
ముంబై: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) ఆదిత్య బిర్లా ఫైనాన్స్ (ఏబీఎఫ్‌ఎల్) తమ కమర్షియల్ పేపర్స్‌ను (సీపీ) స్టాక్ ఎక్సే్ఛంజీల్లో లిస్ట్ చేసింది. తద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీల్లో లిస్టయిన తొలి ఎన్‌బీఎఫ్‌సీగా నిలి్చంది. ఈ సీపీ ద్వారా ఏబీఎఫ్‌ఎల్ రూ. 100 కోట్లు సమీకరించింది. వీటి మెచ్యూరిటీ గడువు 2020 ఫిబ్రవరి 7గా ఉంటుందని స్టాక్ ఎక్సే్ఛంజీలు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ వేర్వేరు ప్రకటనల్లో తెలిపాయి. స్వల్పకాలిక రుణాలకు సంబంధించిన కమర్షియల్ పేపర్ల లిస్టింగ్‌కు తగిన విధానాలు రూపొందించాలంటూ స్టాక్ ఎక్సే్ఛంజీలకు నియంత్రణ సంస్థ సెబీ ఈ ఏడాది అక్టోబర్‌లో సూచించింది. సెబీ నిబంధనల ప్రకారం.. కనీసం రూ. 100 కోట్ల నికరవిలువ ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలు, కంపెనీలకు లిస్టింగ్ అర్హత ఉంటుంది.