సహారా ఇండియా ఫైనాన్షియల్ రిజిస్ట్రేషన్ రద్దు
ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న సహారా గ్రూప్‌నకు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. గ్రూప్‌లో భాగమైన సహారా ఇండియా ఫైనాన్షియల్ కార్పొరేషన్‌కి సంబంధించిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (ఎన్‌బీఎఫ్‌సీ) రిజిస్ట్రేషన్‌ను రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది. సెప్టెంబర్ 3 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లవుతుందని పేర్కొంది. వ్యాపార నిర్వహణ సమర్ధత కోల్పోయిందనే కారణంతో జులైలోనే సహారా మ్యూచువల్ ఫండ్ రిజిస్ట్రేషన్‌ను కూడా ఆర్‌బీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇన్వెస్టర్లకు వేల కోట్ల రూపాయలు తిరిగివ్వాల్సిన కేసులో సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ గతేడాది మార్చి 4 నుంచి జైల్లోనే ఉన్నారు.