సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ప్రారంభమైనాయి. వరుసగా నాలుగో రోజు కూడా లాభ పడుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు పాజిటివ్‌గా కొనసాగుతున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ 240 పాయింట్లు ఎగిసి 62268 వద్ద, నిఫ్టీ 65 పాయింట్ల లాభంతో 18380 వద్ద కొన సాగుతున్నాయి.
బలమైన త్రైమాసిక ఫలితాలతో టాటా మోటార్స్ షేరు 4 శాతం ఎగిసి 52 వారాల గరిష్టాన్ని తాకింది. అపోలో హాస్పిటల్స్, ఐషర్ మెటార్స్, టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, బంధన్ బ్యాంక్ టాప్ ఇండెక్స్ గెయినర్‌గా ఉంది. (కేంద్రం గుడ్ న్యూస్: మొబైల్ పోతే..మే 17 నుంచి కొత్త విధానం)
మరోవైపు అదానీ ట్రాన్స్‌మిషన్, ఇతర అదానీ గ్రూప్ కంపెనీలు కూడా నష్టాలతో ట్రేడ్ అతున్నాయి. ముఖ్యంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్ 3.3 శాతం క్షీణించింది. ఇంకా సిప్లా, దివీస్, మారుతి సుజుకి ఐసిఐసిఐ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ , ఇండస్ఇండ్ బ్యాంక్ నష్టపోతున్నాయి.
ఇదీ చదవండి: స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment