గతవారం బిజినెస్ | Last week Business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్

Published Mon, Sep 21 2015 3:14 AM | Last Updated on Sun, Sep 3 2017 9:41 AM

Last week Business

సహారా ఇండియాకు చుక్కెదురు
సంక్షోభంలో చిక్కుకున్న సహారా గ్రూప్‌నకు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. గ్రూప్‌లో భాగమైన సహారా ఇండియా ఫైనాన్షియల్ కార్పొరేషన్‌కి సంబంధించిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్‌ను రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది.
   
రికార్డు స్థాయికి క్షీణించిన టోకు ద్రవ్యోల్బణం
ఆగస్టులో టోకు ధరల ద్రవ్యోల్బణం మైనస్ 4.95%కి పడిపోయింది. ఇది రికార్డ్ స్థాయి కనిష్టం. ఈ ఏడాది జూలైలో ఇది మై నస్ 4.05గా ఉంది. టోకు ధరల ద్రవ్యోల్బణం తగ్గడం ఇది వరుసగా 10వ నెల. ద్రవ్యోల్బణం తగ్గడం కొనసాగుతుండటంతో ఈ నెల 29న జరిగే పరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ కీలక రేట్లు తగ్గించే అవకాశాలున్నాయన్న అంచనాలు పెరిగిపోయాయి.
   
ఈ-కామర్స్‌లోకి మహీంద్రా గ్రూప్
పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా గ్రూప్ తాజాగా ఈ-కామర్స్ విభాగంలోకి ప్రవేశించింది. మహీంద్రా ఉత్పత్తులు, సర్వీసుల విక్రయానికి ఎం2ఆల్.కామ్ పేరిట పోర్టల్‌ను ఆవిష్కరించింది. కొత్తగా ఆవిష్కరించిన మహీంద్రా టీయూవీ 300కి సం బంధించిన ఆర్డర్లు దీని ద్వారా తీసుకోవడం ప్రారంభించినట్లు మహీంద్రా గ్రూప్ సీఎఫ్‌వో వీఎస్ పార్థసారథి తెలిపారు.
   
3 ట్రిలియన్ డాలర్లకు మొబైల్ పేమెంట్స్!
దేశంలో మొబైళ్ల ద్వారా జరిగే చెల్లింపులు వచ్చే ఏడేళ్లలో 200 రెట్ల వృద్ధితో 3 ట్రిలియన్ డాలర్లకు చేరతాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ అభిప్రాయపడింది. మొబైల్ పేమెంట్స్ వృద్ధి వల్ల ఐటీ, టెలికం, బ్యాంకింగ్, మొబైల్ వాలెట్ కంపెనీలు బాగా ప్రయోజనం పొందే అవకాశమున్నట్లు పేర్కొంది.
   
ఉక్కు దిగుమతులపై 20 శాతం సుంకం
విదేశాల నుంచి దిగుమతయ్యే కొన్ని కేటగిరీల ఉక్కు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం 20 శాతం రక్షణాత్మక సుంకం విధించింది. చౌక ధరల్లో ఉక్కు ఉత్పత్తుల దిగుమతులు వెల్లువెత్తుతుండటంతో దేశీయ ఉక్కు పరిశ్రమను రక్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఈ సుంకం  200 రోజుల పాటు అమల్లో ఉంటుందని వివరించారు.
   
తగ్గిన ఎగుమతులు
ఎగుమతుల క్షీణ పరిస్థితి కొనసాగుతోంది. వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రకారం.. 2014 ఆగస్టు నెల ఎగుమతుల విలువతో పోల్చిచూస్తే, 2015 ఆగస్టులో విలువ అసలు పెరక్కపోగా 21 శాతం క్షీణించింది. 21.26 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, కమోడిటీ ధరల తగ్గుదల దీనికి ప్రధాన కారణం. దిగుమతులు చూస్తే... ఆగస్టు నెలలోనూ 10 శాతం క్షీణించి, 34 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
   
ఇండిగో ఐపీఓకు సెబీ ఆమోదం
చౌక ధరల్లో విమానయాన సర్వీసులందజేసే ఇండిగో సంస్థ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఐపీఓ ద్వారా ఇండిగో రూ.2,500 కోట్లు సమీకరించనున్నది. ఐపీఓలో భాగంగా రూ.1,272 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు.
   
పసిడి, వెండి టారిఫ్ విలువ తగ్గింపు
పసిడి, వెండి దిగుమతుల టారిఫ్ విలువలు తగ్గాయి. 10 గ్రాముల పసిడి టారిఫ్ విలువ 369 డాలర్ల నుంచి 359కి, వెండి కేజీ విలువ 471 డాలర్ల నుంచి స్వల్పంగా 470 డాలర్లకు దిగింది. అంతర్జాతీయంగా ఈ మెటల్స్ ధర తగ్గడంతో కేంద్రం నిర్ణయం తీసుకుంది.
   
చెక్కు బౌన్స్ కేసుల్లో చట్ట సవరణకు ఓకే
చెక్కు బౌన్స్ కేసుల్లో లక్షలాది మందికి ప్రయోజనం కలిగే చర్యల కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపై చెక్కు బౌన్స్‌లకు సంబంధించి.. చెల్లింపు జరగాల్సిన బ్యాంక్ బ్రాంచ్(ప్రెజెంట్ చేసిన చో టు) పరిధిలోని కోర్టుల్లో మాత్రమే కేసులను దాఖలు చేయాల్సి ఉంటుంది. దీనికి వీలుకల్పించే విధంగా నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్డినెన్స్-2015కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
    
వంటనూనెల దిగుమతి సుంకం పెంపు
రైతు ప్రయోజనాలను పరిరక్షించడానికి, దే శీ ఆయిల్ రిఫైనరీ కంపెనీలను ఆదుకునే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వంటనూనెల దిగుమతి సుంకాన్ని 5 శాతం మేర పెంచింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్, కస్టమ్స్ నోటిఫికేషన్ ప్రకారం.. ముడి వంటనూనెల దిగుమతి సుంకం 7.5% నుంచి 12.5%కి, రిఫైన్డ్ వంటనూనెల దిగుమతి సుంకం 15% నుంచి 20%కి పెరిగింది.
   
చిన్న ఫైనాన్స్ బ్యాంకులు వస్తున్నాయి..
సూక్ష్మ పరిశ్రమలు, సన్నకారు రైతులకు ప్రాథమిక బ్యాంకింగ్ సే వల్ని అందించే లక్ష్యంతో చిన్న ఫైనాన్స్ బ్యాంకుల ఏర్పాటుకు సంబంధించి 10 సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ సూత్రప్రాయంగా అనుమతులు ఇచ్చింది. ఈ జాబితాలో ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈక్విటాస్ హోల్డింగ్స్ మొదలైన సంస్థలు ఉన్నాయి.
   
బంగారం దిగుమతులు 5 శాతం తగ్గొచ్చు!
బంగారపు ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్‌ను అరికట్టడానికి, ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని వినియోగంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆవిష్కరించిన గోల్డ్ బాండ్ (జీబీఎస్), గోల్డ్ మానిటైజేషన్ (జీఎంఎస్) పథకాల వల్ల బంగారం దిగుమతులు వచ్చే 12-18 నెలల కాలంలో 3-5 శాతం తగ్గుతాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది.
   
ఐఎంఎఫ్ వైఫల్యాలతోనే బ్రిక్స్ బ్యాంక్
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో సంస్కరణల అమల్లో వైఫల్యమే బ్రిక్స్ బ్యాంక్ తదితర బహుళ ఆర్థిక సంస్థల ఆవిర్భావానికి కారణమని అమెరికా అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నాథన్ షీట్స్ పేర్కొన్నారు.  భారత్ వంటి వర్ధమాన దేశాలకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ప్రతిబింబించే పలు సంస్కరణలు 2010లో ప్రతిపాదించినా..  అమెరికా వీటో అధికారాల వల్ల చోటు చేసుకోలేదని ఆయన వివరించారు.
   
ఆస్ట్రేలియా కంపెనీతో డా.రెడ్డీస్ ఒప్పందం
ఆస్ట్రేలియా కంపెనీ హాచ్‌టెక్‌కు చెందిన తలలో పేల నివారణకు వినియోగించే ‘ఎక్సిగ్‌లైజ్’ లోషన్‌పై ముందస్తు వాణిజ్య హక్కుల ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ దక్కిం చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం డాక్టర్ రెడ్డీస్ ముందుగా రూ. 66 కోట్లను (10 మిలియన్ డాలర్లు) చెల్లిస్తుంది. ఆ తర్వాత ఈ ప్రొడక్ట్ వాణిజ్యపరంగా విజయవంతం అయితే దశల వారీగా రూ. 330 కోట్ల (50 మిలియన్ డాలర్లు) వరకు చెల్లిస్తుంది.
   
భారత్‌లో ప్యానాసోనిక్ రిఫ్రిజిరేటర్ల ప్లాంటు
ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న ప్యానాసోనిక్ భారత్‌లో రిఫ్రిజిరేటర్ల తయారీ ప్లాంటును ఏడాదిన్నరలో ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం రిఫ్రిజిరేటర్లను కంపెనీ విదేశాల నుంచి దిగుమతి చేసుకుని దేశంలో విక్రయిస్తోంది. రూ.200-300 కోట్ల అంచనా వ్యయంతో 6-10 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంటు నెలకొల్పుతామని ప్యానాసోనిక్ ఇండియా ఎండీ మనీశ్ శర్మ తెలిపారు.
   
ఆన్‌లైన్ షాపింగ్‌కు ఎస్‌బీఐ కార్డు ‘సింప్లీక్లిక్’
ఆన్‌లైన్ షాపింగ్ అవసరాల కోసం సింప్లీక్లిక్ పేరిట ఎస్‌బీఐ కార్డ్ సంస్థ ప్రత్యేక క్రెడిట్ కార్డును ఆవిష్కరించింది. అమెజాన్ ఇండియా, బుక్‌మైషో, క్లియర్‌ట్రిప్, ఓలా క్యాబ్స్, లెన్స్‌కార్ట్, ఫుడ్ పాండా, ఫ్యాబ్ ఫర్నిష్ వంటి ఏడు సంస్థల భాగస్వామ్యంతో దీన్ని రూపొందించింది. దీన్ని వినియోగించిన వారికి సాధారణ కార్డులతో పోలిస్తే అయిదు రెట్లు రివార్డ్ పాయింట్లు ఎక్కువగా లభిస్తాయని ఎస్‌బీఐ కార్డ్ సీఈవో విజయ్ జసూజా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement