ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో 'అవతార్: ది వే ఆఫ్ వాటర్ (అవతార్-2)’ ఒకటి. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 16న ప్రేక్షకులు ముందుకు రానుంది. 13 ఏళ్ల తర్వాత ‘అవతార్’కి సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీ.. విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ట్రైలరే ఇలా ఉంటే సినిమా ఎలా ఉండబోతుందోననే క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగిపోయింది. అందుకే టికెట్లు అడ్వాన్స్‌గా బుక్ చేసుకుంటున్నారు. నెట్టింట అవతార్ 2పై ప్రతి రోజు ఏదో ఒక చర్చ మొదలవుతుంది. తాజాగా ఈ సినిమా రన్‌టైమ్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
అదేంటంటే ‘అవతార్ 2’ రన్ టైమ్ 192 నిమిషాల 10 సెక్లను. అంటే 3 గంటల 12 నిమిషాల 10 సెకన్లు.ఇటీవల కాలంలో అత్యధిక నిడివి గల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడం తగ్గిపోయాయి. రెండున్నర గంటల నిడివి ఉన్న సినిమాలే ఎక్కువగా విడుదలవుతున్నాయి. ప్రేక్షకులు కూడా నిడివి తక్కువ ఉన్న సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కంటెంట్‌లో దమ్ము ఉంటే తప్పా మూడు గంటల పాటు ప్రేక్షకుడు థియేటర్‌లో కూర్చొలేకపోతున్నాడు. కానీ జేమ్స్ కామెరున్ మాత్రం తన సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నాడు. థియేటర్స్‌కి వచ్చిన ప్రేక్షకుడు.. మూడు గంటల పాటు కొత్త ప్రపంచంలోకి వెళ్తాడని.. నిడివి తనకు సమస్యే కాదు అంటున్నాడట. 2009లో విడుదలైన అవతార్-1 రన్‌టైమ్ 162 నిమిషాలు. అంటే రెండు గంటల 42 నిమిషాలు. దాన్ని మించి అవతార్ 2 రన్ టైమ్ ఉండడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment