చారాణా కోడి పిల్లకు బారాన మసాలా అంటే ఇదేనేమో. వీకెండ్ ఎంజాయ్ చేద్దామని సినిమాకెళ్తే అక్కడ రెండు సినిమాలు చూపిస్తున్నారు. ఒకటి థియేటర్‌లో..ఇంకోటి ఇంటర్వెల్‌లో. థియేటర్లలో అన్ని తరగతుల వారికి వారి స్థాయిని బట్టి టికెట్ల ధరలుంటాయి. సినిమా హాళ్ల క్యాంటీన్లలో విక్రయించే తినుబండారాలకు మాత్రం అలాంటి భేదం లేదు. సినిమాకి వెళ్తే చాలు తమకు నచ్చిన రేట్లేసి చుక్కలు చూపిస్తున్నారు.
వారమంతా కష్టపడ్డ సామాన్యుడు.. కాస్తంత రిలాక్స్ అయ్యే మంత్రం సినిమా. ఇప్పుడు అదే సినిమా థియేటర్‌లో స్నాక్స్ రేట్లు చూసి భయపడుతున్నారు. రేట్లు తగ్గించాలని ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో సినిమా థియేటర్‌లో ముఖ్యంగా పాప్‌కాన్ కాస్ట్లీపై పీవీఆర్ ఛైర్మన్ అండ్ మేనేజిండ్ డైరెక్టర్ అజయ్ బిజ్లీ స్పందించారు.
థియేటర్‌లలో పెరిగిపోతున్న శ్నాక్స్ ధరల్ని వ్యతిరేకిస్తున్న వినియోగదారుల్ని నిందించలేం. అయితే, మనదేశంలో సింగిల్ స్క్రీన్ నుంచి మల్టీఫ్లెక్స్‌ల వరకు ఫుడ్ అండ్ బేవరేజెస్(ఆహారం,కూల్ డ్రింక్స్)ధరలలో ఎటువంటి మార్పు ఉండదని బిజిలీ చెప్పారు. నిర్వహణ ఖర్చుల కోసం మల్టీప్లెక్స్‌లోని స్నాక్స్‌ను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు.
మనదేశంలో ఫుడ్ & అండ్ బేవరేజెస్ మార్కెట్ రూ.1500కోట్లుగా ఉంది. మల్టీప్లెక్స్‌లలో ఎక్కువ స్క్రీన్‌ల కారణంగా ప్రొజెక్షన్ రూమ్‌లు,సౌండ్ సిస్టమ్‌ల అవసరం ఎక్కువే. కాబట్టే ఖర్చులు "4 నుండి 6 రెట్లు" పెరుగుతాయని అన్నారు. ఫోయర్‌లు కూడా ఫుల్ ఏసీతో ఉండడంతో ఎయిర్ కండిషనింగ్ అవసరం కూడా పెరిగిందన్నారు. కాగా ఈ ఏడాది ప్రారంభంలో పీవీఆర్- ఐనాక్స్ మెర్జ్ అయిన విషయం తెలిసిందే.
చదవండి👉ఓటీటీ దెబ్బకు ఇండియన్ బిగెస్ట్ సినిమా బ్రాండ్ల విలీనం..!
Comments
Please login to add a commentAdd a comment