రిలయన్స్ ఎనర్జీ తన మొబైల్ అప్లికేషన్ ఉపయోగించి బిల్లు చెల్లింపులను ప్రారంభించడానికి గూగుల్‌తో జత కట్టింది. గూగుల్‌కు చెందిన యూపీఐ ఆధారిత చెల్లింపుల యాప్ గూగుల్ తేజ్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనికోసం గూగుల్ తేజ్ యాప్‌ను డౌన్ చేసుకొని తమ బ్యాంకు ఖాతా, రిజిస్టర్డ్ ఫోన్ బ్యాంకింగ్ మొబైల్ నెంబర్ నమోదు కావాల్సింది ఉంటుంది. దీంతో రిలయన్స్ ఎనర్జీ ద్వారా విద్యుత్ బిల్లు చెల్లింపులు సులువుగా చేసుకోవచ్చు. అలాగే గూగుల్ తేజ్ తో జత కట్టిన తొలి సంస్థగా రిలయన్స్ ఎనర్జీ నిలిచింది.
ఈ డీల్ పై రిలయన్స్ ఎనర్జీ ప్రతినిధి మాట్లాడుతూ గూగుల్ తేజ యాప్ సహాయంతో ఇల్లు, కార్యాలయంలో నుంచే ఫింగర్ టిప్స్ ద్వారా అతి సులువుగా విద్యుత్ బిల్లు చెల్లింపులు చేసుకోవచ్చని చెప్పారు. ఇతర ఆన్‌లైన్ చెల్లింపు ఎంపికలతో పోలిస్తే, చెల్లింపులను చేయడానికి గూగుల్ తేజ్‌లో తక్కువ సమయం పడుతుంది. కార్డు వివరాలు, సీవీవీ నంబరు, ఓటీపీ లాంటి ఇతర ప్రక్రియలను నమోదు చేయవలసిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. తద్వారా 25 లక్షల వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది. దీంతో పాటు గూగుల్ సహకారంతో వివిధ ఆఫర్లు కూడా అందిస్తున్నట్టు ప్రకటించారు.
కాగా రిలయన్స్ ఎనర్జీ చెల్లింపులో సుమారు 35శాతం డిజిటల్ మోడ్‌లో జరుగుతుండగా , పేటీఎం, పే ఎమనీ, ఫ్రీఛార్జ్, బిల్ డెస్క్ ,యుపిఐ బేస్డ్ ఫోన్ పే తో ఇప్పటికే భాగస్వామ్యం ఉంది. గత నెలలో అనిల్ అంబానీ గ్రూప్ కు చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఆర్‌ఇన్‌ఫ్రా) రిలయన్స్ ఎనర్జీని అదానీ దక్కించు కుంది. ముంబైలోని విద్యుదుత్పత్తి, పంపిణీ, పంపిణీ వ్యాపారంలోని 100శాతం వాటాను మొత్తం రూ.18,800 కోట్లకు తమ గౌతమ్ అదాని నాయకత్వంలోని అదాని ట్రాన్స్‌మిషన్‌కు విక్రయించింది.
Comments
Please login to add a commentAdd a comment