ఎన్‌బీఎఫ్‌సీల రుణ వృద్ధి 10శాతం! | Crisil ratiings On NBFC | Sakshi
Sakshi News home page

ఎన్‌బీఎఫ్‌సీల రుణ వృద్ధి 10శాతం!

Published Tue, Nov 30 2021 8:47 AM | Last Updated on Tue, Nov 30 2021 9:08 AM

Crisil ratiings On NBFC - Sakshi

ముంబై: బ్యాంకింగ్‌ యేతర ఫైనాన్స్‌ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) రుణ వృద్ధి 2021–22 ఆర్థిక సంవత్సరంలో 8 నుంచి 10 శాతం వరకూ నమోదవుతుందని క్రిసిల్‌ రేటింగ్స్‌ తాజా నివేదిక తెలిపింది. ఆర్థిక క్రియాశీలత మెరుగుపడ్డం, పటిష్ట బ్యాలెన్స్‌ షీట్స్‌ నిల్వలు ఇందుకు కారణంగా పేర్కొంది. నివేదికలోని ముఖ్యాంశాలు చూస్తే... 
- ఎన్‌బీఎఫ్‌సీల రుణ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6 నుంచి 8 శాతం ఉంటుందని భావిస్తున్నాం. కరోనా తీవ్ర సవాళ్ల నేపథ్యంలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి రేటు కేవలం 2 శాతం.  
- నాన్‌ బ్యాంక్‌ రుణదాతల స్థూల మొండి బకాయిలు (జీఎన్‌పీఏ) 25 నుంచి 300 బేసిస్‌ పాయింట్ల మేర (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) పెరిగే అవకాశం ఉంది.  
- అధిక లిక్విడిటీ, మూలధనం, ప్రొవిజినింగ్‌ బఫర్స్‌ (ఎన్‌పీఏలకు కేటాయింపులు) వంటి అంశాల్లో ఇటీవలి కాలంలో ఎన్‌బీఎఫ్‌సీలు పటిష్టంగా ఉన్నాయి. దీనికితోడు ఆర్థిక క్రియాశీలత కూడా తోడవడంతో, వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో వాటికి తగిన పటిష్ట స్థితి నెలకొంది.  
-  ప్రస్తుత, రానున్న త్రైమాసికాల్లో రిటైల్‌ రుణాలు భారీగా పెరిగే వీలుంది. డిమాండ్, విక్రయాలు పెరిగడం దీనికి కారణం.  
- బంగారం, గృహ, అన్‌సెక్యూర్డ్‌ రుణాల విషయంలో వృద్ధి వేగం అధికంగా ఉండవచ్చు. 
     కాగా, కోవిడ్‌–19 తాజా వేరియంట్‌ ప్రస్తుత ఆందోళనలకు కారణం అవుతోంది. వ్యవస్థలపై ఇది ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న విషయాన్ని వేచిచూడాల్సి ఉంది.  
 

చదవండి:HDFC Report: బేస్‌ ఎఫెక్ట్‌ ప్రభావంతో 9.4 శాతం వృద్ధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement