమిత లక్ష్యం (2–6) స్థాయిలోనే ఉండొచ్చు. అయితే ఇది మోస్తరు స్థాయికి చేరుతుంది. దీంతో ఆర్బీఐ వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు రేట్లను ఇదే స్థాయిలో కొనసాగించొచ్చని అంచనా వేస్తున్నాం’’ అని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. అలా అయితే కష్టం.. ప్రభుత్వం కనుక ద్రవ్యలోటును తగినంత స్థాయిలో కట్టడి చేయలేకపోతే అప్పుడు రుణ భారం/జీడీపీ రేషియో మరింత దిగజారుతుందని.. అది జీడీపీ వృద్ధిని బలహీనం చేయవచ్చని ఫిచ్ అభిప్రాయపడింది. కరోనా మహమ్మారి తర్వాత ప్రభుత్వం సాధారణ రుణ భారాన్ని బీబీబీ స్థాయికి తగ్గించేందుకు.. విశ్వసనీయమైన మధ్యకాలిక ద్రవ్యలోటు విధానాన్ని అమలు చేయడం సానుకూలంగా పేర్కొంది. అదే విధంగా స్థిరమైన అధికస్థాయి పెట్టుబడులు, గరిష్ట వృద్ధి రేటును మధ్యకాలానికి.. ఎటువంటి స్థూల ఆర్థిక అసమానతలు లేకుండా నమోదు చేయడం, నిర్మాణాత్మక సంస్కరణలను విజయవంతంగా అమలు చేయడం కూడా సానుకూలిస్తుందని ఫిచ్ అంచనా వేసింది. ఇతర అంచనాలు.. ఆర్బీఐ సైతం ఈ ఏడాది జూలై నాటి సమీక్షలో దేశ జీడీపీ వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 9.5 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత్ జీడీపీ 9.5 శాతం స్థాయిలో ఉంటుందని అంచనా వేయగా.. మూడిస్ 9.3 శాతంగా పేర్కొంది. ప్రపంచబ్యాంకు కూడా 10.1 శాతం నుంచి 8.3 శాతానికి అంచనాలను సవరించింది. వృద్ధి 9.1%: ఫిక్కీ 2021–22లో దేశ జీడీపీ 9.1% వృద్ధిని సాధిం చొచ్చని ఫిక్కీ ఎకనమిక్ అవుట్‌లుక్ సర్వే తెలిపింది. కరోనా రెండో విడత నుంచి ఆర్థిక వ్యవస్థ మంచిగా పుంజుకుంటుండడం వృద్ధికి మద్దతునిస్తుందని పేర్కొంది. అయితే దీపావళి సమయంలో ప్రజల రాకపోకలు ఎక్కువ అవ్వడం వల్ల కరోనా ఇన్ఫెక్షన్ కేసులు పెరిగిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది జూలైలో నిర్వహించిన ఫిక్కీ సర్వేలో వృద్ధి 9 శాతంగా ఉంటుందన్న అంచనాలు వ్యక్తం కావడం గమనార్హం. నైరుతి సీజన్ చివర్లో వర్షాలు మంచిగా పుం జుకోవడం, ఖరీఫ్‌లో సాగు పెరగడం వృద్ధి అంచనాలకు మద్దతునిస్తాయని ఫిక్కీ తెలిపింది. రెండో త్రైమాసికం జీడీపీ గణాంకాలు, పండుగల సీజన్లో విక్రయాలు ఆర్థిక వ్యవస్థ రికవరీపై స్పష్టతనిస్తాయని పేర్కొంది. -
మరో విడత ఉద్దీపన ప్యాకేజీ!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ పరిణామాలతో దెబ్బతిన్న భారత ఎకానమీకి ఊతమిచ్చే విధంగా కేంద్రం మరో దఫా ఆర్థిక ఉద్దీపన చర్యలు ప్రకటించే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ సోమవారం తెలిపింది. ఈ విడత ప్యాకేజీ పరిమాణం.. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) సుమారు 1 శాతం మేర ఉండవచ్చని అంచనా వేసింది. భారత సార్వభౌమ రేటింగ్ అవుట్‌లుక్ ను ఫిచ్ గతవారమే స్టేబుల్ (స్థిర) నుంచి నెగటివ్ (ప్రతికూల) స్థాయికి డౌన్‌గ్రేడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అదనంగా ప్రకటించబోయే ఉద్దీపనలను కూడా పరిగణనలో తీసుకున్నట్లు ఫిచ్ డైరెక్టర్ (సావరీన్ రేటింగ్స్) థామస్ రూక్మాకర్ తెలిపారు. ‘భారత్ జీడీపీలో 10 శాతం స్థాయిలో ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో ద్రవ్యపరమైన చర్యలు .. జీడీపీలో 1 శాతం మేర ఉంటాయి. మిగతా 9 శాతం అంతా ద్రవ్యేతర చర్యలే. ఇవి కాకుండా బాండ్ల జారీ కూడా ప్రభుత్వం ప్రకటించింది. వీటిని బట్టి చూస్తే కష్టకాలంలో ఉన్న వర్గాలకు మరికాస్త తోడ్పాటు అందించే దిశగా కేంద్రం ఇంకో విడతగా జీడీపీలో 1 శాతం స్థాయిలో మరో దఫా ఉద్దీపన చర్యలను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకునే భారత రేటింగ్‌పై అంచనాలను ప్రకటించాం’ అని వివరించారు. కేంద్ర ప్రభుత్వం గత నెలలో ప్రకటించిన రూ. 21 లక్షల ఆర్థిక ప్యాకేజీలో ప్రభుత్వపరమైన ఉద్దీపనతో పాటు ఆర్బీఐ ద్రవ్యపరంగా ప్రకటించిన చర్యలు కూడా ఉన్నాయి. 2020–21 బడ్జెట్ అంచనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ నుంచి సమీకరించే నిధుల లక్ష్యాన్ని రూ. 7.8 లక్షల కోట్ల నుంచి రూ. 12 లక్షల కోట్లకు పెంచింది. అంచనాల కన్నా తక్కువే వృద్ధి.. స్వల్పకాలికంగా భారత వృద్ధి రేటు ముందుగా అంచనా వేసిన 6.5–7% కన్నా మరికాస్త తక్కువగానే ఉండవచ్చని రూక్మాకర్ తెలిపారు. ‘మధ్యకాలికంగా భారత వృద్ధి అంచనాలు ఊహించిన దానికన్నా కాస్త తక్కువగానే ఉండవచ్చు. అయితే, ఎంత స్థాయిలో తగ్గవచ్చన్నది ఇప్పుడే చెప్పలేము. రుణాల చెల్లింపులపై విధించిన మారటోరియం ఎత్తివేశాక ఆర్థిక రంగ సంస్థల పరిస్థితి ఎలా ఉంటుందన్న దాన్ని బట్టి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది’ అని చెప్పారు. రాబోయే రోజుల్లో వృద్ధిని మెరుగుపర్చుకునేందుకు సంస్కరణలు ఊతం ఇవ్వనున్నప్పటికీ, వ్యాపార.. ఆర్థిక రంగాలపై కరోనా ప్రభావం మీద ఇది ఆధారపడి ఉంటుందన్నారు. -
స్టేబుల్ నుంచి నెగిటివ్‌కు ఫిచ్ రేటింగ్
దేశ సావరిన్ రేటింగ్ ఔట్‌లుక్‌ను విదేశీ దిగ్గజం ఫిచ్ తాజాగా డౌన్‌గ్రేడ్ చేసింది. గతంలో ఇచ్చిన స్టేబుల్(స్థిరత్వం) రేటింగ్‌ను నెగిటివ్(ప్రతికూలం)కు సవరించింది. ఇదివరకు ప్రకటించిన లోయస్ట్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్‌ను కొనసాగించేందుకు నిర్ణయించినట్లు ఫిచ్ రేటింగ్స్ తెలియజేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21)లో దేశ జీడీపీ 5 శాతం ప్రతికూల(మైనస్) వృద్ధిని నమోదు చేయనున్నట్లు అంచనా వేసింది. కోవిడ్-19 కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డవున్లు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. అయితే వచ్చే ఏడాది జీడీపీ 9.5 శాతం పురోభివృద్ధిని సాధించవచ్చని అభిప్రాయపడింది. ఇందుకు ఈ ఏడాది మైనస్ వృద్ధి నమోదుకానుండటం(లోబేస్) సహకరించే వీలున్నట్లు తెలియజేసింది. 6-7 శాతం వృద్ధి! లాక్డవున్లు నెమ్మదిగా సరళీకరిస్తున్న నేపథ్యంలో కోవిడ్-19 కేసులు పెరుగుతూనే ఉండటం రిస్కులను పెంచుతున్నట్లు ఫిచ్ పేర్కొంది. దీంతో ఇండియా గతంలో వేసిన 6-7 శాతం ఆర్థిక వృద్ధిని అందుకునేదీ లేనిదీ వేచిచూడవలసి ఉన్నట్లు తెలియజేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వృద్ధి అవకాశాలు బలహీనపడ్డాయని, ప్రభుత్వ రుణ భారం పెరగడంతో సవాళ్లు ఎదురుకానున్నట్లు వివరించింది. కాగా.. ప్రస్తుతం దేశ సావరిన్ రేటింగ్స్‌కు విదేశీ రేటింగ్ దిగ్గజాలన్నీ లోయస్ట్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్‌ను ప్రకటించినట్లయ్యిందని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ఫిచ్, మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ నెగిటివ్ ఔట్‌లుక్‌ను ప్రకటించగా.. స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్అండ్పీ) స్టేబుల్ రేటింగ్‌ను ఇచ్చింది. -
వృద్ధి రేటులో మందగమనం: ఫిచ్ రేటింగ్స్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-2020)లో భారత వృద్ధి రేటు 5.5శాతం నమోదవుతుందని ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ వెల్లడించింది. ఈ క్రమంలో క్రెడిట్ లభ్యతలో పెద్ద ఎత్తున లోటు సంభవించడం వల్ల వృద్ది రేటు తగ్గనుందని నివేదిక తెలిపింది. కానీ, (2020-21)లో 6.2 శాతానికి, (2021-22)లో 6.7 శాతానికి వృద్ధి రేటు చేరుకుంటుందని నివేదిక స్పష్టం చేసింది. రానున్న కాలంలో భారత్ అనుకున్న స్థాయిలో పుంజుకోదని నివేదిక తెలిపింది. ఏడాది కాలంగా వేగవంతంగా రుణాలు మంజూరు జరగలేదని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ రుణాలు 6.6శాతం ఉండగా, ఇది అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 9.5శాతం తక్కువగా ఉండడం గమనార్హం. అయితే ప్రభుత్వం తీసుకుంటున్న ఆర్ధిక సంస్కరణల వల్ల క్రెడిట్ లభ్యత ఆశాజనకంగా ఉంటుందని నివేదిక తెలిపింది. మరోవైపు జీడీపీ వృద్ది రేటు గత సంవత్సరం 8శాతంతో పోలిస్తే , ప్రస్తుత సంవత్సరం 5శాతానికి పడిపోయిందని నివేదిక తెలిపింది -
దేశంలో వడ్డీరేట్లు మరింత దిగివచ్చే చాన్స్!
న్యూఢిల్లీ: భారత్‌లో వడ్డీరేట్లు మరింత దిగివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఫిచ్ అంచనా వేస్తోంది. 2020 మార్చి ముగిసే నాటికి రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) రెపో రేటును మరో 0.40 శాతం తగ్గించే అవకాశం ఉందని విశ్లేషించింది. ఇప్పటివరకూ ఆర్బీఐ తీసుకున్న పరపతి విధాన సరళీకరణ చర్యలు ఆర్థికవృద్ధికి తగిన విధంగా దోహదపడలేదని విశ్లేషించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో. గడచిన వరుస నాలుగు ద్వైమాసిక సమీక్షల కాలంలో ఈ రేటును ఆర్బీఐ 1.1% తగ్గించింది. దీనితో రెపో రేటు 5.40 శాతానికి దిగివచ్చింది. అయితే రెపో తగ్గింపు ప్రయోజనం పూర్తిగా కస్టమర్లకు బదలీకాలేదు. లోధా డెవలపర్స్ రేటింగ్ తగ్గింపు రియల్టీ కంపెనీ మాక్రోటెక్ డెవలపర్స్ (మునుపటి పేరు లోధా డెవలపర్స్) ద్రవ్య నిర్వహణ అంశంపై తాజాగా ఫిచ్ ఆందోళన వ్యక్తంచేసింది. 2020 ఆర్థిక సంవత్సరంలో రూ.1,600 కోట్లు, 2021 ఏడాదిలో రూ.5,000 కోట్ల అప్పులను సంస్థ చెల్లించాల్సి ఉండగా.. వీటి చెల్లింపులపరంగా సవాళ్లను ఏదుర్కోనుందని తాజాగా ‘ఫిచ్ రేటింగ్స్’ తన అంచనాను ప్రకటించింది. చెల్లింపులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ‘బీ మైనస్’ రేటింగ్ ఇచ్చింది. వీటిని తిరిగి చెల్లించలేని పక్షంలో ప్రస్తుతం జంక్ రేటింగ్ మరింత కిందకు పడిపోవచ్చనీ పేర్కొంది. -
మళ్లీ అదే రేటింగ్..
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ముంగిట అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తాజాగా భారత్‌కు మరోసారి ట్రిపుల్ బి మైనస్ రేటింగ్ ఇచ్చింది. దీంతో వరుసగా 13వ ఏడాది ఇదే రేటింగ్ కొనసాగించినట్లయింది. పెట్టుబడులకు సంబంధించి తక్కువ స్థాయి గ్రేడ్‌ను ఇది సూచిస్తుంది. ఆర్థిక పరిస్థితులు ఇంకా బలహీనంగానే ఉండటమే భారత రేటింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఫిచ్ పేర్కొంది. 2006 నుంచి భారత సార్వభౌమ రేటింగ్‌ను ఫిచ్ ఇదే స్థాయిలో కొనసాగిస్తోంది. ‘ప్రభుత్వ రుణభారం పేరుకుపోవడంతో పాటు ఆర్థిక రంగం పరిస్థితులు బలహీనంగా ఉన్నప్పటికీ.. మధ్యకాలికంగా భారత వృద్ధి అంచనాలు పటిష్టంగా కనిపిస్తున్నాయి. విదేశీ నిల్వలు పుష్కలంగా ఉండటంతో పాటు విదేశీ పరిణామాలను దీటుగా ఎదుర్కొనగలిగే సత్తా కనిపిస్తుండటం ఈ అభిప్రాయానికి ఊతమిస్తున్నాయి‘ అని ఫిచ్ వివరించింది. మధ్యకాలికంగా ప్రభుత్వం అనుసరించబోయే ద్రవ్య విధానాలు.. రేటింగ్ అంచనాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొంది. విధానపరమైన ఎజెండాపరంగా చూస్తే సార్వత్రిక ఎన్నికల కారణంగా తాత్కాలికంగా కొంత అనిశ్చితి నెలకొన్నా.. గడిచిన 30 ఏళ్లుగా చరిత్ర చూస్తే ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ సంస్కరణలపైనే దృష్టి పెడుతుండటం చూడవచ్చని వివరించింది. ‘ఎన్నికల సరళి చూస్తుంటే ప్రస్తుత ప్రభుత్వంతో పోలిస్తే కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి తక్కువ మెజారిటీనే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అది జీఎస్టీ వంటి పెద్ద సంస్కరణలకు మద్దతు కూడగట్టుకోవడం కష్టసాధ్యంగా ఉండొచ్చు. అయినప్పటికీ సంస్కరణలపై దృష్టి పెట్ట డం మాత్రం కొనసాగుతుంది‘ అని ఫిచ్ తెలిపింది. ఈసారి 6.8 శాతం వృద్ధి.. భారత వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతంగాను, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.1 శాతంగాను ఉండొచ్చని ఫిచ్ అంచనా వేసింది. ఉదార ద్రవ్యపరపతి విధానాలు, బ్యాంకింగ్ నిబంధనలను సరళతరం చేయడం, ప్రభుత్వ వ్యయాలు పెంచడం తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని పేర్కొంది. 2018–19 మధ్య కాలంలో భారత వృద్ధి రేటు సగటున 7.5 శాతంగా నమోదైందని తెలిపింది. సాధారణంగా 3.6 శాతంగా ఉండే ట్రిపుల్ బి రేటింగ్ ఉండే దేశాల సగటుతో పోలిస్తే ఇది రెట్టింపని ఫిచ్ తెలిపింది. ప్రస్తుత ప్రభుత్వం వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ), దివాలా స్మృతి వంటి కొన్ని కీలకమైన సంస్కరణలు ప్రవేశపెట్టిందని, మరికొన్ని సంస్కరణలు కూడా ప్రవేశపెట్టినప్పటికీ.. వాటి ప్రభావాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదని వివరించింది. ‘విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సడలించడం, పాలనాపరంగా కఠిన నిబంధనలు సరళతరం చేయడం వల్ల లావాదేవీల వ్యయాలు తగ్గాయి. అయితే వ్యాపారాల నిర్వహణకు సంబంధించి ఇంకా సవాళ్లు కొనసాగుతున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక కూడా ఆకర్షణీయ స్థాయిలో ఉండటం లేదు‘ అని ఫిచ్ తెలిపింది. ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరుకోనున్న ప్రభుత్వం: గార్గ్ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2018–19 ఆర్థిక సంవత్సరానికి విధించుకున్న ద్రవ్యలోటు లక్ష్యం 3.4 శాతానికి చేరువలోనే ఉందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్రగార్గ్ తెలిపారు. వాస్తవానికి తొలుత 3.3 శాతానికి ద్రవ్యలోటును కట్టడి చేయాలనుకున్న కేంద్ర సర్కారు, ఇటీవలి బడ్జెట్లో ప్రకటించిన పలు రాయితీలు, పథకాలతో లోటును 3.4 శాతానికి సవరించుకుంది. ఈ లక్ష్యానికి చాలా సమీపంలోనే ఉన్నామని గార్గ్ స్పష్టం చేశారు. కొన్ని గణాంకాలు ఇంకా రావాల్సి ఉందని చెప్పారు. 2018–19లో పరోక్ష పన్నుల వసూళ్లలో లోటు ఉంటుందంటూ ప్రభుత్వం తరచూ చెబుతూ వస్తున్న విషయం గమనార్హం. ప్రత్యక్ష పన్నుల (వ్యక్తిగత ఆదాయపన్ను, కార్పొరేట్ పన్ను) ద్వారా తొలుత రూ.11.5 లక్షల ఆదాయం సమకూర్చుకోవాలన్న లక్ష్యాన్ని కేంద్రం విధించుకోగా, దానిని సైతం రూ.12 లక్షల కోట్లకు పెంచిన విషయం తెలిసిందే. -
‘మోదీ సర్కార్‌కు తీపికబురు’
సాక్షి, న్యూఢిల్లీ : మోదీ సర్కార్‌కు ఫిచ్ రేటింగ్స్ తీపికబురు అందించింది. 2018-19లో భారత ఆర్థిక వృద్ధి 7.3 శాతం నమోదవుతుందని పేర్కొంది. నిర్మాణ, ఉత్పాదక, సేవా రంగాలు మెరుగైన సామర్థ్యం కనబరుస్తున్నాయని అంచనాలకు అనుగుణంగా వృద్ది రేటు ఉంటుందని తెలిపింది. నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలతో ఎదురైన ప్రతికూల పరిణామాలు చాలావరకూ కనుమరుగయ్యాయని ఫిచ్ గ్రూప్ కంపెనీ బీఎంఐ రీసెర్చ్ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థిక వృద్ధి 7.3 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నట్టు నివేదిక పేర్కొంది. ఆర్బీఐ వృద్ధి రేటు అంచనాలకు అనుగుణంగానే బీఎంఐ రీసెర్చి నివేదిక అంచనా వెలువడటం గమనార్హం. 2018-19లో వృద్ధి రేటు 7.4 శాతం నమోదవుతుందని ఆర్బీఐ అంచనా వేసింది. భారత ఆర్థిక వ్యవస్థ ఇటీవల క్రమంగా కోలుకుంటున్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో బీఎంఐ నివేదిక ప్రభుత్వ వర్గాల్లో ఉత్సాహం నింపింది. మరోవైపు భారత వృద్ది రేటు 7.5 శాతంగా ఉంటుందని ఇటీవల డచ్ బ్యాంక్ రీసెర్చ్ నివేదిక సైతం అంచనా వేసింది. -
వృద్ధి అంచనాలను తగ్గించిన ఫిచ్
న్యూఢిల్లీ: ఫిచ్ రేటింగ్స్ సంస్థ వచ్చే ఆర్థిక సంవత్సరం భారత ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్ 8% వృద్ధిని సాధిస్తుందని డిసెంబర్లో ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. ఈ అంచనాలను తాజాగా 7.7%కి తగ్గించింది. అయితే, వృద్ధి విషయంలో ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంటుందని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 7.5% వృద్ధి సాధిస్తుందన్న అంచనాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఫిచ్ తన తాజా గ్లోబల్ ఎకనామిక్ అవుట్‌లుక్(జీఈఓ)లో పేర్కొంది. ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నందున ఆర్బీఐ కీలక రేట్లను పావు శాతం మేర తగ్గించే అవకాశాలున్నాయని పేర్కొంది.