న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ రంగ దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 17 శాతం వృద్ధితో రూ. 2,524 కోట్లను తాకింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 2,166 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 11,241 కోట్ల నుంచి రూ. 12,381 కోట్లకు ఎగసింది.
అయితే మొత్తం వ్యయాలు రూ. 8,943 కోట్ల నుంచి రూ. 9,561 కోట్లకు పెరిగాయి. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 8.5 చొప్పున మధ్యంతర డివిడెండు ప్రకటించింది. గ్లోబల్ స్పెషాలిటీసహా విస్తారిత వృద్ధిని సాధించినందుకు సంతోíÙస్తున్నట్లు కంపెనీ ఎండీ దిలీప్ సంఘ్వీ పేర్కొన్నారు. రానున్న నెలల్లో నైడెల్‌జీ ఈఎంఏ ఫైలింగ్‌పై దృష్టిపెట్టనున్నట్లు తెలియజేశారు. మెలనోమాతోపాటు, మెలనోమాయేతర చర్మ కేన్సర్ల చికిత్సలో వినియోగించే బయోఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్ ఇది.
విభాగాలవారీగా
ప్రస్తుత సమీక్షా కాలంలో దేశీయంగా సన్ ఫార్మా ఫార్ములేషన్ల అమ్మకాలు 11 శాతంపైగా పుంజుకుని రూ. 3,779 కోట్లకు చేరాయి. టారోసహా యూఎస్ విక్రయాలు 13 శాతం ఎగసి 47.7 కోట్ల డాలర్లను తాకాయి. వర్ధమాన మార్కెట్లలో ఇవి 2 శాతం నీరసించి 25.2 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. ఇతర ప్రపంచ మార్కెట్ల నుంచి 13 శాతం అధికంగా 21.4 కోట్ల డాలర్ల అమ్మకాలు సాధించింది. ఏపీఐ విక్రయాలు 10 శాతం క్షీణించి రూ. 466 కోట్లకు చేరాయి. ఈ కాలంలో పరిశోధన, అభివృద్ధిపై రూ. 825 కోట్ల పెట్టుబడులు వెచి్చంచింది. గత క్యూ3లో ఇవి రూ. 670 కోట్లు మాత్రమే.
ఫలితాల నేపథ్యంలో సన్ ఫార్మా షేరు బీఎస్‌ఈలో 3.5 శాతం లాభపడి రూ. 1,419 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment