ఐదేళ్లలో 280 బిలియన్ డాలర్లకు.. హెల్త్‌కేర్!
ఫిక్కీ-కేపీఎంజీ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: భవిష్యత్తులో భారత ఆర్థికాభివృద్ధిలో హెల్త్‌కేర్ రంగం ప్రధాన భూమిక పోషించనుంది. 2011లో 74 బిలియన్ డాలర్లుగా ఉన్న హెల్త్‌కేర్ రంగం 2020 నాటికి 16 శాతం వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు (సీఏజీఆర్)తో 280 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఫిక్కీ-కేపీఎంజీ తన నివేదికలో పేర్కొంది. హెల్త్‌కేర్ రంగంపై ప్రభుత్వం అంతగా దృష్టి కేంద్రీకరించడం లేదని తెలిపింది. కేంద్రం ప్రస్తుతం హెల్త్‌కేర్ రంగంపై వెచ్చిస్తోన్న మొత్తం జీడీపీలో 4.2 శాతంగా ఉందని, ఇది ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే చాలా తక్కువని పేర్కొంది.