![James Cameron Says 'Avatar 2' Postponed - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/9/avthar2.jpg.webp?itok=WtWWkp7N)
అవతార్ 2 పోస్టర్
వచ్చే ఏడాది పండోరా ప్రపంచాన్ని వెండితెరపై చూడొచ్చు అని ఆశపడిన ‘అవతార్’ ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది. ‘అవతార్ 2’ చిత్రం వాయిదా పడింది. ఈ విషయాన్ని దర్శకుడు జేమ్స్ కామెరూన్ వెల్లడించారు. 2009లో జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన ‘అవతార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రపంచంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే.
దీని బట్టి పండోరా గ్రహం విశేషాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అడియన్స్ ఇంట్రెస్ట్‌కు తగ్గట్లే ‘అవతార్ 2,3,4,5’ సీక్వెల్స్ తెరకెక్కిస్తున్నారు జేమ్స్ కామెరూన్. తొలుత ‘అవతార్ 2’ చిత్రాన్ని 18 డిసెంబరు 2020న విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ 17 డిసెంబరు 2021లో విడుదల చేయనున్నట్లు తాజాగా జేమ్స్ కామెరూన్ తెలిపారు. ‘‘సెట్‌లో తీరిక లేకుండా ఉన్నా. కానీ ‘అవతార్ 2’ కొత్త రిలీజ్ డేట్ 17 డిసెంబరు 2021 అని చెప్పాలనుకుంటున్నాను’’ అని కామెరూన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment