న్యూఢిల్లీ: కొత్త సంవత్సరంలో పేటిఎమ్ తన వినియోగదారులకు శుభవార్త తెలిపింది. ప్రముఖ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ పేటిఎమ్ తన 1 మిలియన్ కస్టమర్లకు ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అర్హత గల వినియోగదారులు కేవలం 2 నిమిషాల్లోనే వ్యక్తిగత రుణాలను 365రోజుల్లో ఎప్పుడైనా పొందవచ్చు అని పేటీఎం పేర్కొంది. రుణాలను వినియోగదారులు 18-36 నెలల్లో వాయిదా పద్దతిలో తీర్చవచ్చు. పేటిఎమ్ యొక్క ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ ఎన్‌బీఎఫ్‌సీలచే ప్రాసెస్ చేయబడతాయి. యూజర్లు తీసుకునే వాయిదాను బట్టి ఈఎంఐను నిర్ణయిస్తారు.(చదవండి: ఎయిర్‌టెల్ యూజర్లకు బంపరాఫర్)
ఈ చర్యవల్ల ‘క్రెడిట్ టు న్యూ’ కస్టమర్లు అధికారిక ఆర్థిక మార్కెట్ పరిధిలోకి వస్తారు. పేటిఎమ్ యొక్క ఈ క్రొత్త సేవల ద్వారా బ్యాంకింగ్ సంస్థలు అందుబాటులో లేని చిన్న చిన్న పట్టణాల వారికీ ఆర్థిక సహాయం అందనున్నట్లు పేర్కొంది. రుణ దరఖాస్తు కోసం ఎటువంటి పేపర్ డాక్యుమెంటేషన్ లేకుండా మొత్తం ప్రక్రియను డిజిటలైజ్ చేసింది. ఈ ప్రక్రియ కోసం అత్యాధునిక టెక్ ప్లాట్‌ఫామ్‌ను నిర్మించినట్లు పేటిఎమ్ పేర్కొంది. కొత్త ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ పథకం కింద అర్హులు గల ఉద్యోగులు, చిన్న వ్యాపారులకు, ఇతరులకు 2 నిమిషాల్లోనే రూ.2 లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నట్లు పేటీఎం ఒక ప్రకటన విడుదల చేసింది. అర్హత కలిగిన కస్టమర్లు ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం కింద 'పర్సనల్ లోన్' టాబ్ ద్వారా ఈ సేవలను పొందవచ్చు. ఈ సేవల సులభతరం చేయడానికి పేటీఎం వివిధ ఎన్‌బిఎఫ్‌సిలు, బ్యాంకులతో భాగస్వామ్యం కలిగి ఒప్పందం కుదుర్చుకుంది.
రెండు నిమిషాల్లోనే 2లక్షల పేటిఎమ్ పర్సనల్ లోన్!
Published Thu, Jan 7 2021 2:51 PM | Last Updated on Thu, Jan 7 2021 3:28 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment