అట్లూరు, న్యూస్‌లైన్ : కడుపునొప్పి తాళలేక అట్లూరు ఎస్సీ కాలనీకి చెందిన శైలజ(20) మంగళవారం మధ్యాహ్నం ఉరేసుకుని మృతి చెందింది. స్థానిక ఎస్‌ఐ బొజ్జప్ప వివరాల మేరకు.. అట్లూరు ఎస్సీ కాలనీకి చెందిన ఈరి మురళి, గోపాలమ్మకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మూడేళ్ల క్రితం మురళి మృతి చెందారు. ఆరు నెలల క్రితం రెండవ కుమార్తె శైలజను చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురానికి చెందిన వెంకటసుబ్బయ్యకు ఇచ్చి వివాహం చేశారు. అనంతరం గోపాలమ్మ బతుకు దెరువు నిమిత్తం కువైట్‌కు వెళ్లింది.
ఒక నెల రోజులపాటు భార్యభర్తలు కలసి ఉన్నా మళ్లీ శైలజ పుట్టింటికి వచ్చింది. నాలుగు నెలలక్రితం కడుపు నొప్పి అని ఆత్మహత్య చేసుకోబోగా బంధువులు రక్షించారు. కాగా మంగళవారం మధ్యాహ్నం కడుపు నొప్పి అధికంకావడంతో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఇంటి దూలానికి చున్నీతో ఉరివేసుకుని మృతి చెందినట్లు మృతురాలి అన్న మాదవ తెలిపినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు.
వివాహిత ఆత్మహత్య
Published Wed, Sep 4 2013 3:59 AM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM
Advertisement
Advertisement