pharma stocks
-
ఫార్మా దూకుడు- రికార్డులే.. రికార్డులు
ప్రధానంగా హెల్త్‌కేర్ రంగానికి పెరిగిన డిమాండ్‌తో దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ ఇన్వెస్టర్లు ఫార్మా కౌంటర్లలో కొనుగోళ్లకు ఎగబడటంతో బీఎస్ఈలో ఫార్మా ఇండెక్స్ సరికొత్త గరిష్టాన్ని తాకింది. ఈ బాటలో లారస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సైతం చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. అంతేకాకుండా పలు ఇతర ఫార్మా రంగ షేర్లు 52 వారాల గరిష్టాలను చేరడం విశేషం! వివరాలు ఇలా.. జోరుగా హుషారుగా బీఎస్ఈలో హెల్త్‌కేర్ రంగ ఇండెక్స్ దాదాపు 4 శాతం జంప్‌చేసింది. 20,529ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ఫార్మాస్యూటికల్ కౌంటర్లలో లారస్ ల్యాబ్స్ తొలుత 6.5 శాతం జంప్‌చేసి రూ. 1497 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ప్రస్తుతం 5.7 శాతం ఎగసి రూ. 1484 వద్ద ట్రేడవుతోంది. ఈ వారంలో లారస్ షేరు 18 శాతం బలపడగా.. కోవిడ్-19 కట్టడికి వీలుగా రష్యన్ వ్యాక్సిన్‌పై మూడో దశ క్లినికల్ పరీక్షలకు సిద్ధపడుతున్న డాక్టర్ రెడ్డీస్ తొలుత దాదాపు 10 శాతం దూసుకెళ్లింది. రూ. 5303కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 8.2 శాతం జంప్‌చేసి రూ. 5222 వద్ద ట్రేడవుతోంది. గత మూడు రోజుల్లోనే ఈ షేరు 15 శాతం ర్యాలీ చేయడం విశేషం! యమ స్పీడ్ హెల్త్‌కేర్ రంగ కౌంటర్లలో ప్రస్తుతం నాట్కో ఫార్మా 19 శాతం దూసుకెళ్లి రూ. 921 వద్ద, ఆర్పీజీ లైఫ్ 8 శాతం జంప్‌చేసి రూ. 406 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ బాటలో హెస్టర్ బయో 8 శాతం ఎగసి రూ. 1790ను తాకగా.. సువెన్ లైఫ్ 6 శాతం లాభంతో రూ. 55కు చేరింది. ఇతర కౌంటర్లలో లుపిన్ 6 శాతం బలపడి రూ. 1100 వద్ద, సిప్లా 6 శాతం పెరిగి రూ. 795 వద్ద, గ్రాన్యూల్స్ 5.5 శాతం జంప్‌చేసి రూ. 384 వద్ద ట్రేడవుతున్నాయి. ఇదే విధంగా న్యూలాడ్ ల్యాబ్స్ 5 శాతం పెరిగి రూ. 1181ను తాకగా.. జేబీ కెమికల్స్ 4.3 శాతం ఎగసి రూ. 1115కు చేరింది. కాగా. దివీస్ ల్యాబ్స్ 4.3 శాతం లాభంతో రూ. 3350 వద్ద, క్యాప్లిన్ పాయింట్ 4 శాతం వృద్ధితో రూ. 595 వద్ద, కేడిలా హెల్త్‌కేర్ 4 శాతం పుంజుకుని రూ. 409 వద్ద, వొకార్డ్ 3.6 శాతం పెరిగి రూ. 307 వద్ద, గ్లెన్‌మార్క్ 3.5 శాతం వృద్ధితో రూ. 510 వద్ద కదులుతున్నాయి. ఏడాది గరిష్టాలకు.. బీఎస్ఈలో స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ 2.3 శాతం పెరిగి రూ. 745 వద్ద, లింకన్ ఫార్మా 2.5 శాతం పుంజుకుని రూ. 270 వద్ద, హికాల్ 3 శాతం ఎగసి రూ. 190 వద్ద, లుపిన్ రూ. 1111 వద్ద, న్యూలాండ్ ల్యాబ్స్ రూ. 1199 వద్ద 52 వారాల గరిష్టాలను అందుకున్నాయి. -
ఫార్మా షేర్లలో వాటాను తగ్గించుకున్న ఫండ్స్
మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు షేర్ల ఎంపిక విషయంలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ జూన్‌లో హెల్త్‌కేర్, ఫార్మారంగ షేర్లలో తమ వాటాను తగ్గించుకున్నారు. భారీ నష్టాలను చవిచూస్తున్న బ్యాంకింగ్, ఎన్బీఎఫ్సీ షేర్లలో వాటాను పెంచుకున్నారు. నెల ప్రాతిపదికన ఫండ్ మేనేజర్ల ఫోర్ట్‌ఫోలియోలో హెల్త్‌కేర్, ఫార్మా రంగాల వెయిటేజీ 50బేసిస్ పాయింట్ల క్షీణించింది. అంతకు ముందు నెలలో ఫార్మా, ఐటీ రంగాల వెయిటేజీ 8.3శాతంగా ఉండగా, ఈ జూన్ ముగింపు నాటికి 7.8శాతానికి పరిమితమైంది. వరుస 5నెలల పెంపు తర్వాత ఫండ్‌మేనేజర్లు 2సెక్టార్లకు వెయిటేజీ తగ్గించడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి ప్రారంభం నుంచి ఫండింగ్ హౌస్‌లు ఈరెండు రంగాల్లో భారీగా వాటాలను కొనుగోలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదే జూన్‌లో ఆయిల్‌అండ్‌గ్యాస్ రంగ షేర్ల కొనుగోళ్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఫలితంగా ఈ పోర్ట్‌ఫోలియో ఈ రంగ వెయిటేజీ 40బేసిస్ పాయింట్లు పెరిగింది. అయితే రియలన్స్ షేరు ర్యాలీ కారణంగా వెయిటేజీ పెరిగి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈ షేరు 28శాతం పెరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు పోర్ట్ఫోలియతో ప్రైవేట్ బ్యాంక్స్, ఎన్బీఎఫ్సీ షేర్ల వెయిటేజీలు వరుసగా 40 బేసిస్ పాయింట్లు, 50 బేసిస్ పాయింట్లు పెరిగాయి. పోర్ట్‌ఫోలియోలో వెయిట్ పెంపు అనేది ఒక నిర్దిష్ట రంగంపై లేదా స్టాక్ ఫండ్ మేనేజర్ ఎంత ఎక్స్పోజర్ తీసుకుంటుందో సూచిస్తుంది. -
5 రోజుల నష్టాలకు బ్రేక్: గట్టెక్కిన మార్కెట్లు
ముంబై : బెంచ్ మార్కు సూచీలు గత ఐదు రోజుల వరుస నష్టాలకు బ్రేకిచ్చాయి. సోమవారం ట్రేడింగ్ ముగింపుల్లో మార్కెట్లు లాభాల్లో నమోదయ్యాయి. సెన్సెక్స్ 235.44 పాయింట్ల లాభంలో 31,449.03 వద్ద, నిఫ్టీ 83.35 వద్ద 9794.15 వద్ద క్లోజ్ అయ్యాయి. నేటి ట్రేడింగ్‌లో మెటల్, హెవీ వెయిట్ బ్యాంకింగ్ స్టాక్స్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, రియాల్టీ స్టాక్స్‌లో ఎక్కువగా కొనుగోలు జరిగాయి. బలహీనమైన అమెరికా ద్రవ్యోల్బణ డేటాతో ఆసియన్ షేర్లలో కొనుగోలు మద్దతు లభించింది. సిప్లా ఎక్కువగా 5.4 శాతం లాభాలు పండించింది. దాని తర్వాత వేదాంత, టాటా స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మాలు లాభాల్లో కొనసాగాయి. నేటి ట్రేడింగ్‌లో టాప్ గెయినర్లుగా బ్యాంకులు నిలిచాయి. గత వారంగా 3.4 శాతం కోల్పోయిన బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్, 0.9 శాతం పైకి ఎగిసింది. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు 2.6 శాతం, 1.1 శాతం లాభాలు పండించాయి. ఎస్బీఐ, కొటక్ మహింద్రా, భారతీ ఎయిర్టెల్, బోస్క్ షేర్లు రెండు సూచీల్లో నష్టాలు పాలయ్యాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 2 పైసలు బలపడి 64.11గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 144 రూపాయల నష్టంలో 29,059 రూపాయలుగా నమోదయ్యాయి. -
లాభాల్లో మార్కెట్లు ప్రారంభం
తొమ్మిది రోజుల కరెక్షన్ అనంతరం ఫార్మా షేర్లు తిరిగి పుంజుకోవడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. లాభాల్లో ఎగిసిన కొద్దిసేపటికే మార్కెట్లు మళ్లీ ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. 90 పాయింట్ల లాభంలో ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్ ప్రస్తుతం 9.58 పాయింట్ల లాభంలో 25,816 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా నిఫ్టీ సైతం 7,908గా ట్రేడ్ అవుతోంది. టాటా స్టీల్, ఐటీసీ, సిప్లా, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ లాభాల్లో నడుస్తుండగా.. హీరో మోటార్ కార్ప్, యాక్సిస్ బ్యాంకు, విప్రో, మహింద్రా అండ్ మహింద్రా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నష్టాలు పాలవుతున్నాయి. గెయిల్ ఇండియా నిఫ్టీలో టాప్ లూజర్‌గా ట్రేడ్ అవుతోంది. ఈ కంపెనీ షేర్లు 1.16 శాతం పడిపోయాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు పడిపోయి 67.84గా ఎంట్రీ ఇచ్చింది. ఎంసీఎక్స్ మార్కెట్లో అటు బంగారం ధరలు 56 రూపాయలు పెరిగి 27,050గా ట్రేడ్ అవుతున్నాయి. -
ముగింపులో నష్టాలు..
ముంబై: అమెరికా అధ్యక్ష అభ్యర్ధుల మధ్య జరిగిన చర్చాగోష్టిలో డెమోక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌దే పైచేయికావడంతో మంగళవారం ఉదయం ఆసియా ట్రెండ్‌ను అనుసరించిన లాభాల్లో ప్రారంభమైనా, చివరకు నష్టాలతో ముగిసింది. ట్రేడింగ్ తొలిదశలో 130 పాయింట్లవరకూ పెరిగి 28,433 పాయింట్లస్థాయికి సెన్సెక్స్ ఎగిసింది. మధ్యాహ్న సమయంలో యూరప్ మార్కెట్లు నష్టపోవడంతో 28,179 పాయింట్ల వద్దకు క్షీణించింది. చివరకు 71 పాయింట్ల నష్టంతో నెలరోజుల కనిష్టస్థాయి 28,224 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. 8,769 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి క్రమేపీ తగ్గిన ఎన్ఎస్ఈ నిఫ్టీ ఒకదశలో 8,700 పాయింట్ల దిగువకు పడిపోయింది. చివరకు 17 పాయింట్ల నష్టంతో 8,706 పాయింట్ల వద్ద ముగిసింది. డెరివేటివ్స్ ముగింపు ప్రభావం.... మరో రెండు రోజుల్లో సెప్టెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా మార్కెట్లో ఒడుదుడుకులు చోటుచేసుకున్నాయని విశ్లేషకులు చెప్పారు. రోలోవర్స్ కూడా తక్కువగా వున్నాయని, ఇన్వెస్టర్లు రిస్క్‌కు దూరం జర గడమే ఇందుకు కారణమని జియోజిత్ బీఎన్పీ పారిబాస్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ తెలిపారు. అదాని పోర్ట్స్, భారతి ఎయిర్‌టెల్‌లు 2 శాతం క్షీణించాయి. ఐటీ, ఫార్మా షేర్లు స్వల్పంగా పెరిగాయి. -
ఫార్మా స్టాక్స్ జోరుతో లాభాల్లో మార్కెట్లు
ముంబై: లాభాలతో ప్రారంభమైన బుధవారం నాటి స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ ముగిసే నాటికి బీఎస్ఈ సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా లాభాలను నమోదుచేసింది. సెన్సెక్స్ 128.27 పాయింట్ల లాభంతో 27,915వద్ద, నిఫ్టీ 37.30 పాయింట్ల లాభంతో 8,365 దగ్గర ముగిసింది. ఫార్మా స్టాక్స్ కొనుగోలు మద్దతుతో మార్కెట్లు లాభాలను పండించాయి. గ్లెన్ మార్క్ ఫార్మాస్యూటికల్స్, అరబిందో ఫార్మా కంపెనీలకు కొత్త జెనరిక్ వెర్షన్ లో కొలెస్ట్రాల్ డ్రగ్ కు అమెరికాలో అనుమతి లభించడంతో, ఈ షేర్లు కొనుగోల జోరు కొనసాగించాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 1.62 లాభపడగా.. గ్లెన్ మార్క్ 2.18శాతం, అరబిందో 3.52శాతం ఎగబాకింది. పిరామల్ ఎంటర్ ప్రైజస్, కాడిలా హెల్త్ కేర్ నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ లో టాప్ గెయినర్లుగా ఉన్నాయి. అయితే మంగళవారం ప్రకటించిన తొలి త్రైమాసిక ఫలితాల్లో విప్రో షేర్లు 5.69శాతం మేర కుప్పకూలాయి. దేశంలోనే మూడో అతిపెద్ద సాప్ట్ వేర్ దిగ్గజంగా ఉన్న విప్రో, విశ్లేషకుల అంచనాలను తాకలేకపోవడంతో షేర్లు పడిపోయినట్టు విశ్లేషకులు చెప్పారు. అటు కరెన్సీ మార్కెట్ లో రూపాయ బలహీనంగానే ముగిసింది. 0.07 పైసల నష్టంతో రూ.67.18గా నమోదైంది. ఎంసీఎక్స్ లో 10 గ్రా. పుత్తడి ధర రూ.168 పడిపోయి, 30,926గా ట్రేడ్ అయింది. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 141.46 పాయింట్ల లాభంతో 25243.19 వద్ద నమోదవుతుండగా.. నిప్టీ 29.75 పాయింట్ల లాభంలో 7736.30 వద్ద ట్రేడ్ అవుతోంది. టాటా మోటార్స్,లుపిన్, సన్ ఫార్మా, హెచ్ డీఎఫ్ సీ, హిందాల్కో లు లాభాల్లో నడుస్తుండగా.. అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంకు, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లు నష్టాల్లో నమోదవుతున్నాయి. అదానీ పోర్ట్స్ లో అమ్మకాల ర్యాలీ కొనసాగుతోంది. అదానీ షేర్లు 4 శాతం మేర పడిపోతూ.. నిఫ్టీలో టాప్ లూజర్ గా ఉన్నాయి. మరోవైపు పసిడి, వెండి లాభాల్లో కొనసాగుతున్నాయి. పసిడి 0.38శాతం లాభపడి, 30,106గా నమోదవుతుండగా.. వెండి 0.56శాతం లాభంతో 41,525 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.66.57 పైసలు గా ఉంది. అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధి పట్ల ఇన్వెస్టర్లలో నెలకొన్న అనుమానాలతో వరుసగా మూడు రోజుల నుంచి నష్టాలను చవిచూస్తున్న దేశీయ సూచీలు, నేటి(గురువారం) ట్రేడింగ్ లో కూడా అదే ధోరణితో స్వల్ప లాభాలను మాత్రమే నమోదుచేస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు.