QIB
-
కార్‌ట్రేడ్ టెక్ ఐపీఓ... బంపర్ స్పందన
ముంబై: కార్‌ట్రేడ్ టెక్ ఐపీఓకు మంచి స్పందన లభించింది. చివరి రోజు నాటికి 20.29 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.29 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టగా.., మొత్తం 26.31 కోట్లు బిడ్లు దాఖలైనట్లు ఎక్సే్చంజీ గణాంకాలు తెలిపాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులు(క్విబ్) విభాగంలో 35.45 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల కోటాలో 41 రెట్ల అధిక స్పందన నమోదైంది. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 2.75 రెట్లు అధిక దరఖాస్తులు వచ్చాయి. ఈ ఐపీఓ ఆగస్ట్ 9న ప్రారంభమై ఇదే నెల 11వ తేదీన ముగిసింది. ధరల శ్రేణి రూ.1,585–1,618గా నిర్ణయించి కంపెనీ రూ.2999 కోట్లు సమకూర్చుకుంది. నువాకో విస్టాస్ ఐపీఓకు స్పందన అంతంతే! సిమెంట్ తయారీ కంపెనీ నువాకో విస్టాస్ ఐపీఓకు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. మూడవ రోజు నాటికి 1.71 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 6.25 కోట్ల షేర్లను జారీ చేసింది. మొత్తం 10.70 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. ఇందులో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్ విభాగంలో 4.23 రెట్లు, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటాలో 66%, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 73% ఎక్కువగా దరఖాస్తులు లభించాయి. ఈ ఐపీఓ కూడా ఆగస్ట్ 9న ప్రారంభమై, ఆగస్ట్ 11వ తేదీన ముగిసింది. ధరల శ్రేణి రూ. 560–570 గా నిర్ణయించింది. -
పీవీఆర్ రూ.750 కోట్లు సమీకరణ
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ థియేటర్ చెయిన్‌ను నిర్వహిస్తున్న పీవీఆర్ సంస్థ రూ.750 కోట్లు సమీకరించనుంది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లకు (క్యూఐబీ) షేర్లు జారీ చేయటం ద్వారా ఈ నిధులు సమీకరించనున్నామని పీవీఆర్ తెలిపింది. ఈ మేరకు తమ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని, ఈ ప్రతిపాదనకు వాటాదారుల ఆమోదం కోరుతున్నామని వివరించింది. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 29 మధ్యలో వాటాదారులు ఈ ఓటింగ్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చని, ఓటింగ్ ఫలితాలను వచ్చే నెల 30న వెల్లడిస్తామని తెలియజేసింది. ఈ నిధులను పెట్టుబడుల అవసరాలకు, ఇతర కంపెనీల కొనుగోళ్లకు, రుణ భారం తగ్గించుకోవడానికి, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, ఇతర సాధారణ వ్యాపార కార్యకలాపాలకు వినియోగిస్తామని పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టులో దక్షిణ భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎస్పీఐ సినిమాస్‌లో 71.69 శాతం వాటాను పీవీఆర్ రూ.633 కోట్లకు కొనుగోలు చేసింది. 2016లో రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ నుంచి డీటీ సినిమాస్‌ను రూ.433 కోట్లకు చేజిక్కించుకుంది. రూ.750 కోట్ల నిధుల సమీకరణ నేపథ్యంలో బీఎస్ఈలో పీవీఆర్ షేర్ 0.5 శాతం లాభంతో రూ.1,585 వద్ద ముగిసింది. -
క్యూఐబీ హోదాని ఆహ్వానిస్తున్నాం: ముత్తూట్
ఐపీఓలో క్యూఐబీ కోటాను నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు వర్తింపజేయడాన్ని ఆహ్వానించదగ్గ అంశమని ముత్తూట్ ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా ముత్తూట్ లాంటి ఎన్బీఎఫ్సీ కంపెనీలకు ఐపీఓ మార్కెట్లో బ్యాంకులు, బీమా సంస్థలకు సమానంగా పెట్టుబడులు పెట్టే అవకాశం లభించిందని అన్నారు. జైట్లీ తీసుకున్న నిర్ణయం ఎన్‌బీఎఫ్‌సీకు నిధుల సమీకరణలో తోడ్పాటునిస్తుందని అభిప్రాయపడ్డారు. క్యూఐబీ హోదాలో పెట్టుబడులు పెట్టే వెసులుబాటు ఉండడం వల్ల, పోర్టిఫోలియో డైవర్సిఫికేషన్‌కు అవకాశం లభించడమే కాకుండా పెట్టుబడులలో పారదర్శత పెరుగుతుందని అన్నారు. ఆన్లైన్లో బ్రోకింగ్ సంస్థల రిజిస్ట్రేషన్ వ్యాపారాల నిర్వహణ సులభతరం చేసే దిశగా.. బ్రోకింగ్ సంస్థలు, పోర్ట్‌ఫోలియో మేనేజర్లు, మ్యూచువల్ ఫండ్స్ తదితర మార్కెట్ మధ్యవర్తిత్వ సంస్థలు నమోదు చేసుకునేందుకు పేపర్ రహిత ఆన్లైన్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎగుమతి లక్ష్యం మౌలిక సదుపాయాల కల్పనకు రంగం సిద్ధం ఎగుమతులను ప్రోత్సహించడంలో భాగంగా 2017–18 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పోర్ట్ స్కీం (టీఐఈఎస్) పేరిట నూతన స్కీంను ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ స్కీం విధివిధానాలను ప్రకటించనున్నారు.