tie up
-
జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో పోస్కో జట్టు
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఉక్కు సంస్థ పోస్కో తాజాగా దేశీ దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో జట్టు కట్టింది. భారత్‌లో 5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం (ఎంటీపీఏ) గల సమగ్ర ఉక్కు ప్లాంటు ఏర్పాటు కోసం ఒప్పందం కుదుర్చుకుంది.పెట్టుబడులు, ప్లాంటు నెలకొల్పే ప్రాంతంపై జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఎలాంటి వివరాలు వెల్లడించనప్పటికీ 1 ఎంటీపీఏ ప్రాజెక్టుకు సగటున సుమారు రూ. 8,000 కోట్ల చొప్పున 5 ఎంటీపీఏ ప్రాజెక్టుకు రూ. 40,000 కోట్ల పెట్టుబడులు అవసరమవుతాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ‘భారత్‌లో ఉక్కు, బ్యాటరీ మెటీరియల్స్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భాగస్వామ్యానికి సంబంధించి పోస్కో గ్రూప్‌తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాం’ అని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది.ముంబైలో జరిగిన ఎంవోయూ కార్యక్రమంలో గ్రూప్ చైర్మన్ జిందాల్, పోస్కో చైర్మన్ చాంగ్ ఇన్–హువా తదితరులు పాల్గొన్నారు. ‘భారత్‌లో తయారీ రంగ ముఖచిత్రాన్ని మార్చే విధంగా టెక్నాలజీ, పర్యావరణహితమైన విధానాల విషయంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతాం’ అని జిందాల్ తెలిపారు. ‘కొరియా, భారత్ ఆర్థిక వృద్ధికి ఈ భాగస్వామ్యం గణనీయంగా ఉపయోగపడుతుంది’ అని చాంగ్ ఇన్–హువా పేర్కొన్నారు.ఎంట్రీ కోసం పోస్కో ప్రయత్నాలుభారత మార్కెట్లో ప్రవేశించేందుకు పోస్కో సంస్థ చాలా కాలంగా కసరత్తు చేస్తోంది. గతంలో ఒరిస్సాలో 12 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 12 ఎంటీపీఏ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించింది. అయితే, స్థల సమీకరణలో తీవ్ర జాప్యం జరగడంతో ప్రణాళికలను విరమించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ (వైజాగ్ స్టీల్)తో కూడా జట్టు కట్టే ప్రయత్నం చేసింది.ఆంధ్రప్రదేశ్‌లో మెగా స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి సాధ్యాసాధ్యాల రిపోర్టును తయారు చేసేందుకు ఇరు సంస్థల అధికార్లతో ఒక వర్కింగ్ గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేసినప్పటికీ ఆ ప్రయత్నం కూడా ముందుకు సాగలేదు. -
యువతకు ఫ్లిప్‌కార్ట్ నైపుణ్య శిక్షణ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వేలాది మంది యువతీ, యువకులకు ఫ్లిప్‌కార్ట్ సప్లయ్ చైన్ ఆపరేషన్స్ అకాడమీ (ఎస్సీఓఏ) నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనుంది. ఇందుకు గాను కేంద్ర నైపుణ్యాభివృద్ధి కల్పన శాఖతో అవగాహన ఒప్పందం చేసుకుంది.ఈ-కామర్స్, సరఫరా వ్యవస్థ తదితర విభాగాల్లో ఉద్యోగ నైపుణ్యాలపై ‘ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 కింద శిక్షణ ఇవ్వనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. కళాకారులు, చేనేతలు, స్వయం ఉపాధి సంఘాల మహిళలు, మహిళలు, గ్రామీణ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సాధికారత దిశగా ఐదేళ్ల మైలురాయిని పూర్తి చేసుకున్న సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఒక కార్యక్రమం నిర్వహించింది.ఈ సందర్భంగా అవగాహన ఒప్పందంపై ఫ్లిప్‌కార్ట్ ఎస్సీఓఏ, నైపుణ్య శిక్షణాభివృద్ధి శాఖ అధికారులు సంతకాలు చేశారు. 250 మంది వరకు పారిశ్రామికవేత్తలు, కళాకారులు, విక్రయదారులు, చేనేత కార్మికులు, స్వయం స్వహాయక మహిళలు ఈ కార్యక్రమానికి హాజరైనట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. -
దేశీయంగా ఈవీ బ్యాటరీల తయారీ
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీల తయారీని చేపట్టే దిశగా ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్‌తో దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజాలు హ్యుందాయ్, కియా జట్టు కట్టాయి. భారత్‌లో తమ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విస్తరణ ప్రణాళికలకు అనుగుణంగా ఇందుకు సంబంధించి ఎక్సైడ్ ఎనర్జీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు హ్యుందాయ్ తెలిపింది. దీని ప్రకారం లిథియం–ఐరన్–ఫాస్ఫేట్ (ఎల్ఎఫ్పీ) సెల్స్ తయారీపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు వివరించింది. స్థానికంగా తయారీ వల్ల బ్యాటరీ వ్యయాలు కొంత మేర తగ్గగలవని, తద్వారా ఇతర సంస్థలతో మరింత మెరుగ్గా పోటీపడగలమని హ్యుందాయ్ మోటర్ .. కియా ఆర్అండ్డీ విభాగం హెడ్ హుయి వాన్ యాంగ్ తెలిపారు. భారత మార్కెట్లో తమ బ్యాటరీల అభివృద్ధి, ఉత్పత్తి, సరఫరా తదితర కార్యకలాపాల విస్తరణకు ఎక్సైడ్ ఎనర్జీతో వ్యూహాత్మక భాగస్వామ్యం తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. హ్యుందాయ్ ప్రస్తుతం భారత్‌లో అయోనిక్ 5, కోనా ఎలక్ట్రిక్ వాహనాలను, కియా ఇండియా ఈవీ6 మోడల్‌ను విక్రయిస్తున్నాయి. -
జపాన్ సహకారంతో వేదాంత సెమీకండక్టర్ ప్లాంట్!
న్యూఢిల్లీ: ప్రతిపాదిత సెమీకండక్టర్ ప్లాంటు కోసం జపాన్ టెక్నాలజీ కంపెనీలతో సహకారాన్ని అన్వేషిస్తున్నట్లు వేదాంత గ్రూప్ తెలిపింది. గుజరాత్లో సెమీకండక్టర్ ఫ్యాబ్‌ను నెలకొల్పుతున్నట్టు వేదాంత ఇప్పటికే ప్రకటించింది. జపాన్‌లో జరిగిన వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ రోడ్‌షో సందర్భంగా వేదాంత సెమీకండక్టర్, డిస్ప్లే బిజినెస్ గ్లోబల్ ఎండీ ఆకర్ష్ కె హెబ్బార్ మాట్లాడారు. గుజరాత్‌లోని ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్న కంపెనీలకు ఇది 80 బిలియన్ డాలర్ల అవకాశం అని చెప్పారు. దేశంలోని మొట్టమొదటి ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్‌ను నిర్మించడంలో సహాయం చేయడానికి భాగస్వామ్యం కావాలని జపాన్ కంపెనీలను ఈ సందర్భంగా ఆహ్వానించినట్టు వేదాంత తెలిపింది. భారత సెమీకండక్టర్, గ్లాస్ డిస్ప్లే తయారీ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధిని ప్రోత్సహించడానికి వేదాంత గ్రూప్‌నకు చెందిన అవన్‌స్ట్రేట్ ఇంక్ గత ఏడాది చివర్లో 30 జపనీస్ టెక్నాలజీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. -
కొత్త వ్యాపారంలోకి బంధన్ బ్యాంక్.. త్వరలో ఒప్పందాలు
కోల్‌కతా: కో లెండింగ్ (ఇతర సంస్థలతో కలసి రుణాలు ఇవ్వడం) వ్యాపారంలోకి తాము అడుగు పెడుతున్నట్టు బంధన్ బ్యాంక్ ఎండీ, సీఈవో చంద్రశేఖర్ ఘోష్ ప్రకటించారు. ఇందుకోసం తాము ఎన్బీఎఫ్సీలతో జట్టు కడతామని తెలిపారు. బంధన్ బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవం గురువారం కోల్‌కతాలో జరిగింది. ఈ సందర్భంగా ఘోష్ ఈ ప్రకటన చేశారు. కో లెండింగ్ కింద అన్ని రకాల రుణాలు మంజూరు చేస్తామని చెప్పారు. ఇప్పటికే కొన్ని ఎన్బీఎఫ్సీలను ఎంపిక చేశామని, త్వరలోనే వారితో ఒప్పందాలు చేసుకోనున్నట్టు తెలిపారు. 6,100 బ్యాంకింగ్ అవుట్లెట్లు ఎనిమిదేళ్ల క్రితం బంధన్ బ్యాంక్ తన కార్యకలాపాలు ప్రారంభించగా, నేడు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 6,100 బ్యాంకింగ్ అవుట్లెట్లు కలిగి ఉన్నట్టు చెప్పారు. జమ్మూ కశ్మీర్‌లోని లేహ్‌లో తాజాగా ఒక శాఖను తెరవగా, సెప్టెంబర్‌లో కార్గిల్‌లో ఒకటి ప్రారంభించనున్నట్టు తెలిపారు. తమకు 3 కోట్ల కస్టమర్లు ఉన్నారని, వ్యాపారం రూ.2 లక్షల కోట్లు అధిగమించిందని వెల్లడించారు. కాసా డిపాజిట్ల రేషియో 39 శాతంగా ఉందన్నారు. బ్యాంకు లావాదేవీల్లో 94 శాతం డిజిటల్‌గా నమోదవుతున్నట్టు తెలిపారు. భౌగోళికంగా, రుణ విభాగాల పరంగా తాము మరింత వైవిధ్యాన్ని అమలు చేస్తామని, అందరికీ ఆర్థిక సేవలకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్! ఇకపై మరింత.. -
పీటీఐతో సోనీ ఇండియా జట్టు
న్యూఢిల్లీ: దేశీయంగా అతి పెద్ద స్వతంత్ర న్యూస్ ఏజెన్సీ అయిన పీటీఐకి ప్రత్యేకంగా డిజిటల్ ఇమేజింగ్ సొల్యూషన్స్ అందించేలా సోనీ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా ప్రెస్ట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఫొటోగ్రాఫర్లు, వీడియో జర్నలిస్టులకు సోనీ ఇండియా ఎక్స్‌క్లూజివ్ డిజిటల్ ఇమేజింగ్ సొల్యూషన్స్ సరఫరాదారుగా ఉంటుంది. ఆయా ఉత్పత్తులను వాడటంలో వారికి శిక్షణ కూడా ఇస్తుంది. పీటీఐ వంటి విశ్వసనీయ న్యూస్ ఏజెన్సీతో జట్టు కట్టడం తమకు ఎంతో ప్రతిష్టాత్మకమైన విషయమని సోనీ ఇండియా ఎండీ సునీల్ నయ్యర్ తెలిపారు. మరోవైపు వీడియో జర్నలిజంలోకి అడుగుపెడుతున్న తమకు.. కొంగొత్త టెక్నాలజీలను ఆవిష్కరించడంలో ముందుండే సోనీతో భాగస్వామ్యం ఎంతగానో ప్రయోజనకరమని పీటీఐ సీఈవో విజయ్ జోషి చెప్పారు. పీటీఐ ప్రతి రోజూ 2,000 పైచిలుకు స్టోరీలు, 200 పైగా ఫొటోగ్రాఫ్‌లను సుమారు 500పైగా భారతీయ వార్తాపత్రికలకు అందిస్తోంది. చదవండి: అన్ని మోడళ్ల కార్లను మార్చేస్తున్న వోల్వో.. కారణం ఇదే! -
పంజాబ్‌లో కొత్త పొత్తు పొడిచింది
చండీగఢ్: పంజాబ్‌లో శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) చేతులు కలిపాయి. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఎస్ఏడీ చీఫ్ సుఖ్బీర్సింగ్ బాదల్, బీఎస్పీ ప్రధాన కార్యదర్శి సతీశ్‌చంద్ర మిశ్రా శనివారం సంయుక్తంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నట్టు వెల్లడించారు. మొత్తం 117 స్థానాలున్న పంజాబ్‌లో బీఎస్పీకి 20 స్థానాలు కేటాయించారు. మిగిలిన 97 స్థానాల్లో అకాలీదళ్ పోటీ చేస్తుంది. పంజాబ్ రాజకీయాల్లో ఇది చరిత్రాత్మకమైన రోజని ఈ సందర్భంగా సుఖ్బీర్సింగ్ బాదల్ వ్యాఖ్యానించారు. ఎన్నికల వ్యూహాలను రచించడానికి త్వరలోనే ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇన్నాళ్లూ బీజేపీతో కలిసి ఉన్న శిరోమణి అకాలీదళ్ కేంద్రం తీసుకువచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గత ఏడాది ఎన్డీయేకి గుడ్‌బై కొట్టేసింది. పంజాబ్, హరియాణాకు చెందిన రైతులే ఎక్కువగా ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగడంతో మోదీ ప్రభుత్వంలో ఉన్న ఒకే ఒక్క అకాలీదళ్ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా చేశారు. ఎస్ఏడీతో పొత్తును బీఎస్పీ చీఫ్ మాయావతి సరికొత్త సామాజిక ముందడుగు అని అభివర్ణించారు. పొత్తుతో సమాఖ్య ప్రజాస్వామ్య విప్లవం ప్రారంభమవుతుందని ప్రకాశ్‌సింగ్ బాదల్ అన్నారు. దళిత ఓటు బ్యాంకు కొల్లగొట్టడమే లక్ష్యం పంజాబ్ రాష్ట్రంలో దాదాపు 32 శాతం ఓట్లు దళితులవే కావడంతో వారి ఓట్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా బీఎస్పీతో అకాలీదళ్ చేతులు కలిపింది. జలంధర్, హోషియార్పూర్, నవాన్షహర్, కపుర్తలా జిల్లాల్లో దళితులు అధికంగా కేంద్రీకృతమై ఉన్నారు. డోవుబా ప్రాంతంలో బీఎస్పీకి మంచి ఆదరణ ఉంది. వచ్చే ఎన్నికల్లో మాల్వా ప్రాంతంలో ఏడు సీట్లు, మాజాలో అయిదు, డోవుబాలో ఎనిమిది స్థానాల్లో బీఎస్పీ పోటీ చేయనుంది. 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అకాలీదళ్, బీఎస్పీ కలిసి పోటీచేసి 13 ఎంపీ స్థానాలకు గాను 11 సీట్లను కొల్లగొట్టి తమ పొత్తుకి ఎదురులేదని నిరూపించాయి. అప్పట్లో మూడు స్థానాల్లో పోటీ చేసిన బీఎస్పీ అన్నింట్లోనూ విజయం సాధించింది. మళ్లీ 25 ఏళ్ల తర్వాత ఒక్కటైన ఆ పార్టీలు వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని ధీమాగా ఉన్నాయి. చదవండి: బీజేపీ నేతల మూకుమ్మడి రాజీనామా.. ఇరకాటంలో చీఫ్ -
గూగుల్ తేజ్-రిలయన్స్ ఎనర్జీ జత
రిలయన్స్ ఎనర్జీ తన మొబైల్ అప్లికేషన్ ఉపయోగించి బిల్లు చెల్లింపులను ప్రారంభించడానికి గూగుల్‌తో జత కట్టింది. గూగుల్‌కు చెందిన యూపీఐ ఆధారిత చెల్లింపుల యాప్ గూగుల్ తేజ్‌తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనికోసం గూగుల్ తేజ్ యాప్‌ను డౌన్ చేసుకొని తమ బ్యాంకు ఖాతా, రిజిస్టర్డ్ ఫోన్ బ్యాంకింగ్ మొబైల్ నెంబర్ నమోదు కావాల్సింది ఉంటుంది. దీంతో రిలయన్స్ ఎనర్జీ ద్వారా విద్యుత్ బిల్లు చెల్లింపులు సులువుగా చేసుకోవచ్చు. అలాగే గూగుల్ తేజ్ తో జత కట్టిన తొలి సంస్థగా రిలయన్స్ ఎనర్జీ నిలిచింది. ఈ డీల్ పై రిలయన్స్ ఎనర్జీ ప్రతినిధి మాట్లాడుతూ గూగుల్ తేజ యాప్ సహాయంతో ఇల్లు, కార్యాలయంలో నుంచే ఫింగర్ టిప్స్ ద్వారా అతి సులువుగా విద్యుత్ బిల్లు చెల్లింపులు చేసుకోవచ్చని చెప్పారు. ఇతర ఆన్లైన్ చెల్లింపు ఎంపికలతో పోలిస్తే, చెల్లింపులను చేయడానికి గూగుల్ తేజ్‌లో తక్కువ సమయం పడుతుంది. కార్డు వివరాలు, సీవీవీ నంబరు, ఓటీపీ లాంటి ఇతర ప్రక్రియలను నమోదు చేయవలసిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. తద్వారా 25 లక్షల వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది. దీంతో పాటు గూగుల్ సహకారంతో వివిధ ఆఫర్లు కూడా అందిస్తున్నట్టు ప్రకటించారు. కాగా రిలయన్స్ ఎనర్జీ చెల్లింపులో సుమారు 35శాతం డిజిటల్ మోడ్‌లో జరుగుతుండగా , పేటీఎం, పే ఎమనీ, ఫ్రీఛార్జ్, బిల్ డెస్క్ ,యుపిఐ బేస్డ్ ఫోన్ పే తో ఇప్పటికే భాగస్వామ్యం ఉంది. గత నెలలో అనిల్ అంబానీ గ్రూప్ కు చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆర్ఇన్ఫ్రా) రిలయన్స్ ఎనర్జీని అదానీ దక్కించు కుంది. ముంబైలోని విద్యుదుత్పత్తి, పంపిణీ, పంపిణీ వ్యాపారంలోని 100శాతం వాటాను మొత్తం రూ.18,800 కోట్లకు తమ గౌతమ్ అదాని నాయకత్వంలోని అదాని ట్రాన్స్మిషన్కు విక్రయించింది. -
ఫ్రాన్స్ ఎయిర్‌లైన్స్‌తో జెట్ ఒప్పందం
సాక్షి, ముంబై: అంతర్జాతీయ విమాన సర్వీసులను మరింత విస్తరించే లక్ష్యంతో జె ట్ ఎయిర్వేస్ మరో కీలక ఒప్పందం చేసుకుంది. ఎయిర్ ఫ్రాన్స్ కేఎల్ఎం, డెల్టా ఎయిర్ లైన్స్‌తో భారీ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. యూరోప్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు గాను ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. జెట్ ఛైర్మన్ నరేష్ గోయెల్ , ఎయిర్ ఫ్రాన్స్-కెఎల్ఎం చీఫ్ జెఎం జనైల్లాక్ బుధవారం భారతదేశంలో కోడ్ భాగస్వామ్యంపై అధికారిక ప్రకటన చేశారు. కనెక్టివిటీని మరింత విస్తరించుకునే లక్ష్యంగా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు జెట్ ఎయిర్వేస్ సీఈవో వినయ్ దుబే ప్రకటించారు. అయితే ఈ రెండు ఎయిర్‌లైన్స్ ఈక్విటీ వాటాను ప్రకటించలేదు అలాగే ఇతిహాద్‌తో తమ భాగస్వామ్యం కొనసాగుతుందని కూడా స్పష్టం చేశారు. పెరుగుతున్న పోటీ నేపథ్యంలో అంతర్జాతీయ రవాణాదారులు మార్గాల్లో విస్తరిస్తున్నామనీ ,తమకు గల్ఫ్ ఒక ముఖ్యమైన మార్కెట్‌గా కొనసాగుతుంది. దాని కార్యకలాపాలను తగ్గించదని జెట్ ఛైర్మన్ నరేష్ గోయెల్ విలేకరులకు తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం నాటి ట్రేడింగ్‌లో జెట్‌ఎయిర్‌వేస్ కౌంటర్ బాగా లాభపడింది. కాగా ఇండియన్ అంతర్జాతీయ ఎయిర్ ట్రాఫిక్ వృద్ధి చెందుతున్న నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్లో ఇతిహాద్ సహా మూడు పెద్ద గల్ఫ్ సంస్థలు 24 శాతం వాటాను కలిగి ఉన్నాయి. జెట్ ఎయిర్వేస్ గ్రూప్ ప్రస్తుతం 115 విమానాల విమానాలను నిర్వహిస్తుండగా, ఎయిర్ ఫ్రాన్స్-కెఎల్ఎం 34 విమానాల విమానాలను కలిగి ఉంది. -
ఇస్రోతో ఎంవోయూ కుదుర్చుకున్న తొలి రాష్ట్రం
-
మైక్రోసాప్ట్‌తో చేతులు కలపిన ఐడియా
-
పొత్తుపై పునరాలోచన !
-
పొత్తుపై పునరాలోచన !
టీడీపీతో దోస్తీపై బీజేపీలో అంతర్మథనం ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు బెట్టుతో బీజేపీ అధినాయకత్వంలో చిరాకు సాక్షి, న్యూఢిల్లీ: నిన్నటిదాకా బీజేపీతో జతకట్టేందుకు తహతహలాడిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. సీట్ల సర్దుబాబు విషయంలో అనుసరిస్తున్న వైఖరి బీజేపీ అధినాయకత్వానికి చిరాకు తెప్పిస్తోందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అసలు బాబుతో పొత్తు ఎందుకని ఇప్పటికే అటు తెలంగాణ బీజేపీ నాయకులు తేల్చి చెప్పగా.. ఇప్పుడు సీమాంధ్ర బీజేపీ నేతల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో బీజేపీ అధినాయకత్వం అంతర్మథనంలో పడింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ చూసి ఆయనతో జతకట్టేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పడిగాపులు కాశారు. అయితే ఇటీవల టీడీపీలోకి వలసలు పెరగడంతో బాబు తన వ్యూహం మార్చారు. పొత్తుకు సరే అన్నా.. బీజేపీ అధినాయకత్వం అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు ససేమిరా అన్నట్టు సమాచారం. ఇప్పటికే పొత్తు రాయబారం నడిపేందుకు వచ్చిన బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్‌జవదేకర్ ఇదే విషయాన్ని తన పార్టీ అధిష్టానానికి నివేదించారు. రాష్ట్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉండడంతో బీజేపీ అధినాయకత్వం తెలంగాణ, సీమాంధ్రలో టీడీపీతో పొత్తు అవసరమా అన్న మీమాంసలో పడింది. చంద్రబాబు కొత్త కండిషన్లు: బీజేపీ అధిష్టానం నుంచి తెలంగాణ, సీమాంధ్రకు సంబంధించి సీట్ల సర్దుబాబు విషయంలో టీడీపీకి రెండు ప్రతిపాదనలు వచ్చాయి. సీమాంధ్రలో 6 ఎంపీ సీట్లు, 25 ఎమ్మెల్యే స్థానాలను తమకు ఇవ్వాలని బీజేపీ ప్రతిపాదించింది. అలాగే తెలంగాణలో టీడీపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో అక్కడ 60 ఎమ్మెల్యే, 11 ఎంపీ సీట్లు తమకు ఇవ్వాలని బీజేపీ నాయకులు కోరారు. చివరికి సీమాంధ్రలో 18 ఎమ్మెల్యే, 5 ఎంపీ స్థానాలకు, తెలంగాణలో 9 ఎంపీ, 55 నుంచి 53 వరకు ఎమ్మెల్యే సీట్లు తమకు కేటాయించినా సర్దుకుపోయేందుకు బీజేపీ సిద్ధమైంది. ఇరు ప్రాంతాల్లో అన్ని సీట్లు సర్దుబాబు చేయలేమని బాబు కొత్త కండిషన్లు తెరపైకి తెస్తూ పొత్తులకు సుముఖంగా లేనట్టుగా వ్యవహరించారని.. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో పొత్తులపై ఏం చేయాలో మీరే తేల్చుకోవాలంటూ సీమాంధ్ర, తెలంగాణ కమిటీలకు బీజేపీ అధినాయకత్వం తేల్చి చెప్పింది. ముందునుంచే టీడీపీతో పొత్తుకు వ్యతిరేకత వ్యక్తం చేసిన రాష్ట్ర బీజేపీ నాయకులంతా ఇప్పుడు ముక్తం కంఠంతో పొత్తు వద్దేవద్దని సూచిస్తున్నారు. అసెంబ్లీ స్థానాలపై కాస్త తగ్గుదాం!: అయితే.. టీడీపీతో పొత్తు పెట్టుకొనే ఎన్నికలకు వెళ్లాలని బలంగా కోరుకుంటున్న బీజేపీ తెలంగాణ సీనియర్ నేతలు పలువురు.. ఈ అంశంపై పార్టీ అధిష్టానంతో మాట్లాడాలని భావిస్తున్నట్టు సమాచారం. అసెంబ్లీ స్థానాల విషయంలో కాస్త వెనక్కు తగ్గటం మంచిదేనని అధిష్టానంతో చెప్పాలన్నది వారి ఉద్దేశంగా తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జిగా జవదేకర్ తెలంగాణ, సీమాంధ్ర బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్గా పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్‌జవదేకర్‌ను పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ నియమించారు. మరోనేత రాజ్‌పురోహిత్‌ను కో-ఇన్చార్జ్గా నియమించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
బీజేపీ, టీడీపీ పొత్తుపై తేలని లెక్కలు
-
కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు ఖరారు
-
బీజేపీ, టీడీపీ పొత్తుపై తేలని లెక్కలు
సాక్షి, హైదరాబాద్: ఎటూ తేలక ప్రతిష్టంభన ఏర్పడిన బీజేపీ-తెలుగుదేశం పార్టీల పొత్తు వ్యవహారం ఢిల్లీకి మారింది. మూడు రోజుల పాటు నగరంలో మకాం వేసిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్ ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేక తుదకు బాధ్యతను అధిష్టానానికి అప్పగించేశారు. పలు దఫాలుగా పార్టీ నేతలతో చర్చలు జరిపిన ఆయన ఆదివారం ఉదయం ఢిల్లీ వెళ్లిపోయారు. వాస్తవానికి ఆదివారం పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ హైదరాబాద్ రావాల్సి ఉన్నప్పటికీ, ఆయన స్థాయిలో కూడా ఈ అంశం కొలిక్కి వచ్చే అవకాశం లేదన్న ఉద్దేశంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ వద్దే మాట్లాడదామని జవదేకర్నే ఢిల్లీకి రమ్మని కబురు పెట్టారు. దీంతో ఇక పొత్తుల సంగతి ఢిల్లీలోనే తేలాల్సి ఉంది. పట్టు వీడని నేతలు... తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడ్డ దేశంతో పొత్తుకు ససేమిరా అంటున్న రాష్ట్ర కమలనాథుల్లో కొందరు... వీలైనన్ని స్థానిక పార్టీలతో పొత్తులు, అవగాహనలతో ఎన్నికలకు వెళ్లాలని జాతీయ స్థాయిలో పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి కాస్త మెత్తబడ్డా సీట్ల సర్దుబాటు విషయంలో మాత్రం వెనక్కు తగ్గేందుకు సిద్ధంగా లేరు. కచ్చితంగా 60కి తగ్గకుండా ఎమ్మెల్యే స్థానాలు, 9 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ పోటీ చేయాల్సిందేనని ఖరాఖండిగా చెప్పేశారు. జవదేకర్‌తో ఆదివారం ఉదయం మరోసారి భేటీ అయిన పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. జవదేకర్‌తో పలుమార్లు ఫోన్లో మాట్లాడిన టీడీపీ నేత సుజనాచౌదరి, బీజేపీకి 40 కంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు ఇచ్చే అవకాశం లేదని చెప్పటాన్ని కిషన్‌రెడ్డి తీవ్రంగా పరిగణిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి స్థానికంగా గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నందున, ఈ సంఖ్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గొద్దని స్పష్టంచేశారు. టీడీపీకూడా మొండిపట్టుమీదే ఉంటే పొత్తు విషయంలో పునరాలోచించటమే ఉత్తమమనే సంకేతాన్ని ఆయన అధిష్టానానికి పంపారు. దీంతో చేసేదీమీ లేక జవదేకర్ విషయాన్ని అటు అరుణ్‌జైట్లీకి, ఇటు పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌కు తెలిపి ఢిల్లీ విమానమెక్కారు. మరోవైపు పొత్తు విషయం సుతరామూ ఇష్టంలేని ఆర్ఎస్ఎస్ ముఖ్య నేత ఒకరు ఆదివారం కిషన్‌రెడ్డితో భేటీ అయినట్టు సమాచారం. గెలిచే అవకాశం ఉన్న స్థానాలను పొత్తు పేరుతో వదులుకోవద్దని సూచించినట్టు తెలిసింది. నాలుగైదు ఎంపీ స్థానాలు గెలవడం ముఖ్యం.. మరోవైపు పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ కూడా రాష్ట్ర నేతలతో ఆదివారం మాట్లాడినట్టు తెలిసింది. తెలంగాణ నుంచి నాలుగైదు ఎంపీ స్థానాలు రావటమే ఇప్పుడు ముఖ్యమని, అది పొత్తుతోనా... లేకుండానా అనేది మీరే నిర్ణయించుకోండని పేర్కొన్నట్టు సమాచారం. దీంతో పొత్తు వద్దనే కిషన్‌రెడ్డి సహా ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు బలం చేకూరినట్టయింది. తెలంగాణలో ‘ఏ’ కేటగిరీగా పార్టీ గుర్తించిన ఆరు స్థానాల్లో కచ్చితంగా నాలుగు స్థానాలు గెలవగలమనే ధీమాను మోడీకి కలిగించాలని వారు భావిస్తున్నారు. -
కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు ఖరారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు పొడిచింది. సీపీఐకి ఒక ఎంపీ స్థానం, 12 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి అధిష్టానం సూత్రప్రాయంగా అంగీకరించిందని టీపీసీసీలోని అత్యంత విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మొదట సీపీఐ మూడు ఎంపీ స్థానాలు(ఖమ్మం, భువనగిరి, నల్లగొండ), 20 అసెంబ్లీ స్థానాలను అడిగింది. పొత్తులపై చర్చలు సాగుతున్న దశలో కనీసం 14 అయినా ఇవ్వాలని పట్టుబట్టింది. అయితే తమకున్న ఇబ్బందుల దృష్ట్యా 12కు మించి ఇవ్వలేమని కాంగ్రెస్ తేల్చి చెప్పడంతో సీపీఐ వాటికే అంగీకరించినట్లు తెలుస్తోంది. ఎంపీల విషయానికొస్తే సీపీఐ మూడు స్థానాలు అడిగినప్పటికీ ఒక్కటి కూడా ఇవ్వలేమని తొలుత కాంగ్రెస్ ఖరాఖండిగా చెప్పేసింది. కానీ, సీపీఐ కనీసం ఒక ఎంపీ స్థానమైనా కావాల్సిందేనని పట్టుబట్టడంతో.. ఖమ్మం లేదా భువనగిరిలలో ఒకటి తీసుకోవాలని కాంగ్రెస్ సూచించింది. అయితే తమ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి నల్లగొండలో పోటీ చేయాలని భావిస్తున్నారని, ఆయన కోసం ఈ స్థానాన్ని వదిలేయాలని సీపీఐ కోరడంతో కాంగ్రెస్ మెత్తబడి అందుకు అంగీకరించినట్లు సమాచారం. సురవరం సీపీఐ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నందున భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని నల్లగొండను ఇవ్వడానికి కాంగ్రెస్ సమ్మతించింది. నల్లగొండ సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిని మునుగోడు అసెంబ్లీకి పంపుతున్నట్లు తెలిసింది. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో మూడేసి చొప్పున, కరీంనగర్లో రెండు, మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్, ఆదిలాబాద్‌లో ఒక్కోటి చొప్పున అసెంబ్లీ స్థానాలను సీపీఐ కోరుతోంది. ఒకట్రెండు రోజుల్లో పొత్తును అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. -
టీడీపీతో పొత్తు తప్పదు.. సర్డుకుపోండి
టీడీపీతో దోస్తీపై బీజేపీ రాష్ట్ర నేతలకు జవదేకర్ స్పష్టీకరణ జైట్లీ దూతగా వచ్చి.. ఇరు ప్రాంత నేతలతో భేటీ తెలంగాణలో కనీసం 8 లోక్‌సభ సీట్లకు పట్టుబట్టాలని స్థానిక నేతల యోచన సాక్షి, హైదరాబాద్: బీజేపీ, తెలుగుదేశం పొత్తుపై ఉత్కంఠ వీడుతోంది. రెండు పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖాయమైంది. ఇక అధికారిక ప్రకటనే మిగిలి ఉంది. పొత్తు బాధ్యతను నెత్తికెత్తుకున్న పార్టీ నేత అరుణ్‌జైట్లీ దూతగా వచ్చిన ప్రకాశ్ జవదేకర్.. జాతీయ నాయకత్వం మనసులోని మాటను పార్టీ రాష్ట్ర నేతలకు వివరించారు. పొత్తు అనివార్యమని, సర్దుకుపోవాలని సూచించారు. 19న ఢిల్లీలో జరిగే పార్లమెంటరీ బోర్డు సమావేశం పొత్తుల వ్యవహారాన్ని ఖరారు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర నేతల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు జవదేకర్ హుటాహుటిన ఆదివారం హైదరాబాద్ వచ్చారు. పార్టీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నేతలతో విడివిడిగా భేటీ అయ్యారు. పొత్తుపై తుది నిర్ణయాన్ని ప్రకటించబోయే ముందు పార్టీ రాష్ట్ర నేతల్ని సంప్రదించమని పార్లమెంటరీ బోర్డు ఆదేశించిందని, అందుకే వచ్చానని చెబుతూనే.. జాతీయ అవసరాల దృష్ట్యా చంద్రబాబుతో పొత్తు అవసరమని కేంద్ర నాయకత్వం భావిస్తోందని ఆయన చెప్పినట్టు తెలిసింది. ఒక రాష్ట్రంలో పొత్తుకు టీడీపీ అంగీకరించడం లేదని, ఉంటే రెండు రాష్ట్రాల్లో ఉండాలి.. లేకుంటే అవసరం లేదని చంద్రబాబు చెబుతున్నట్టు వివరించారు. దీంతో తెలంగాణ నేతలు కొందరు తొలుత ఆవేదన వ్యక్తం చేసినా.. జాతీయ పార్టీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. ఎనిమిదికి పట్టుబట్టాలని నిర్ణయం: బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీ ఆదివారం మరోసారి భేటీ అయింది. పొత్తుతో నిమిత్తం లేకుండా కసరత్తు ప్రారంభించిన నేతలు జవదేకర్‌తో భేటీ అనంతరం కనీసం 8 లోక్‌సభ సీట్లకైనా పట్టుబట్టాలనుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పరిస్థితి మారినందున తమదే పైచేయి కావాలని బీజేపీ కోరుకుంటున్నప్పటికీ, టీడీపీ అందుకు సిద్ధంగా లేదు. పొత్తులో భాగంగా 2004లో బీజేపీ.. హైదరాబాద్, సికింద్రాబాద్, మెదక్, కరీంనగర్, నల్లగొండలో పోటీ చేసి అన్ని చోట్లా ఓటమి పాలైంది. ఇప్పుడు తెలంగాణ తెచ్చింది తామేనన్న నినాదంతో ముందుకు వెళ్లాలనుకుంటోంది. ప్రస్తుతం గుర్తించిన తొలి కేటగిరీ సీట్లు- సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మహబూబ్‌నగర్, నిజమాబాద్, భువనగిరి, కరీంనగర్, హైదరాబాద్‌తోపాటు మెదక్ లేదా జహీరాబాద్, మహబూబాబాద్ లేదా ఏదైనా ఒక ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాన్ని కోరాలనుకుంటున్నట్టు తెలిసింది. అయితే మల్కాజ్గిరి సీటుపై టీడీపీ పట్టుబట్టే అవకాశం ఉంది. ఈ సీటు నుంచే చంద్రబాబు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఉన్న సీమాంధ్రులు తెలుగుదేశం పార్టీకైతేనే ఓట్లు వేస్తారని వాదిస్తుండగా, బీజేపీ తోసిపుచ్చుతోంది. ఈ సీటు తనకే కచ్చితంగా వస్తుందని భావిస్తున్న ఇంద్రసేనారెడ్డి.. ఇప్పటికే ప్రచారం కూడా చేపట్టారు. నియోజకవర్గంలో బలంగా ఉన్న ఓ సామాజిక వర్గం ఓట్లు తమకు తప్ప వేరే వారికి పడవని వివరించడానికి బీజేపీ అన్ని గణాంకాలతో సిద్ధమైంది. ఈ వారంలో తేల్చేస్తాం తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందా, ఉండదా అన్న ప్రశ్నకు ప్రకాశ్ జవదేకర్ సూటిగా సమాధానమివ్వలేదు. ఈ విషయాన్ని ఈ వారంలో తేల్చేస్తామని విలేకరులకు వివరించారు. ప్రస్తుతం మాట్లాడుతున్నామని, తర్వాత చెబుతామని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కనుమరుగవుతుందని, 300కి పైగా సీట్లు బీజేపీకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ మరిన్ని సీట్లు సాధించగలమన్నారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలిసిపోయినందున ఓటమి నెపాన్ని ప్రధాని మన్మోహన్పై మోపి సోనియాను, రాహుల్‌ను కాపాడే ప్రయత్నం మొదలైందని.. కాంగ్రెస్ నేత పీసీ చాకో ప్రధానిపై చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనమని జవదేకర్ విమర్శించారు. -
కాంగ్రెస్‌లో పొత్తు ఉండాలా?వద్దా?
-
పొత్తుపై టీడీపీకి ఆశా ‘కిరణం’!
ఎలాగైనా సరే వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిందేనని డిసైడయిన టీడీపీ.. తమతో పొత్తులకొచ్చే పార్టీల కోసం బూతద్ధం పెట్టి వెతుకుతోంది. పార్టీలు మారి వచ్చే వారిని చేర్పించుకోవడానికి ప్యాకేజీలు ప్రకటించిన తరహాలోనే పార్టీలకూ టోకుగా ప్యాకేజీని సిద్ధంగా ఉంచినా.. టీడీపీతో పొత్తంటేనే వామ్మో అని అన్ని పార్టీలు భయపడుతున్నాయట. ఆ పార్టీ నాయకత్వాన్ని జనం నమ్మడం లేదని, అలాంటి పార్టీతో పొత్తేంటని ముఖం మీదే చెప్పేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు బాధపడిపోతున్నారు. మనతో పొత్తంటే పార్టీలు ఎగిరి గంతేసి ముందుకొచ్చిన రోజులు పోయి ఇలా అయిందేంటబ్బా అని మథనపడుతున్న తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు సన్నిహిత నేత ఒకరు శుభవార్త చెప్పారట. మనతో పొత్తు పెట్టుకుని కలిసి పని చేయడానికి ఆశా కిరణంలా కొత్త పార్టీ రాబోతోందని చెప్పడంతో తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు తెగ ఆనందపడిపోతున్నారట. అదేంటి సీఎం కిరణ్ ఏర్పాటు చేయబోతున్న కొత్త పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందన్న గ్యారంటీ ఏంటి? ఏమాత్రం అనుమానం అక్కరలేదు. పొత్తు గ్యారంటీ...! ‘ఒక్కొక్కరం ఏమీ చేయలేం...! అందుకే వచ్చే ఎన్నికలను ఎదుర్కొనడానికి ఏం చేయాలన్న దానిపై మన అధినేతతో ముందుగానే చర్చలు జరిగిపోయాయి. పార్టీ ఎప్పుడు పెట్టాలి? ఏం చేయాలి? ముందుగానే డిసైడైంది! విజయవాడలో జరిగిన ఒక సమావేశంలో లగడపాటి, మన పార్టీ నేతలు, కొత్త పార్టీలోకొచ్చే మిగతా వాళ్లంతా ఒకే వేదికపై కూర్చున్నది చూడలేదా...?’ అని టీడీపీ నేత ఒకరు చెప్పడంతో తమ్ముళ్లు హమ్మయ్య.. అనుకున్నార్ట! -
టీడీపీతో పొత్తు ఉండదు
ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ మునిగే నావ లాంటిదని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యన్నగారి భూమ య్య అన్నారు. పట్టణంలోని ఆర్అండ్బీ విశ్రాంతి భవనంలో గురువారం నిర్వహించిన బీజేపీ అసెంబ్లీ శాఖ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీతో బీజేపీ పొత్తుపెట్టుకుంటుందని వస్తున్న ఆరోపణలు అ వాస్తవమని, తాము ఏ పార్టీతో పొత్తుపెట్టుకోవడంలేద ని స్పష్టం చేశారు. టీడీపీ మనుగడ కోసమే తమ జాతీ య నాయకులను చంద్రబాబు సంప్రదిస్తున్నాడని తెలి పారు. ఆ పార్టీతో పొత్తు ఉండదని తమకు బీజేపీ జాతీ య నాయకులు భరోసా ఇచ్చారని చెప్పారు. అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పనున్నారని పేర్కొన్నారు. యువ ఓటర్లు నరేంద్రమోడీ నాయకత్వం కోరుకుంటున్నారని తెలిపా రు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ, పార్లమెం ట్ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. దుర్గం రాజేశ్వర్‌కు సన్మానం.. డీసీసీబీ డెరైక్టర్ల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇటీవల ఎన్నికైన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రాజేశ్వర్‌ను ఆ పార్టీ నాయకులు శాలువా, పూలమాలలతో సన్మానించారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాజేశ్వర్ పేర్కొన్నారు. బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి జనగం సంతోష్, జిల్లా ఉపాధ్యక్షుడు మడావి రాజు, పట్టణ అధ్యక్షుడు జోగు రవి, నాయకులు గందె విజయ్‌కుమార్, వేణుగోపాల్, ఉమాఉత్తర్వార్, రమేశ్, సుభాష్ జాదవ్, గందె కృష్ణకుమార్, నరేంద్రడోక్వాల్, మహేశ్ పాల్గొన్నారు.