
Avatar The Way Of Water Teaser Released: ప్రపంచ సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం 'అవతార్ 2'. 2009లో హాలీవుడ్ లెజండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ సృష్టించిన గొప్ప విజువల్ వండర్ 'అవతార్'. దీనికి సీక్వెల్‌గా వస్తున్న మూవీ 'అవతార్: ది వే ఆఫ్ వాటర్'. ఈ చిత్రాన్ని ఎన్నడూ లేని విధంగా ఏకంగా 160 భాషల్లో డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ మూవీ టీజర్‌ను మే 6న 'డాక్టర్ స్ట్రేంజ్: ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్' సినిమా ప్రదర్శించే థియేటర్లలో విడుదల చేశారు.
'అవతార్: ది వే ఆఫ్ వాటర్' టీజర్‌ను తాజాగా సోషల్ మీడియాలో సోమవారం (మే 9) రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ పండోరా గ్రహానికి సంబంధించిన విజువల్స్‌తో ప్రారంభం కాగా, అందులోని అద్భుతమైన లొకేషన్లు, మైమరిపించే నీలి సముద్రం అబ్బురపరిచేలా ఉన్నాయి. టీజర్ ఆసక్తిగా ఉన్నా సినిమా కథేంటి అనేది సస్పెన్స్‌గానే ఉంది. కాగా ఈ సినిమా డిసెంబర్ 16న విడుదలకు సిద్ధంగా ఉండగా, 2024లో అవతార్ 3, 2026లో అవతార్ 4, 2028లో అవతార్ 5 సినిమాలు రిలీజ్ కానున్నాయి.
చదవండి: ఇదెక్కడి మాస్ రిలీజ్ జేమ్స్ మావా.. అన్ని భాషల్లో 'అవతార్ 2' సినిమా !
“Wherever we go, this family is our fortress.”
— Avatar (@officialavatar) May 9, 2022
Watch the brand-new teaser trailer for #Avatar: The Way of Water. Experience it only in theaters December 16, 2022. pic.twitter.com/zLfzXnUHv4
Comments
Please login to add a commentAdd a comment