
ముంబై: కార్‌ట్రేడ్ టెక్ ఐపీఓకు మంచి స్పందన లభించింది. చివరి రోజు నాటికి 20.29 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.29 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టగా.., మొత్తం 26.31 కోట్లు బిడ్లు దాఖలైనట్లు ఎక్సే్చంజీ గణాంకాలు తెలిపాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులు(క్విబ్) విభాగంలో 35.45 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల కోటాలో 41 రెట్ల అధిక స్పందన నమోదైంది. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 2.75 రెట్లు అధిక దరఖాస్తులు వచ్చాయి. ఈ ఐపీఓ ఆగస్ట్ 9న ప్రారంభమై ఇదే నెల 11వ తేదీన ముగిసింది. ధరల శ్రేణి రూ.1,585–1,618గా నిర్ణయించి కంపెనీ రూ.2999 కోట్లు సమకూర్చుకుంది.
నువాకో విస్టాస్ ఐపీఓకు స్పందన అంతంతే!
సిమెంట్ తయారీ కంపెనీ నువాకో విస్టాస్ ఐపీఓకు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. మూడవ రోజు నాటికి 1.71 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 6.25 కోట్ల షేర్లను జారీ చేసింది. మొత్తం 10.70 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. ఇందులో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయర్ విభాగంలో 4.23 రెట్లు, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటాలో 66%, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 73% ఎక్కువగా దరఖాస్తులు లభించాయి. ఈ ఐపీఓ కూడా ఆగస్ట్ 9న ప్రారంభమై, ఆగస్ట్ 11వ తేదీన ముగిసింది. ధరల శ్రేణి రూ. 560–570 గా నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment