
ప్రతీకాత్మక చిత్రం
సొంత ఇల్లు, కారు ఉండాలన్నది చాలా మంది కల. అయితే కారు కొనేటప్పుడు మనం చాలా విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ట్యాక్స్ విషయాలు, పేమెంట్ విధానం, ఏ మోడల్ కొనాలి, కొంత మంది విషయంలో అయితే సెంటిమెంట్లు.. ఇలా చాలా విషయాలను పరిశీలించాలి. మొదటిసారి కారుకొంటున్న వారు ముఖ్యంగా 10 విషయాల గురించి తెలుసుకుంటే మంచిది.
1. బడ్జెట్‌ను చూసుకోండి
కొంత మంది విషయాల్లో తప్ప చాలా వరకు కారు కొనుక్కునే వారు మొత్తం డబ్బు ఒకేసారి చెల్లించి కాకుండా ఈఎంఐలో కారు కొంటారు. అయితే మీరు కారు తీసుకునేటప్పుడు మీ బడ్జెట్ ఎంత ఉంది, నెలవారీ మీ అవసరాలు పోను ఎంత మిగులుతుంది. ఎక్కువ భారం పడకుండా ఎంత వరకు ఈఎంఐ కట్టగలరో చూసుకొని కారును ఎంపిక చేసుకోవాలి.
2. ఎంత దూరం ప్రయాణించాలనుకుంటున్నారు
కారు కొనే అవసరం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొంతమంది ఫ్యామిలీతో సరదగా బయటకు వెళ్లడానికి కారు కొంటే కొంత మంది ఆఫీస్ అవసరాల కోసం కొంటారు. మరి కొంతమంది లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడానికి కారును ప్రిఫర్ చేస్తారు. దీనిలో మీరు దేనికోసం కారు కావాలనుకుంటున్నారో సరిగా ఆలోచించుకొని దాని ప్రకారం మీ కారును సెలక్ట్ చేసుకోండి.
3.రీసెర్చ్ చేయండి:
కారు కొనడానికి బడ్జెట్ ఎంత ఈఎంఐ ఎంత ఇలా అని ప్లాన్ చేసుకున్న తరువాత మార్కెట్‌లో మీ బడ్జెట్‌కు ఏ ఏ కార్లు అందుబాటులో ఉన్నాయో పరిశోధించండి. మీకు తెలిసిన వారిని కనుక్కోవడమే కాకుండా కొంత టైం వెచ్చించి గూగుల్‌లో మీరు కొనాలనుకుంటున్న కారు ఫీచర్స్, డ్రాబ్యాక్స్, రివ్యూ, వేరువేరు డీలర్ల గురించి చెక్ చేయండి.
4. ఏవిధంగా కొనాలో నిర్ణయించుకోండి
కారు కొనడానికి కావాల్సినంత డబ్బు మీరు సమకూర్చుకోలేకపోతే మీరు లోన్ కోసం బ్యాంక్‌ల మీద కానీ, క్రెడిట్ కార్డు ఎజెన్సీల మీద కానీ ఆధారపడాల్సి వస్తుంది. దీని కోసం బ్యాంకులు వాటి వడ్డీ రేట్లను, క్రెడిట్ కార్డు ఎజెన్సీలను పరిశీలించి లోన్ తీసుకోండి.
5. మీ క్రెడిట్ స్కోర్ పెంచుకోండి:
క్రెడిట్ స్కోర్ మంచిగా ఉంటే బ్యాంకులు మీకు రుణం ఇవ్వడానికి ఆసక్తిని చూపిస్తాయి. మీకు కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. కాబట్టి లోన్ తీసుకునే ముందు మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోండి
6. పాత కారును ఎంచుకోవడానికి ప్రయత్నించండి
మీరు మొదటి సారి కారు కొంటున్నట్లయితే పాత కారును ఎంచుకోవడానికి ప్రయత్నించండి. మార్కెట్‌లో ఐదేళ్ల నుంచి మూడేళ్ల ఓల్డ్ కారులు కూడా ఉంటాయి. మొదట వాటిని కొనండి. వీటిని కొనేటప్పుడు మీకు ఎక్కువ మార్జిన్ కూడా లభిస్తుంది.
7. టెస్ట్ డ్రైవ్‌కు వెళ్లండి
మీ బడ్జెట్‌లో ఉన్న కారును నిర్ణయించుకున్న తరువాత ఒకటికి రెండుసార్లు టెస్ట్ డ్రైవ్‌కు వెళ్లండి. ఎందుకంటే మీకు ఆ కారు ఎంతవరకు సౌకర్యంగా ఉంది. ఎంత వరకు మీ అవసరాలకు సరిపోతుంది అనే విషయం అవగాహనకు వస్తుంది.
8. బేరం ఆడండి
ఏ కారు కొనాలో నిర్ణయించుకున్న తరువాత దాని కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పూర్తిగా చదివి టర్మ్స్ అండ్ కండీషన్స్ తెలుసుకొండి. వారంటీ ఎంత కాలం ఉంది అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించండి. అనంతరం డీలర్‌తో మీరు ఎంతకు కొనాలనుకుంటున్నారో బేరం ఆడండి, దీని వలన మీకు ఇంకొంచెం తక్కువ రేటుకు కారు లభిస్తుంది.
9. కారును పరీక్షించండి
మీరు సెకెండ్ హ్యాండ్ కారు బంధువుల నుంచి కానీ, మిత్రుల నుంచి కానీ లేదా డీలర్ల నుంచి కొనాలనుకుంటే దానిని కార్ల గురించి బాగా తెలిసిన వారి చేత టెస్ట్ చేయించండి. చాలా మెకానిక్ షోరూంలు ప్రీ ఇన్‌స్ఫెక్షన్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నాయి. కాబట్టి అలాంటి వాటి దగ్గర మీరు కొనే కారును పరీక్షించండి. దాని ద్వారా కారు అసలైన పరిస్థితి మీకు అర్థం అవుతుంది. మీ డబ్బులకు సరైన విలువ దొరుకుతుంది.
10. రైడ్‌కు వెళ్లి ఎంజాయ్ చేయండి
ఇక కారు కొనేటప్పుడు ఈ విషయాలన్ని చూసుకున్నతరువాత మీకు ఇష్టమైన కారును కొనుక్కొని మీ కోరిక నెరవేరిందనే సంతోషంలో ఒక డ్రైవ్‌కి వెళ్లి వచ్చేయండి. బడ్జెట్ ప్లానింగ్, రీసెర్చ్ అనేవి కారు కొనేటప్పుడు మీరు కచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
Comments
Please login to add a commentAdd a comment