Avatar: The Way of Water Advance Bookings in India Creates History - Sakshi
Sakshi News home page

Avatar 2 : అవతార్‌-2 అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో రికార్డుల మోత.. కేజీఎఫ్‌ రికార్డు బద్దలు

Published Fri, Dec 16 2022 11:25 AM | Last Updated on Fri, Dec 16 2022 12:38 PM

Avatar 2 : The Way Of Water Advance Bookings In India Creats History - Sakshi

సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అవతార్‌-2 నేడు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పంచ వ్యాప్తంగా  52000 స్క్రీన్స్‌లో అవతార్‌-2 గ్రాండ్‌గా విడుదలైంది.అయితే రిలీజ్‌కు ముందే ఈ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో రికార్డుల మోత మోగించింది. గతంలో ఏ సినిమాకి లేనంతగా అవతార్‌-2కి అడ్వాన్స్‌ బుకింగ్స్‌ జరిగాయి. ఈ క్రమంలో భారత్‌లో కేజీఎఫ్‌ రికార్డును అవతార్‌-2 బ్రేక్‌ చేసేసింది. దీంతో ఓపెనింగ్‌ కలెక్షన్స్‌పై కూడా భారీగా అంచనాలు క్రియేట్‌ అయ్యాయి.

భారత్‌లో సుమారు రూ.30-40 కోట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అవతార్-2 మూవీ కోసం 4,41,960 మంది భారత్‌లో అడ్వాన్స్‌గా టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇప్పటి వరకూ ఏ సినిమాకి కూడా ఇంతమంది అడ్వాన్స్‌గా టికెట్లు బుక్ చేసుకోలేదు. కేజీఎఫ్-2కి 4,11,000 మంది, బ్రహ్మస్త్రకి 3,02,000, దృశ్యం-2కి 1,16,000, ఆర్ఆర్ఆర్‌కి 1,05,000 టికెట్లు అడ్వాన్స్‌గా బుక్ అయ్యాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 800 ప్లస్ థియేటర్స్ ఈ సినిమా రిలీజ్‌ అయ్యింది. దీన్ని బట్టి ఓవరాల్‌గా తొలి మూడు రోజుల్లోనే భారత్‌లో అవతార్‌-2  రూ.100కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టే అవకాశం కనిపిస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement