
న్యూఢిల్లీ: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) ముత్తూట్ ఫైనాన్స్ కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. రూ.215 కోట్లతో ఐడీబీఐ అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఐడీబీఐ ఏఎంసీ), ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్ ట్రస్టీ కంపెనీలో నూరు శాతం ఈక్విటీని కొనుగోలు చేయనున్నట్టు ముత్తూట్ ఫైనాన్స్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఇందుకు ఒప్పందం చేసుకున్నట్టు తెలిపింది.
ఈ డీల్‌కు సెబీ తదితర నియంత్రణ సంస్థల ఆమోదం అవసరమని, వచ్చే ఫిబ్రవరి నాటికి కొనుగోలు పూర్తవుతుందని పేర్కొంది. ఐడీబీఐ ఏఎంసీ 2010లో ఏర్పాటు కాగా, రూ.5,300 కోట్ల పెట్టుబడులు నిర్వహణలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment