ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 141.46 పాయింట్ల లాభంతో 25243.19 వద్ద నమోదవుతుండగా.. నిప్టీ 29.75 పాయింట్ల లాభంలో 7736.30 వద్ద ట్రేడ్ అవుతోంది. టాటా మోటార్స్,లుపిన్, సన్ ఫార్మా, హెచ్ డీఎఫ్ సీ, హిందాల్కో లు లాభాల్లో నడుస్తుండగా.. అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంకు, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లు నష్టాల్లో నమోదవుతున్నాయి. అదానీ పోర్ట్స్ లో అమ్మకాల ర్యాలీ కొనసాగుతోంది. అదానీ షేర్లు 4 శాతం మేర పడిపోతూ.. నిఫ్టీలో టాప్ లూజర్ గా ఉన్నాయి.
మరోవైపు పసిడి, వెండి లాభాల్లో కొనసాగుతున్నాయి. పసిడి 0.38శాతం లాభపడి, 30,106గా నమోదవుతుండగా.. వెండి 0.56శాతం లాభంతో 41,525 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.66.57 పైసలు గా ఉంది. అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధి పట్ల ఇన్వెస్టర్లలో నెలకొన్న అనుమానాలతో వరుసగా మూడు రోజుల నుంచి నష్టాలను చవిచూస్తున్న దేశీయ సూచీలు, నేటి(గురువారం) ట్రేడింగ్ లో కూడా అదే ధోరణితో స్వల్ప లాభాలను మాత్రమే నమోదుచేస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు.