
సెట్‌లో పంచుకున్న కేక్స్
‘అవతార్ 2’ ఫ్యామిలీ అంతా నోరు తీపి చేసుకున్నారు.‘అవతార్ 2’ షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టినందుకేనా ఈ సెలబ్రేషన్స్ అంటే కానే కాదు. లైవ్ యాక్షన్ ఫిల్మింగ్‌లో వంద రోజుల మైలురాయిని చేరుకున్నందుకట. 2009లో జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన ‘అవతార్’ చిత్రం బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే. అందుకే ‘అవతార్’ సీక్వెల్స్‌పై దృష్టి పెట్టారు జేమ్స్ కామెరూన్ . ప్రస్తుతం ‘అవతార్ 2’ చిత్రీకరణ న్యూజిలాండ్‌లో జరుగుతోంది. ‘న్యూజిలాండ్‌లో లైవ్ యాక్షన్ ఫిల్మింగ్‌లో ‘అవతార్ 2’ చిత్రీకరణ వంద రోజులను పూర్తి చేసుకుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా కేక్ పంచుకుని సంబరాలు చేసుకున్నారు టీమ్. ‘అవతార్ 2’లో ఎక్కువగా అండర్ వాటర్ సీన్స్ ఉండబోతున్నాయని తెలిసింది. ఈ చిత్రం వచ్చే ఏడాది డిసెంబరు 21న విడుదల కానుంది.