Avatar the Way of Water Trailer Leaked in Online - Sakshi
Sakshi News home page

Avatar 2: ఆన్​లైన్​లో లీకైన 'అవతార్​ 2' సినిమా ట్రైలర్​ !..

Published Wed, May 4 2022 7:28 PM | Last Updated on Wed, May 4 2022 8:15 PM

Avatar The Way Of Water Trailer Leaked In Online - Sakshi

ప్రపంచ సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం 'అవతార్​ 2'. 2009లో హాలీవుడ్​ లెజండరీ డైరెక్టర్​ జేమ్స్​ కామెరాన్​ సృష్టించిన గొప్ప విజువల్​ వండర్​ 'అవతార్'​. దీనికి సీక్వెల్​గా వస్తున్న మూవీకి 'అవతార్​: ది వే ఆఫ్​ వాటర్'​గా టైటిల్​ పెట్టారు. ఈ చిత్రాన్ని ఎన్నడూ లేని విధంగా ఏకంగా 160 భాషల్లో డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్న విషయం తెలిసిందే. అలాగే ఈ మూవీ ట్రైలర్​ను 'డాక్టర్​ స్ట్రేంజ్:​ ఇన్​ ది మల్టీవర్స్​ ఆఫ్​ మ్యాడ్​నెస్'​ సినిమా విడదల రోజైన మే 6న థియేటర్లలో ప్రదర్శించనున్నారు. 

అయితే 'అవతార్​ 2' అభిమానులకు నిరాశ కలిగించే ఓ వార్త చక్కర్లు కొడుతోంది. థియేటర్లలో ఆస్వాదించాలనుకున్న ఈ మూవీ ట్రైలర్ ఆన్​లైన్​లో లీకైందని సమాచారం. ఈ లీకేజీకి సంబంధించిన ఫుటేజ్​ లింక్​లు సోషల్​ మీడియాలో దర్శనమిచ్చాయి. అయితే ప్రస్తుతం ఫుటేజ్​కు సంబంధించిన లింక్​లు, ఫొటోలు ట్విటర్ డిలీట్​ చేయడంతో మేకర్స్​ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ లీక్​కు సంబంధించిన కారణాలు మాత్రం ఇంతవరకు తెలియరాలేదు. ఇది కూడా ఒక ప్రమోషన్​ స్టంట్​ అని పలువురు నెటిజన్స్​ భావిస్తున్నారు. ఇటీవల ఏప్రిల్​ 27న ఈ మూవీ గ్లింప్స్​ను 'సినిమా కాన్'​లో ప్రీమియర్​గా ప్రదర్శించారు. 

చదవండి: ఇదెక్కడి మాస్‌ రిలీజ్‌ జేమ్స్‌ మావా.. అన్ని భాషల్లో 'అవతార్‌ 2' సినిమా !
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement