ప్రతీకాత్మక చిత్రం
లక్నో: మనుషుల్లో మానవత్వం క్రమంగా సన్నగిల్లుతోంది. డబ్బు కోసం ఏదైనా చేసే స్థాయికి దిగజారుతున్నారు. జీవితంలో డబ్బే ముఖ్యమని భావించే కొందరు చివరికి మానవత్వాన్ని కూడా మరిచిపోతున్నారు. లగ్జరీ జీవితం కోసం ఓ జంట చేసిన పని అందరి చేత కంటతడి పెట్టిస్తోంది. కారు కొనేందుకు కన్న పేగును అమ్మకానికి పెట్టిన దారణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కన్నౌజ్‌లోని తిర్వా కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే దంపతులకు మూడు నెలల కిత్రం పండంటి మగబిడ్డ జన్మించాడు. కొన్నాళ్లు హాయిగా గడిచిన వీళ్ల జీవితంలో ఓ దుర్భుద్ది పుట్టింది. విలాసవంతంగా బతకాలన్న కోరిక కలిగింది.
ఇందుకు ఏకంగా కన్న కొడుకునని కూడా చూడకుండా అమ్మేందుకు సిద్దపడ్డారు. సెకండ్ హ్యండ్ కారు కొనేందుకు మూడు నెలల పసికందుకు లక్షన్నర రూపాయలకు ఓ వ్యాపారవేత్తకు అమ్మేశారు. అంతేగాక ఇప్పటికే సెకండ్ హ్యాండ్ కారును సైతం తల్లిదండ్రులు కొనుగోలు చేశారు. అయితే ఈ ఘటనపై శిశువు అమ్మమ్మ, తాతయ్య గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతానికి ఇంకా శిశువు వ్యాపారవేత్త దగ్గరే ఉందని, వాళ్ల తల్లిదండ్రులను పిలిచి విచారణ చేపడతామని ఇన్‌స్పెక్టర్ శైలేంద్ర కుమార్ మిశ్రా తెలిపారు.
చదవండి:
మహిళ రెండో పెళ్లి.. ఉమ్మిని నాకాలని కుల పెద్దల శిక్ష
తల్లి ప్రాణం తీసిన నలుగురు ఆడపిల్ల జననం
Comments
Please login to add a commentAdd a comment