మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు షేర్ల ఎంపిక విషయంలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ జూన్‌లో హెల్త్‌కేర్, ఫార్మారంగ షేర్లలో తమ వాటాను తగ్గించుకున్నారు. భారీ నష్టాలను చవిచూస్తున్న బ్యాంకింగ్, ఎన్‌బీఎఫ్‌సీ షేర్లలో వాటాను పెంచుకున్నారు. నెల ప్రాతిపదికన ఫండ్ మేనేజర్ల ఫోర్ట్‌ఫోలియోలో హెల్త్‌కేర్, ఫార్మా రంగాల వెయిటేజీ 50బేసిస్ పాయింట్ల క్షీణించింది. అంతకు ముందు నెలలో ఫార్మా, ఐటీ రంగాల వెయిటేజీ 8.3శాతంగా ఉండగా, ఈ జూన్ ముగింపు నాటికి 7.8శాతానికి పరిమితమైంది. వరుస 5నెలల పెంపు తర్వాత ఫండ్‌మేనేజర్లు 2సెక్టార్లకు వెయిటేజీ తగ్గించడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి ప్రారంభం నుంచి ఫండింగ్ హౌస్‌లు ఈరెండు రంగాల్లో భారీగా వాటాలను కొనుగోలు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇదే జూన్లో ఆయిల్‌అండ్‌గ్యాస్ రంగ షేర్ల కొనుగోళ్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఫలితంగా ఈ పోర్ట్‌ఫోలియో ఈ రంగ వెయిటేజీ 40బేసిస్ పాయింట్లు పెరిగింది. అయితే రియలన్స్ షేరు ర్యాలీ కారణంగా వెయిటేజీ పెరిగి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈ షేరు 28శాతం పెరిగిన సంగతి తెలిసిందే.
మరోవైపు పోర్ట్‌ఫోలియతో ప్రైవేట్ బ్యాంక్స్, ఎన్‌బీఎఫ్‌సీ షేర్ల వెయిటేజీలు వరుసగా 40 బేసిస్ పాయింట్లు, 50 బేసిస్ పాయింట్లు పెరిగాయి. పోర్ట్‌ఫోలియోలో వెయిట్ పెంపు అనేది ఒక నిర్దిష్ట రంగంపై లేదా స్టాక్ ఫండ్ మేనేజర్ ఎంత ఎక్స్‌పోజర్ తీసుకుంటుందో సూచిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment