
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వేలాది మంది యువతీ, యువకులకు ఫ్లిప్‌కార్ట్ సప్లయ్ చైన్ ఆపరేషన్స్ అకాడమీ (ఎస్‌సీఓఏ) నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనుంది. ఇందుకు గాను కేంద్ర నైపుణ్యాభివృద్ధి కల్పన శాఖతో అవగాహన ఒప్పందం చేసుకుంది.
ఈ-కామర్స్, సరఫరా వ్యవస్థ తదితర విభాగాల్లో ఉద్యోగ నైపుణ్యాలపై ‘ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 కింద శిక్షణ ఇవ్వనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. కళాకారులు, చేనేతలు, స్వయం ఉపాధి సంఘాల మహిళలు, మహిళలు, గ్రామీణ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సాధికారత దిశగా ఐదేళ్ల మైలురాయిని పూర్తి చేసుకున్న సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఒక కార్యక్రమం నిర్వహించింది.
ఈ సందర్భంగా అవగాహన ఒప్పందంపై ఫ్లిప్‌కార్ట్ ఎస్‌సీఓఏ, నైపుణ్య శిక్షణాభివృద్ధి శాఖ అధికారులు సంతకాలు చేశారు. 250 మంది వరకు పారిశ్రామికవేత్తలు, కళాకారులు, విక్రయదారులు, చేనేత కార్మికులు, స్వయం స్వహాయక మహిళలు ఈ కార్యక్రమానికి హాజరైనట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment