
ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన హాలీవుడ్ విజువల్ వండర్ అవతార్. పండోరా గ్రహంలోని వింత జీవులు మానవులతో చేసిన పోరాటమే ఈ సినిమా కథ. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో నాలుగు సీక్వెల్స్‌కు ప్లాన్ చేశారు చిత్రయూనిట్. వరుసగా నాలుగు సీక్వెల్స్‌ను తెరకెక్కిస్తున్నారు.
తాజాగా అవతార్ తొలి సీక్వెల్ అవతార్ 2 రిలీజ్ డేట్‌ను ప్రకటించారు చిత్రయూనిట్. 2021 డిసెంబర్ 17న ఈ సినిమా రిలీజ్ అవుతుందంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ముందుగా ఈ సినిమా సీక్వెల్ 2020 డిసెంబర్‌లోనే రిలీజ్ అవుతుందని భావించినా నిర్మాణం ఆలస్యం కావటంతో ఏడాది పాడు వాయిదా పడింది. 3,4,5 భాగాలను కూడా రెండేళ్ల విరామంతో వరుసగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన అవతార్ 2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటి వరకు ఉన్న హాలీవుడ్ కలెక్షన్ రికార్డులన్నింటినీ చెరిపేసిన అవతార్ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఆల్‌టైం రికార్డ్‌ను సృష్టించింది. ఇటీవల రిలీజ్ అయిన అవెంజర్స్ : ఎండ్‌గేమ్.. అవతార్ రికార్డ్‌లను చెరిపేయటం ఖాయంగా కనిపిస్తోంది. మరో అవతార్ 2తో మరోసారి కామెరూన్ ఆల్‌టైం రికార్డ్‌ను సాధిస్తాడేమో చూడాలి.
Now scheduled to land on Pandora December 17, 2021 pic.twitter.com/d21QmCwiHC
— Avatar (@officialavatar) 7 May 2019
Comments
Please login to add a commentAdd a comment