Sushilamma
-
సుశీలమ్మ తన కథ తీయాలన్నారు: ఏఆర్ రెహమాన్
ప్రఖ్యాత గాయకురాలు పి. సుశీల తన బయోపిక్ తీయడానికి సహాయం చేయమని తనను అడిగారని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అన్నారు. రెహమాన్ నిర్మించిన తొలి చిత్రం ‘99 సాంగ్స్’. ఈ ఏడాది ఏప్రిల్‌లో థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. ఈ సినిమాను చూడమని పి. సుశీలను కోరారట రెహమాన్. ఈ విషయం గురించి రెహమాన్ మాట్లాడుతూ – ‘‘ఇటీవల సుశీలమ్మతో మాట్లాడినప్పుడు ‘99 సాంగ్స్’ సినిమాను చూశారా? అని అడిగాను. ఒకవేళ చూడకపోతే నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉందని చెప్పాను. అక్కడే ఉన్న సుశీలమ్మ సోదరుడు నాతో మాట్లాడారు. ఆమెకు ‘99 సాంగ్స్’ తెలుగు వెర్షన్ చూపించమని ఆయనతో చెప్పాను. సినిమా చూసిన తర్వాత సుశీలమ్మ ఫోన్ చేసి, ‘సినిమా చాలా బాగుంది’ అని ప్రశంసించారు. అంతేకాదు.. ‘‘నా కథను కూడా ‘99 సాంగ్స్’ సినిమాలా బాగా తీయాలి. హెల్ప్ చేస్తారా?’’ అని అడిగారు. సుశీలమ్మ లెజండ్. వేల పాటలు పాడారు. నా ఫేవరెట్ సింగర్. అలాంటి సుశీలమ్మగారు మా సినిమాను మెచ్చుకోవడం, తన బయోపిక్ గురించి అడగడం సంతోషంగా అనిపించింది’’ అన్నారు. -
చెట్టు కూలి ఇద్దరి మృతి
మైసూరు : మైసూరులో ప్రసిద్ధి చెందిన కోటె మారెమ్మ దేవాలయం వద్ద ఉన్న భారీ రావి చెట్టు ఆలయంపై కుప్పకూలి పోవడంతో ఇద్దరు మహిళా భక్తులు మృతి చెందగా మరి కొందరు గాయపడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. మృతులు శైలజ (35), సుశీలమ్మ (60)గా పోలీసులు గుర్తించారు. పోలీసుల వివరాల మేరకు... దేవాలయంలో మధ్యాహ్నం అమ్మవారికి పూజలు చేస్తుండగా ఒక్కసారిగా చెట్టు మొత్తం ఆలయంపై వాలిపోయింది. దీంతో ప్రాణభయంతో భక్తులు పరుగులు తీశారు. అక్కడే పూజలు చేస్తున్న శైలజ, సుశీలమ్మ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అమ్మవారి విగ్రహం తప్ప దేవాలయంలో అన్ని వస్తువులు పూర్తిగా దెబ్బతిన్నాయని అర్చకులు తెలిపారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి వీ.శ్రీనివాస్ ప్రసాద్, ఎమ్మెల్యే వాసు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ప్రకటించారు. అంతకు ముందు మహారాణి ప్రమోదాదేవి కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు.