అవతార్‌ 2 లీక్‌.. నెట్టింట దుమ్ము దుమారం.. | Avatar: The Way Of Water Full Movie Leaked Online | Sakshi
Sakshi News home page

Avatar: The Way Of Water: బిగ్‌ షాక్‌.. అవతార్‌ 2 లీక్‌!

Dec 15 2022 9:13 PM | Updated on Dec 15 2022 9:31 PM

Avatar: The Way Of Water Full Movie Leaked Online - Sakshi

ఫ్రీగా సినిమా అందుబాటులో ఉండటంతో చాలామంది నెట్టింట ప్రింట్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని చూసేస్తున్నారు.

జేమ్స్‌ కామెరూన్‌ డైరెక్ట్‌ చేసిన భారీ బడ్జెట్‌ చిత్రం అవతార్‌ 2. ఈ సినిమా శుక్రవారం గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతుండగా చిత్రయూనిట్‌కు భారీ షాక్‌ తగిలింది. రిలీజ్‌కు ఒకరోజు ముందే ఆన్‌లైన్‌లో అవతార్‌ 2 సినిమా ప్రత్యక్షమైంది. కొందరు ఈ సినిమాను పైరసీ చేసి టెలిగ్రామ్‌లోనూ అప్‌లోడ్‌ చేశారు. ఫ్రీగా సినిమా అందుబాటులోకి రావడంతో చాలామంది నెట్టింట ప్రింట్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని చూసేస్తున్నారు.

దీనిపై సినీప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవతార్‌ 2 థియేటర్లలో చూసిన సినిమా అని, ఫోన్‌లో చూస్తే మజా ఏం ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. వేలాది కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన సినిమాను ఇలా పైరసీ చేయడం చాలా పెద్ద తప్పని కామెంట్లు చేస్తున్నారు. మరి అవతార్‌ 2 విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రావడం వల్ల సినిమా కలెక్షన్లపై ఏమైనా ఎఫెక్ట్‌ పడుతుందేమో చూడాలి!

కాగా 13 ఏళ్ల క్రితం ఘన విజయం సాధించిన అవతార్‌కు సీక్వెల్‌గా వస్తోందీ చిత్రం. ఈ సినిమా ఏకంగా 160 భాషల్లో రిలీజ్‌ కానుంది. ఒక్క భారత్‌లోనే ఆరు భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా రన్‌ టైమ్‌ 3 గంటల 12 నిమిషాల 10 సెకన్లు. పండోరాలోని మరిన్ని వింతలు, అద్భుతాలు, ప్రకృతి అందాలు, సాహసాలతో సినిమా అద్భుతంగా తెరకెక్కినట్లు ట్రైలర్‌ చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటివరకు ఇండియా మొత్తం మీద 10 లక్షల టికెట్లు అమ్ముడవగా అందులో ఏడున్నర లక్షల టికెట్లు దక్షిణాదివాళ్లే బుక్‌ చేసుకోవడం విశేషం.

చదవండి: పుట్టింటికి వెళ్లిన ఉపాసన, మిస్‌ యూ అత్తమ్మ అంటూ పోస్ట్‌
నేను బతికే ఉన్నా, చనిపోలేదు: సీనియర్‌ నటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement