Reliance Energy
-
రాష్ట్రంలో రిలయన్స్ ఎనర్జీ బయోగ్యాస్ ప్లాంట్లు
సాక్షి, అమరావతి: రిలయన్స్ ఎనర్జీ రాష్ట్రంలో రూ.65 వేలకోట్ల పెట్టుబడితో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రిలయన్స్ ఎనర్జీ గ్రూపు ప్రతినిధులు, ఇంధనశాఖ ప్రత్యేక సీఎస్ విజయానంద్ అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ ప్లాంట్ల ఏర్పాటు వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడే ప్రారంభమైంది. రిలయన్స్ రూ.1,024 కోట్లతో తొలిదశలో ఏర్పాటు చేయనున్న ఎనిమిది ప్లాంట్లకు ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన అప్పటి సీఎం వైఎస్ జగన్ పునాది వేశారు. కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, కర్నూలు, నెల్లూరుల్లో ఆ ప్లాంట్ల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. రెండోదశలో కూడా ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని రిలయన్స్ అప్పుడే చెప్పింది. ఇప్పుడు 500 ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ ప్లాంట్ల ఏర్పాటు లోకేశ్ ఘనత అని మీడియాకు లీకులివ్వడం విమర్శనీయంగా మారింది. మూడేళ్లలో పూర్తిచేయాలి ఒప్పందం అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఒక్కొక్కటి రూ.130 కోట్లతో ఏర్పాటు చేసే ఈ ప్లాంట్ల పనుల్ని మూడేళ్లలో పూర్తిచేయాలని రిలయన్స్ ప్రతినిధులను కోరారు. వీటిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కలి్పంచాలన్నారు. వృధా భూముల్లో ప్లాంట్లకు అవసరమైన వ్యవసాయ చెత్తను పండించడం ద్వారా రైతులకు ఆదాయం వస్తుందని చెప్పారు.క్లీన్ ఎనర్జీ పాలసీలో రైతులకు ఎకరానికి రూ.30 వేలు ఇవ్వాలని పేర్కొన్నామన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 8 ప్లాంట్లకు మున్సిపాలిటీల తడిచెత్తను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అంతకుముందు రిలయన్స్ ప్రతినిధి మాట్లాడుతూ రాష్ట్రంలో కాకినాడలో మూడు, రాజమహేంద్రవరంలో రెండు, విజయవాడ, కర్నూలు, నెల్లూరుల్లో ఒక్కోప్లాంటు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. అవి వచ్చే మార్చి నుంచి నవంబర్‌లోగా ఉత్పత్తి ప్రారంభిస్తాయని తెలిపారు. మంత్రులు లోకేశ్, రవికుమార్, టి.జి.భరత్ తదితరులు పాల్గొన్నారు. -
అవన్నీ అనవసరమైన భయాందోళనలు
న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరతతో థర్మల్ విద్యుత్ కేంద్రాలు మూతపడే పరిస్థితి వస్తుందని ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు పలు రాష్ట్రాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో సంక్షోభ నివారణకు కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. దేశవ్యాప్తంగా విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోకుండా అవసరమైన అన్ని వనరులు వినియోగించేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది. కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్.కె.సింగ్ ఎన్టీపీసీ, రిలయెన్స్ ఎనర్జీ సహా వివిధ విద్యుదుత్పత్తి కేంద్రాలు, విద్యుత్ సరఫరా కంపెనీలు, విద్యుత్ అధికారులతో ఆదివారం భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ డిమాండ్‌కు తగిన బొగ్గు నిల్వలు ఉన్నాయని, అనవసర భయాందోళనలు వద్దని స్పష్టం చేశారు. విద్యుదుత్పత్తి కేంద్రాల్లో 4 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని, విద్యుత్ సరఫరాకు ప్రమాదం ఏమీ లేదని భరోసా ఇచ్చారు. సమాచార లోపమే కారణం గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్), ఢిల్లీలోని డిస్కమ్‌ల మధ్య సమాచార లోపం వల్లే అనవసర ఆందోళనలు తలెత్తాయని చెప్పారు. ఢిల్లీ డిస్కమ్‌లకి, గెయిల్‌కి మధ్య కాంట్రాక్టు పూర్తి అయిపోవడంతో ఇక గ్యాస్ సప్లయ్ చేయలేమని గెయిల్ రాసిన లేఖతో విద్యుత్ ప్రమాదం ముంచుకొస్తోందన్న భయం తలెత్తి ఉండవచ్చునని మంత్రి అభిప్రాయపడ్డారు. ‘విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తోందంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాసిన లేఖపై లెఫ్ట్‌నెంట్ జనరల్ నాతో మాట్లాడారు. అలాంటి పరిస్థితి రాదని వాళ్లకి చెప్పాను. దేశవ్యాప్తంగా విద్యుత్ కేంద్రాలకు అవసరమయ్యే గ్యాస్ సరఫరా చేయమని గెయిల్ సీఎండీని ఆదేశించాం. సరఫరా కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు’అని మంత్రి తెలిపారు. బొగ్గు గనులున్న ప్రాంతాల్లో భారీ వర్షాలతో తవ్వకాలు నిలిచిపోవడం, సరఫరా మందగించడం, అంతర్జాతీయంగా బొగ్గు ధరలు భారీగా పెరగడంతో భరించలేని కంపెనీలు ఉత్పత్తిపై చేతులెత్తేస్తున్నాయి. గుజరాత్లో టాటా పవర్ ఉత్పత్తి నిలిపివేత విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గుపైనే ఆధారపడిన టాటా పవర్ అధిక ధరలకు బొగ్గు కొనలేక గుజరాత్‌లోని ముంద్రా ప్లాంట్‌లో ఉత్పత్తి ఆపేసింది. ఈ ప్లాంటు ద్వారా గుజరాత్‌కు 1,850 మెగావాట్లు, పంజాబ్‌కు 475, రాజస్తాన్‌కు 380, మహారాష్ట్రకు 760, హరియాణాకు 380 మెగావాట్లు విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంది. బొగ్గు నిల్వలు ఎంత ఉన్నాయంటే.. బొగ్గు నిల్వలపై కేంద్ర విద్యుత్ శాఖ, బొగ్గు గనుల శాఖ వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గును సరఫరా చేస్తున్నట్టు స్పష్టం చేశాయి. కోల్ ఇండియా లిమిటెడ్, సింగరేణి కాలరీస్ కంపెనీ, క్యాప్టివ్ కోల్‌మైన్స్, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు అన్నీ కలుపుకుంటే అక్టోబర్ 9న మొత్తంగా 19.2 లక్షల టన్నులు సరఫరా చేస్తే , విద్యుత్ ప్లాంట్లలో 18.7 లక్షల టన్నులు వినియోగించారు. అంటే వినియోగానికి మించి సరఫరా ఉందని, కొన్ని రోజులు గడిస్తే బొగ్గు నిల్వలు పెరుగుతాయని విద్యుత్ శాఖ వెల్లడించింది. బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ మరో ప్రకటనలో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు దాదాపుగా 72 లక్షల టన్నులున్నాయని, ఇవి నాలుగు రోజులకి సరిపోతాయని పేర్కొంది. కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) దగ్గర 400 లక్షల టన్నుల స్టాకు ఉందని, విద్యుత్ ప్లాంట్లకు దానిని సరఫరా చేస్తున్నట్టుగా వివరించింది. దేశవ్యాప్తంగా విద్యుత్ కేంద్రాలకి రోజుకి 18.5 లక్షల టన్నుల బొగ్గు అవసరమైతే ప్రస్తుతం రోజుకి 17.5 లక్షల టన్నులు సరఫరా చేస్తున్నామని, వర్షాల కారణంగా పంపిణీ కాస్త నెమ్మదించిందని అంగీకరించింది. గత ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ వరకు దేశీయంగా లభించే బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి 24 శాతం పెరిగిందని వివరించింది. అప్పట్లో ఆక్సిజన్‌కూ కొరత లేదన్నారు: సిసోడియా కేంద్రం ప్రతీ సమస్యని తేలిగ్గా తీసుకుంటోందని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు. బొగ్గు సంక్షోభం తరుముకొస్తున్నా ఏమీ లేదని అంటోందని మండిపడ్డారు. కోవిడ్ రెండో వేవ్ సమయంలో ఆస్పత్రులు, డాక్టర్లు ఆక్సిజన్‌కి కొరత ఉందని మొరపెట్టుకున్నా అలాంటిదేమీ లేదని మభ్యపెట్టిందని, ఫలితంగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. దేశంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరిపడినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని, అనవసరంగా లేనిపోని భయాందోళనలు సృష్టిస్తున్నారంటూ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కే. సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో సిసోడియా విలేకరులతో మాట్లాడారు. ‘‘కేంద్ర విద్యుత్ మంత్రి బొగ్గుకి కొరత లేదని అంటున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రధానికి అలా లేఖ రాసి ఉండకూడదని కూడా అన్నారు. ఒక కేంద్రమంత్రిగా ఆయన చాలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు’’అని సిసోడియా అన్నారు. సమస్య నుంచి పారిపోవాలని కేంద్రం భావిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ కొరతని, ఇప్పటి బొగ్గు సమస్యతో పోలుస్తూ కేంద్రంపై సిసోడియా విరుచుకుపడ్డారు. -
గూగుల్ తేజ్-రిలయన్స్ ఎనర్జీ జత
రిలయన్స్ ఎనర్జీ తన మొబైల్ అప్లికేషన్ ఉపయోగించి బిల్లు చెల్లింపులను ప్రారంభించడానికి గూగుల్‌తో జత కట్టింది. గూగుల్‌కు చెందిన యూపీఐ ఆధారిత చెల్లింపుల యాప్ గూగుల్ తేజ్‌తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనికోసం గూగుల్ తేజ్ యాప్‌ను డౌన్ చేసుకొని తమ బ్యాంకు ఖాతా, రిజిస్టర్డ్ ఫోన్ బ్యాంకింగ్ మొబైల్ నెంబర్ నమోదు కావాల్సింది ఉంటుంది. దీంతో రిలయన్స్ ఎనర్జీ ద్వారా విద్యుత్ బిల్లు చెల్లింపులు సులువుగా చేసుకోవచ్చు. అలాగే గూగుల్ తేజ్ తో జత కట్టిన తొలి సంస్థగా రిలయన్స్ ఎనర్జీ నిలిచింది. ఈ డీల్ పై రిలయన్స్ ఎనర్జీ ప్రతినిధి మాట్లాడుతూ గూగుల్ తేజ యాప్ సహాయంతో ఇల్లు, కార్యాలయంలో నుంచే ఫింగర్ టిప్స్ ద్వారా అతి సులువుగా విద్యుత్ బిల్లు చెల్లింపులు చేసుకోవచ్చని చెప్పారు. ఇతర ఆన్లైన్ చెల్లింపు ఎంపికలతో పోలిస్తే, చెల్లింపులను చేయడానికి గూగుల్ తేజ్‌లో తక్కువ సమయం పడుతుంది. కార్డు వివరాలు, సీవీవీ నంబరు, ఓటీపీ లాంటి ఇతర ప్రక్రియలను నమోదు చేయవలసిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. తద్వారా 25 లక్షల వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది. దీంతో పాటు గూగుల్ సహకారంతో వివిధ ఆఫర్లు కూడా అందిస్తున్నట్టు ప్రకటించారు. కాగా రిలయన్స్ ఎనర్జీ చెల్లింపులో సుమారు 35శాతం డిజిటల్ మోడ్‌లో జరుగుతుండగా , పేటీఎం, పే ఎమనీ, ఫ్రీఛార్జ్, బిల్ డెస్క్ ,యుపిఐ బేస్డ్ ఫోన్ పే తో ఇప్పటికే భాగస్వామ్యం ఉంది. గత నెలలో అనిల్ అంబానీ గ్రూప్ కు చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆర్ఇన్ఫ్రా) రిలయన్స్ ఎనర్జీని అదానీ దక్కించు కుంది. ముంబైలోని విద్యుదుత్పత్తి, పంపిణీ, పంపిణీ వ్యాపారంలోని 100శాతం వాటాను మొత్తం రూ.18,800 కోట్లకు తమ గౌతమ్ అదాని నాయకత్వంలోని అదాని ట్రాన్స్మిషన్కు విక్రయించింది. -
టీజేఏసీ దీక్షకు తెలుగు సంఘాల మద్దతు
సాక్షి, ముంబై: సంపూర్ణ తెలంగాణ కోసం టీజేఏసీ హైదరాబాద్‌లో మంగళవారం చేపట్టిన దీక్షకు నగరంలోని వివిధ తెలుగు సంఘాలు మద్దతును ప్రకటించాయి. రిలయన్స్ ఎనర్జీ తెలంగాణ కార్మిక సమైక్య, ఎంటీజేఏసీ సంయుక్తంగా అంధేరీలోని అంబోలి నాకాలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రిలయన్స్ ఎనర్జీ కార్మిక సమైక్య అధ్యక్షుడు కె.నర్సింహగౌడ్ మాట్లాడుతూ ప్రొఫెసర్ కోదండరాం సూచించిన 13 అంశాలను సవరించాలని, ముంబై తెలంగాణ సంఘాలు కూడా ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయన్నారు. ఉమ్మడి రాజధాని రెండేళ్లకు కుదించాలని, ఏపీ భవన్ ఆస్తులను తెలంగాణకే ఇవ్వాలని, గవర్నర్ నుంచి శాంతి భద్రతల అధికారాలను తొలగించాలనే తదితర 13 అంశాలను కూడా సవరించాలన్నారు. ప్రత్యేక తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చించి వెంటనే రాష్ర్టపతికి పంపాలని, ఆతర్వాత పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా కేంద్రం చూడాలని ఎంటీజేఏసీ కన్వీనర్లు దేవానంద్ నాగిల్ల, ఎస్.లక్ష్మణ్ అన్నారు. జనవరి 23లోపు ఆంధ్రప్రదేశ్ శాసన సభలో చర్చ జరిగినా, జరగకపోయినా విభజన బిల్లు కేంద్రానికి వెళ్లడం ఖాయమని ప్రధాన కార్యదర్శి బోయ శ్రీనివాస్ తెలిపారు. ఇది డాక్టర్. బి.ఆర్.అంబేద్కర్ చిన్న రాష్ట్రాల ఆకాంక్ష గల పౌరులకు ఇచ్చిన ప్రత్యేక హక్కుగా అభివర్ణించారు. ఈ ప్రదర్శనలో గందం శంకర్, పుట్టి విజయ్, పండి బాబు, అనుమల్ల యాదయ్య, గడ్డం శైవ రాములు, పలెర్ల గంగులు, పొట్ట శ్రీనివాస్, బోసి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.