యువకుడి మృతి
నకిరేకల్æ: నకిరేకల్‌లో పచ్చకామర్ల వ్యాధితో బాధపడుతూ ఒక యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండకు చెందిన ఎండీ.ఖయీముద్దీన్ (30) నకిరేకల్‌లోనే ఎలక్ట్రికల్ షాప్ నడుపుతూ స్థానిక పోలీస్‌స్టేషన్ సమీపంలోని పెద్ద మసీద్ పక్కన పైఅంతస్తులో అద్దెకు ఉంటున్నాడు. కొన్ని రోజులుగా పచ్చకామర్ల వ్యాధితో బాధపడుతున్నాడు. అద్దెకు ఉంటున్న గదిలోనే మృతి చెందాడు. పైఅంతస్తు కావడంతో ఆ గదిలోకి ఎవ్వరు వెళ్లలేదు. ఆదివారం పైఅంతస్తు గదిలో నుంచి దుర్వాసన రావడంతో చుట్టు పక్కల వారు వెళ్లి చూడగా ఆ గదిలో ఖయీముద్దీన్ మృతదేహం కుళ్లిపోయి ఉంది. కాగా, మృతుడి సోదరి షైనాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని హెడ్ కానిస్టేబుల్ యాదగిరిరెడ్డి తెలిపారు. మూడు రోజుల క్రితమే మృతి చెందడం వల్లే మృతదేహం కుళ్లిపోయి ఉందని పేర్కొన్నారు. కామర్ల వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబీకులు తెలిపారని వివరించారు.