ఐపీఓలో క్యూఐబీ కోటాను నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు వర్తింపజేయడాన్ని ఆహ్వానించదగ్గ అంశమని ముత్తూట్ ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ వెల్లడించారు.
ఐపీఓలో క్యూఐబీ కోటాను నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు వర్తింపజేయడాన్ని ఆహ్వానించదగ్గ అంశమని ముత్తూట్ ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా ముత్తూట్ లాంటి ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలకు ఐపీఓ మార్కెట్‌లో బ్యాంకులు, బీమా సంస్థలకు సమానంగా పెట్టుబడులు పెట్టే అవకాశం లభించిందని అన్నారు. జైట్లీ తీసుకున్న నిర్ణయం ఎన్‌బీఎఫ్‌సీకు నిధుల సమీకరణలో తోడ్పాటునిస్తుందని అభిప్రాయపడ్డారు. క్యూఐబీ హోదాలో పెట్టుబడులు పెట్టే వెసులుబాటు ఉండడం వల్ల, పోర్టిఫోలియో డైవర్సిఫికేషన్‌కు అవకాశం లభించడమే కాకుండా పెట్టుబడులలో పారదర్శత పెరుగుతుందని అన్నారు.
ఆన్‌లైన్‌లో బ్రోకింగ్ సంస్థల రిజిస్ట్రేషన్
వ్యాపారాల నిర్వహణ సులభతరం చేసే దిశగా.. బ్రోకింగ్ సంస్థలు, పోర్ట్‌ఫోలియో మేనేజర్లు, మ్యూచువల్ ఫండ్స్ తదితర మార్కెట్ మధ్యవర్తిత్వ సంస్థలు నమోదు చేసుకునేందుకు పేపర్ రహిత ఆన్‌లైన్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఎగుమతి లక్ష్యం మౌలిక సదుపాయాల కల్పనకు రంగం సిద్ధం
ఎగుమతులను ప్రోత్సహించడంలో భాగంగా 2017–18 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. ట్రేడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్‌పోర్ట్ స్కీం (టీఐఈఎస్) పేరిట నూతన స్కీంను ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ స్కీం విధివిధానాలను ప్రకటించనున్నారు.