Actor Akshay Kumar Review On Avatar 2 Movie: Akshay Says Magnificent Is The Word - Sakshi
Sakshi News home page

Avatar: The Way of Water: అద్భుతం అనే పదం సరిపోదు.. ‘అవతార్‌ 2’పై అక్షయ్‌ కుమార్‌ రివ్యూ

Published Thu, Dec 15 2022 6:21 PM | Last Updated on Thu, Dec 15 2022 7:06 PM

Akshay Kumar Review On Avatar 2 Movie - Sakshi

అవతార్‌ 2.. జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్‌ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కోట్లాది సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది టికెట్లు బుక్‌ చేసుకున్నారు. మరికొద్ది గంటల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది. అయితే కొంతమంది సీనీ ప్రముఖుల కోసం ఇప్పటికే స్పెషల్‌ షో వేసింది చిత్రబృందం. ఈ సినిమా చూసిన బాలీవుడ్‌ స్టార్స్‌ వరుణ్‌ ధావన్‌, అక్షయ్‌ కుమార్‌ సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
 

Watched #AvatarTheWayOfWater last night and Oh boy!!MAGNIFICENT is the word. Am still spellbound. Want to bow down before your genius craft, @JimCameron. Live on!

అక్షయ్‌ కూమార్‌ కూడా ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘నిన్న రాత్రి అవతార్‌ 2 సినిమా చూశాను. ఈ చిత్రం గురించి చెప్పడానికి అద్భుతం అనే పదం కూడా సరిపోదేమో. ఇప్పటికీ ఆ సినిమా నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను. జేమ్స్‌ కామెరూన్‌ ప్రతిభకు తలవంచాలని ఉంది’ అని అక్షయ్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు. ‘అవతార్‌ 2లోని విజువల్స్‌, ఎమోషన్స్‌ చూసి ఆశ్చర్యపోయాను. మళ్లీ ఈ చిత్రాన్ని త్రీడీలో చూడాలనుకుంటున్నాను’అని వరుణ్‌ ధావన్‌ ట్వీట్‌ చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా 160 భాషల్‌లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. భారత్‌లో హిందీ, తెలుగుతో పాటు మొత్తం ఆరు భాషల్లో రిలీజ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement