విజువల్ వండర్ అవతార్ మూవీ గురించి తెలియని సినీ ప్రేమికుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ప్రేక్షకులను ఎంతగానో అబ్బురపరిచిన ఈ చిత్రం సునామీలాంటి కలెక్షన్లతో ప్రపంచ బాక్సాఫీస్‌ను గడగడలాడించేసింది. 2009లో అవతార్ సినిమా రాగా పదమూడేళ్ల తర్వాత దీని సీక్వెల్ వస్తోంది.
డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అవతార్: ది వే ఆఫ్ వాటర్ పేరుతో సీక్వెల్ తెరకెక్కించగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. 3డీ వర్షన్‌లో ఉన్న ట్రైలర్ చూసి పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. 160 దేశాల్లో డిసెంబర్ 16న ఈ సినిమా విడుదల కాబోతోంది.
Comments
Please login to add a commentAdd a comment