![Jr NTR birthday celebrations In Vijayawada and London theatres on fire - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/21/ntr-fans.jpg.webp?itok=dCqdR0Xr)
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజే వేరు. ఆయన సినిమా రిలీజైతే అభిమానులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటిస్తున్నారు. ఈనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కోసం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ సింహాద్రి రీ రిలీజ్ చేశారు.
(ఇది చదవండి: లక్షన్నరలో హీరోయిన్ వివాహం.. పెళ్లి చీర రూ.3 వేలు మాత్రమేనట!)
అయితే ఈ సినిమా రిలీజ్ రోజున ఎన్టీఆర్ ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. సినిమా రిలీజైన థియేటర్ల ముందు పాలాభిషేకాలు, కేక్‌లు చేసి సందడి చేశారు. అయితే విజయవాడలోని గాంధీనగర్ అప్సర థియేటర్‌లో అభిమానులు ఏకంగా టపాసులు పేల్చారు. దీంతో సీట్లకు మంటలు అంటుకుని థియేటర్ మొత్తం వ్యాపించాయి. అయితే అక్కడే ఉన్న పోలీసులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో సినిమా చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఈ ఘటనతో సాయంత్రం ప్రదర్శించాల్సిన షోలను నిర్వాహకులు రద్దు చేశారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
(ఇది చదవండి: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత)
Comments
Please login to add a commentAdd a comment