ఏప్రిల్ నుంచి భారత్ వృద్ధి రికవరీ!
మోర్గాన్ స్టాన్లీ అంచనా
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి రికవరీ బాట పడుతుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనావేసింది. ఇందుకు వినియోగం, ఎగుమతులు దోహదపడతాయని పేర్కొంది. పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి ప్రస్తుత ప్రతికూల ప్రభావం స్వల్పకాలమేనని అభిప్రాయపడింది. ఈ మేరకు విడుదల చేసిన ఒక నివేదికలోని ముఖ్యాంశాలు...
⇔ పెద్ద నోట్ల రద్దు ప్రభావం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిపై డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో కనిపిస్తుంది. వృద్ధిపై దాదాపు 50 నుంచి 70 బేసిస్ పారుుంట్ల మేర (100 బేసిస్ పారుుంట్లు ఒక శాతం) ఈ ప్రభావం ఉంటుంది.
⇔ అరుుతే విసృ్తత ప్రాతిపదికన భారత్ వృద్ధికి ఢోకా లేదు. భారత్‌కు వృద్ధికి సంబంధించి మొత్తంమీద నిర్మాణాత్మక అవుట్‌లుక్‌ను మేము కొనసాగిస్తున్నాము.
⇔ స్థూల దేశీయోత్పత్తితో పోల్చితే దాదాపు 60 శాతంగా ఉన్న వినియోగ రంగం వచ్చే ఏడాది జూన్ త్రైమాసికం నుంచీ బలపడే వీలుంది. దీనికితోడు పెరిగే ప్రభుత్వ వ్యయాలు, ఎఫ్‌డీఐల ప్రభావం ఆర్థిక వ్యవస్థకు కలిసి వచ్చే వీలుంది.