Morgan Stanley Lays Off about 1600 Employees Globally - Sakshi
Sakshi News home page

layoffs: వందలమందికి ఉద్వాసన పలికిన మరో దిగ్గజ సంస్థ

Published Wed, Dec 7 2022 4:47 PM | Last Updated on Wed, Dec 7 2022 6:19 PM

Morgan Stanley lays off about 1600 employees - Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రపంచ ఆర్థికమాంద్యం ఆందోళన నేపథ్యంలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజరీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ కూడా ఉద్యోగుల తీసివేతకే మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది. తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 2 శాతం లేదా దాదాపు 1,600 మంది ఉద్యోగుల తొలగించినట్టు తెలుస్తోంది. (వాట్సాప్‌ అవతార్‌ వచ్చేసింది..మీరూ కస్టమైజ్‌ చేసుకోండి ఇలా!)

కొంతమందిని తొలగించబోతున్నామన్న మోర్గాన్ స్టాన్లీ సీఈవో జేమ్స్ గోర్డాన్ ఇటీవల  వ్యాఖ్యలను ఉటింకిస్తూ సీఎన్‌బీసీ మీడియా నివేదించింది. మోర్గాన్ స్టాన్లీ ఇటీవలి సంవత్సరాల్లో చాలామంది ఉద్యోగులను నియమించుకుంది. 2020 మొదటి త్రైమాసికం నుండి ఈ  ఏడాది మూడో త్రైమాసికం వరకు  కంపెనీ ఉద్యోగుల సంఖ్య 34 శాతం పెరిగింది. కంపెనీలో దాదాపు 81,567 మంది ఉద్యోగులున్నారు. ఈ నివేదికపై గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ ఇంకా వ్యాఖ్యానించలేదు.

మోర్గాన్ స్టాన్లీ ప్రత్యర్థి గోల్డ్‌మన్ సాచ్స్ ,సిటీ గ్రూప్, బార్క్లేస్‌ సహా ఇతర పెట్టుబడి సంస్థలు కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. తాజాగా ఈ జాబితాలో మోర్గాన్‌ స్టాన్లీ చేరింది. కాగా ఆర్థిక మాంద్యం, ఆదాయా కక్షీణత నేపథ్యంలో ట్విటర్‌, అమెజాన్, మెటా,  పెప్సీకో లాంటి అనేక ఇతర కంపెనీలు ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement