
చోడవరం టౌన్: ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి, గుడిలో పెళ్లి చేసుకుని ఆ తరువాత ముఖం చాటేసిన యువకుడిని అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ పి.మల్లేశ్వరరావు తెలిపారు. మండలంలో నర్సయ్యపేటకు చెందిన బంటు నాగేశ్వరరావు అనే యువకుడు అదే గ్రామానికి చెందిన శైలజ అనే యువతిని ప్రేమించాడు. ఇటీవల పాడేరు తీసుకువెళ్లి అక్కడ ఆంజనేయ స్వామి గుడిలో పెళ్లి చేసుకున్నాడు. కొద్దిరోజుల తరువాత ముఖం చాటేయడంతో శైలజ గతనెల 18న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి, నాగేశ్వరావుని బుధవారం అరెస్టు చేసికోర్టులో హాజరు పరిచినట్టు ఎస్‌ఐ తెలిపారు. 14 రోజులు రిమాండ్ విధించారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment