
సినిమా ప్రేక్షకులు ‘అవతార్’ ప్రపంచాన్ని అంత ఈజీగా మర్చిపోలేరు. ఆ సినిమా అంత ప్రభావితం చేసింది. అంచనాలకు మించిన భారీ వసూళ్లు రాబట్టింది. జేమ్స్ కామెరూన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సీక్వెల్స్‌గా ‘అవతార్ 2, అవతార్ 3, అవతార్ 4’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అవతార్ 2, అవతార్ 3 లను ఒకేసారి సెట్స్‌పై ఉంచారట టీమ్. ఈ అవతార్ ఫ్యామిలీలోకి ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఫేమ్ ఆస్ట్రేలియన్ యాక్టర్ బ్రెండెన్ కోవెల్‌ను తీసుకున్నారు.
రచయితగా, దర్శ కుడిగా, నటుడిగా బ్రెండెన్‌కి మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు ‘అవతార్’లాంటి ప్రతిష్టా త్మక చిత్రంలో నటించబోతున్నం దుకు ఆనందం వ్యక్తం చేశారు బ్రెండెన్. ఈ చిత్రంలో పండోరా గ్రహంలో కెప్టెన్ మిక్ స్కార్స్‌బీ పాత్రలో కనిపిస్తారాయన. ప్రస్తుతం లైవ్ యాక్షన్ సీన్స్‌ను న్యూజిలాండ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించే పనిలో పడ్డారట ‘అవతార్’ టీమ్. ‘అవతార్ 2’ చిత్రాన్ని 2020 డిసెంబర్ 18న విడుదల చేయాలనుకుంటున్నారు. అలాగే 2021 డిసెంబర్ 17న అవతార్ 3, 2024 డిసెంబర్ 20న అవతార్ 4 చిత్రాల విడుదలను ప్లాన్ చేశారు.