లండన్: బ్రిటన్‌కు చెందిన 41 ఏళ్ల ఆడమ్ మార్టిన్ పంటిలో సెప్టెంబర్‌లో పాప్‌కార్న్ ఇరుక్కుంది. దీంతో దానిని బయటకి తీయడానికి పెన్, టూత్‌పిక్, వైరు ముక్క, నెయిల్ కట్టర్ ఇలా అనేక సామగ్రిని పాప్‌కార్న్‌పై ప్రయోగించాడు. దీంతో మార్టిన్ చిగుళ్లకి ఇన్ఫెక్షన్ సోకింది. అదీ కాస్తా పెరిగి పెరిగి ఎడోకార్డిటిస్ అనే గుండె వ్యాధికి దారి తీసింది.
రాత్రిళ్లు నిద్రలో బాగా ఇబ్బందిగా ఉండటంతో వైద్యుడి వద్దకు వెళ్లగా గుండె దెబ్బతిందని చెప్పారు. చిగుళ్ల ఇన్ఫెక్షన్ రక్త నాళాల ద్వారా గుండెకు చేరి రక్తం గడ్డకట్టిందని వివరించారు. సరైన సమయానికే గుర్తించడంతో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఇన్ఫెక్షన్‌ను తొలగించారు. నరకానికి చాలా దగ్గరగా వెళ్లి అదృష్టం కొద్ది బయటపడ్డానని, ఇకపై పాప్‌కార్న్ జోలికి మాత్రం పోనని మార్టిన్ అంటున్నాడు
Comments
Please login to add a commentAdd a comment