సస్పెన్స్‌ థ్రిల్లర్‌ | ks100 movie title logo launch | Sakshi
Sakshi News home page

సస్పెన్స్‌ థ్రిల్లర్‌

Published Fri, Jan 4 2019 5:28 AM | Last Updated on Fri, Jan 4 2019 5:28 AM

ks100 movie title logo launch - Sakshi

శైలజ, సమీర్‌ ఖాన్

ఇంటర్నేషనల్‌ మోడల్స్‌ సమీర్‌ ఖాన్, శైలజలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ షేర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కెఎస్‌ 100’. చంద్రశేఖరా మూవీస్‌ పతాకంపై వెంకట్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. షేర్‌ మాట్లాడుతూ– ‘‘కెఎస్‌100’ టైటిల్‌కి తగ్గట్టుగానే వైవిధ్యమైన కథతో తెరకెక్కిన చిత్రం. హారర్, సస్పెన్స్‌ థ్రిల్లర్, రొమాంటిక్‌ జానర్స్‌లో ప్రేక్షకులను అలరించేలా తెరకెక్కించాం. యువతను, మహిళలను ఆకట్టుకునే అంశాలుంటాయి.

గోవా, హైదరాబాద్, మహారాష్ట్రలోని హిరంబుల్‌లోని అందమైన ప్రదేశాల్లో షూటింగ్‌ జరిపాం. చాలామంది మోడల్స్‌ను మా సినిమాలో పరిచయం చేస్తున్నాం. తెలుగులో ఎక్కువ మోడల్స్‌ని పరిచయం చేస్తున్న తొలి చిత్రం మాదే. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. అక్షిత, అషి, సునీత, శ్రద్ధా, నందిని, కల్పనా అజీమ్, పూరివి, సుమన్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: వంశీ, సంగీతం: నవనీత్‌ చారి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement