ఐపీఓ మార్కెట్‌కు ఎన్‌బీఎఫ్‌సీల దన్ను
ప్రాథమిక మార్కెట్‌లో పెట్టుబడులు పెరిగే అంశాలకు ఆర్థిక మంత్రి ప్రాధాన్యతను ఇచ్చారు. కంపెనీలు మార్కెట్‌లో తొలిసారిగా ఇచ్చే ఆఫర్ (ఐపీఓ)లో పెట్టుబడులు పెట్టేందుకు క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (క్యూఐబీ)కు స్థానం ఉండగా.. ఈ కోటాలో ఇప్పటి వరకు బ్యాంకులు, బీమా కంపెనీలకు మాత్రమే అర్హత ఉంది.
వీటితో పాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)లకు కూడా ఐపీఓ మార్కెట్‌లో పెట్టుబడులకు అవకాశం కల్పించిన అరుణ్ జైట్లీ, సెబీ దగ్గర రిజిస్టర్ అయిన పెద్ద ఎన్‌బీఎఫ్‌సీలు క్యూఐబీ కోటాలో ప్రాథమిక మార్కెట్‌కు అండగా నిలవవచ్చని బడ్జెట్‌లో ప్రకటించారు.