న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ ఐనాక్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో లాభాలకు బదులు నష్టాలు చవిచూసింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో రూ. 12 కోట్లకుపైగా నష్టాలను ప్రకటించింది. సినిమా థియేటర్ల బిజినెస్ నీరసించడం ప్రభావాన్ని చూపించింది.
గతేడాది(2023–24) ఇదే కాలంలో కంపెనీ రూ. 166 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. మొత్తం ఆదాయం సైతం 19 శాతం క్షీణించి రూ.1,622 కోట్లకు పరిమితమైంది. మొత్తం వ్యయాలు 7 శాతం తగ్గి రూ. 1,679 కోట్లుగా నమోదయ్యాయి. మూవీ ఎగ్జిబిషన్ ఆదాయం 20 శాతం క్షీణించి రూ. 1,579 కోట్లకు పరిమితమైంది. అయితే మూవీ ప్రొడక్షన్, పంపిణీ బిజినెస్ 78 శాతం పెరిగి రూ. 108 కోట్లను చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment