Chiranjeevi Emotional Over James Cameron Praises on Ram Charan - Sakshi
Sakshi News home page

Chiranjeevi: చరణ్‌ను చూసి తండ్రిగా గర్విస్తున్నా.. చిరు ఎమోషనల్‌

Published Sat, Feb 18 2023 11:21 AM | Last Updated on Sat, Feb 18 2023 11:44 AM

Chiranjeevi Emotional Over James Cameron Praises On Ram Charan - Sakshi

చరణ్‌ ఇంత ఎత్తుకు ఎదిగాడా? తండ్రిగా తనను చూసి గర్వపడుతున్నాను. జేమ్స్‌ కామెరూన్‌ ప్రశంసలే అతడికి దివ్య ఆశీస్సులు, భవిష్యత్తుకు బంగారు బాటలు' అని భావోద్వేగం

రాజమౌళి డైరెక్ట్‌ చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై హాలీవుడ్‌ దిగ్గజం జేమ్స్‌ కామెరూన్‌ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే! ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారంటూ జక్కన్నపై ఆయన పొగడ్తల వర్షం కురిపించారు. తాజాగా ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేమ్స్‌ కామెరూన్‌ ఆర్‌ఆర్‌ఆర్‌లో రామ్‌చరణ్‌ పాత్రను మెచ్చుకున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌ అద్భుత సినిమా. తొలిసారి ఒంటరిగా చూసినప్పుడు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. కథ చెప్పిన విధానం, వీఎఫ్‌ఎక్స్‌ అంతా కూడా షేక్‌స్పియర్‌ క్లాసిక్‌లా అనిపించింది. రామ్‌ క్యారెక్టర్‌ నిజంగా ఛాలెంజింగ్‌ పాత్ర. ఆ పాత్ర మైండ్‌లో ఏముందనేది తెలిసాక గుండె బద్ధలైనట్లే అనిపిస్తుంది. ఇటీవలే రాజమౌళిని కలిసినప్పుడు ఇదే చెప్పాను' అని చెప్పుకొచ్చాడు.

ఇది చూసిన చిరంజీవి సంతోషంతో ఉప్పొంగిపోయాడు. ఆ వీడియోను షేర్‌ చేస్తూ.. 'ఆర్‌ఆర్‌ఆర్‌లో రామ్‌చరణ్‌ పాత్రను జేమ్స్‌ కామెరూన్‌ ప్రస్తావించడం సంతోషంగా ఉంది. గ్లోబల్‌ ఐకాన్‌, సినిమాటిక్‌ జీనియస్‌ నీ పర్ఫామెన్స్‌ ఇష్టపడ్డారంటే ఆయన అభిప్రాయం ముందు ఆస్కార్‌ కూడా చిన్నదే అవుతుంది. చరణ్‌ ఇంత ఎత్తుకు ఎదిగాడా? తండ్రిగా తనను చూసి గర్వపడుతున్నాను. జేమ్స్‌ కామెరూన్‌ ప్రశంసలే అతడికి దివ్య ఆశీస్సులు, భవిష్యత్తుకు బంగారు బాటలు' అని భావోద్వేగంతో ట్వీట్‌ చేశాడు.

చదవండి: అవార్డు ఫంక్షన్‌లో ప్రముఖ నటుడు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement