
దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన చిత్రాల్లో ‘ది టెర్మినేటర్’, ‘టైటానిక్’, ‘అవతార్’.. ఈ మూడు చిత్రాలకూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఇప్పుడు కామెరూన్ ‘అవతార్’ సీక్వెల్‌తో బిజీగా ఉన్నారు. అయితే కరోనా కారణంగా ‘అవతార్’కి అవరోధం ఏర్పడింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ లాస్ ఏంజెల్స్‌లో జరుగుతోంది. అలాగే న్యూజిల్యాండ్‌లోని ‘వెటా డిజిటల్’లో విజువల్ ఎఫెక్ట్స్ పనులు మొదలుపెట్టాలనుకున్నారు. దీనికోసం ఒక బృందంతో కలిసి కామెరూన్ న్యూజిల్యాండ్ వెళ్లాలనుకున్నారు. ‘‘శుక్రవారం వెళదామనుకున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రయాణం ప్రమాదం. అందుకే విరమించుకున్నాం’’ అని చిత్రనిర్మాత లాండ్యూ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment