కోల్‌కతా: కో లెండింగ్ (ఇతర సంస్థలతో కలసి రుణాలు ఇవ్వడం) వ్యాపారంలోకి తాము అడుగు పెడుతున్నట్టు బంధన్ బ్యాంక్ ఎండీ, సీఈవో చంద్రశేఖర్ ఘోష్ ప్రకటించారు. ఇందుకోసం తాము ఎన్‌బీఎఫ్‌సీలతో జట్టు కడతామని తెలిపారు. బంధన్ బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవం గురువారం కోల్‌కతాలో జరిగింది.
ఈ సందర్భంగా ఘోష్ ఈ ప్రకటన చేశారు. కో లెండింగ్ కింద అన్ని రకాల రుణాలు మంజూరు చేస్తామని చెప్పారు. ఇప్పటికే కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలను ఎంపిక చేశామని, త్వరలోనే వారితో ఒప్పందాలు చేసుకోనున్నట్టు తెలిపారు.
6,100 బ్యాంకింగ్ అవుట్‌లెట్లు
ఎనిమిదేళ్ల క్రితం బంధన్ బ్యాంక్ తన కార్యకలాపాలు ప్రారంభించగా, నేడు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 6,100 బ్యాంకింగ్ అవుట్‌లెట్లు కలిగి ఉన్నట్టు చెప్పారు. జమ్మూ కశ్మీర్లోని లేహ్‌లో తాజాగా ఒక శాఖను తెరవగా, సెప్టెంబర్‌లో కార్గిల్‌లో ఒకటి ప్రారంభించనున్నట్టు తెలిపారు.
తమకు 3 కోట్ల కస్టమర్లు ఉన్నారని, వ్యాపారం రూ.2 లక్షల కోట్లు అధిగమించిందని వెల్లడించారు. కాసా డిపాజిట్ల రేషియో 39 శాతంగా ఉందన్నారు. బ్యాంకు లావాదేవీల్లో 94 శాతం డిజిటల్‌గా నమోదవుతున్నట్టు తెలిపారు. భౌగోళికంగా, రుణ విభాగాల పరంగా తాము మరింత వైవిధ్యాన్ని అమలు చేస్తామని, అందరికీ ఆర్థిక సేవలకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు.
ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్! ఇకపై మరింత..
Comments
Please login to add a commentAdd a comment