ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ మునిగే నావ లాంటిదని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యన్నగారి భూమ య్య అన్నారు.
ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ మునిగే నావ లాంటిదని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యన్నగారి భూమ య్య అన్నారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనంలో గురువారం నిర్వహించిన బీజేపీ అసెంబ్లీ శాఖ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీతో బీజేపీ పొత్తుపెట్టుకుంటుందని వస్తున్న ఆరోపణలు అ వాస్తవమని, తాము ఏ పార్టీతో పొత్తుపెట్టుకోవడంలేద ని స్పష్టం చేశారు. టీడీపీ మనుగడ కోసమే తమ జాతీ య నాయకులను చంద్రబాబు సంప్రదిస్తున్నాడని తెలి పారు. ఆ పార్టీతో పొత్తు ఉండదని తమకు బీజేపీ జాతీ య నాయకులు భరోసా ఇచ్చారని చెప్పారు. అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పనున్నారని పేర్కొన్నారు. యువ ఓటర్లు నరేంద్రమోడీ నాయకత్వం కోరుకుంటున్నారని తెలిపా రు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ, పార్లమెం ట్ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు.
దుర్గం రాజేశ్వర్‌కు సన్మానం..
డీసీసీబీ డెరైక్టర్ల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇటీవల ఎన్నికైన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రాజేశ్వర్‌ను ఆ పార్టీ నాయకులు శాలువా, పూలమాలలతో సన్మానించారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాజేశ్వర్ పేర్కొన్నారు. బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి జనగం సంతోష్, జిల్లా ఉపాధ్యక్షుడు మడావి రాజు, పట్టణ అధ్యక్షుడు జోగు రవి, నాయకులు గందె విజయ్‌కుమార్, వేణుగోపాల్, ఉమాఉత్తర్‌వార్, రమేశ్, సుభాష్ జాదవ్, గందె కృష్ణకుమార్, నరేంద్రడోక్వాల్, మహేశ్ పాల్గొన్నారు.