Advance bookings
-
Pushpa2: ఇదెక్కడి మాస్‌రా మావ.. అప్పుడే సెంచరీ దాటేశాడు!
'రికార్డుల్లో పుష్ప పేరు ఉండడం కాదు.. పుష్ప పేరు మీదే రికార్డులు ఉంటాయి' అనే సినిమా డైలాగ్ కూడా సరిపోదేమో. అంతలా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది పుష్ప-2. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ మిలియన్ల వ్యూస్‌తో సరికొత్త రికార్డ్స్ సృష్టించాయి. అంతేకాకుండా ఓవర్సీస్లో ఏ భారతీయ సినిమా సాధించని అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ సాధించింది.తాజాగా మరో క్రేజీ రికార్డ్ క్రియేట్ చేసింది ఐకాన్ స్టార్ మూవీ. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. భారతీయ సినీ చరిత్రలోనే ఓ మైలురాలుగా నిలవనుంది. ఈ విషయాన్ని పుష్ప టీమ్ ట్విటర్ ద్వారా పంచుకుంది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఫ్యాన్స్ కోసం ఒక రోజు ముందే బెనిఫిట్ షోలు ప్రదర్శించనున్నారు.#Pushpa2TheRule crosses the 100 CRORES mark with advance bookings 💥💥💥THE BIGGEST INDIAN FILM is on a record breaking spree ❤🔥#RecordsRapaRapAA 🔥🔥#Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/vTBhiy18oB— Pushpa (@PushpaMovie) December 3, 2024 -
Indian Railways: అడ్వాన్స్ బుకింగ్ ఇకపై 60 రోజులే
సాక్షి, న్యూఢిల్లీ: రైళ్లలో అడ్వాన్స్ టికెట్ బుకింగ్ నిబంధనలను భారతీయ రైల్వే మార్చింది. ప్రస్తుతం నాలుగు నెలల ముందుగానే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉండగా.. దీన్ని 60 రోజులకు కుదించింది. అడ్వాన్స్ రిజర్వేషన్ కాల పరిమితిని 60 రోజులకు తగ్గిస్తూ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంతకు ముందు అడ్వాన్స్ రిజర్వేషన్ కాలపరిమితి 120 రోజులు కాగా, ఇప్పుడు అది 60 రోజులకు తగ్గింది. ఈ నిర్ణయం నవంబర్ 1వ తేదీ నుంచి బుక్ చేసుకొనే టికెట్లపై అమలుకానుంది. ఐఆర్సీటీసీ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా టికెట్‌ను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. లేదా రైల్వే టికెట్ కౌంటర్ నుంచి టికెట్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. మరోవైపు తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్ వంటి షార్ట్ రూట్ రైళ్లకు ఈ నిర్ణయం వర్తించదని రైల్వే శాఖ తెలిపింది. అదే సమయంలో విదేశీ పర్యాటకులకు 365 రోజుల అడ్వాన్స్ బుకింగ్ నిబంధనలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. రిజర్వు టికెట్లు అధికంగా రద్దు అవుతుండటం, ప్రయాణికులు రాక సీట్లు, బెర్తులు ఖాళీగా ఉండిపోతుండటాన్ని దృష్టిలో పెట్టుకొని అడ్వాన్స్ టికెట్ల బుకింగ్ కాలపరిమితిని తగ్గించామని రైల్వే పేర్కొంది. ప్రస్తుతం కాన్సిలేషన్స్ 21 శాతం ఉంటున్నాయని, 4–5 శాతం ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నా.. ప్రయాణం చేయడం లేదని వివరించింది. దీనివల్ల దళారులు సీట్లను అమ్ముకుంటున్నారని, రైల్వే సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని పేర్కొంది. వీటన్నింటికీ అడ్డుకట్ట వేయడానికే అడ్వాన్స్ రిజర్వేషన్ కాలపరిమితిని 120 నుంచి 60 రోజులకు కుదించామని తెలిపింది. -
రిలీజ్‌కు ముందే సలార్ రికార్డ్.. అట్లుంటది మనతోని..!
ఈ వారంలో రిలీజవుతున్న ప్రభాస్ సలార్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్స్ ప్రారంభం హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఎంతోమంది అభిమానులు టికెట్స్ దొరకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే సలార్ బుకింగ్స్ రూ.18 కోట్లకు పైగా జరిగినట్లు తెలుస్తోంది. అయితే సలార్‌కు ఒక రోజు ముందే బాలీవుడ్ బాద్షా నటించిన డంకీ చిత్రం కూడా బాక్సాఫీస్ బరిలో నిలిచింది. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 21న రిలీజ్ కానుంది. ఈ మూవీ టికెట్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. ఇప్పటివరకు రూ.12 కోట్ల వరకు బుకింగ్స్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్క రోజు వ్యవధిలో బాక్సాఫీస్ బరిలో ఇద్దరు స్టార్ హీరోలు పోటీ పడనుండండతో కలెక్షన్స్ పైనే అందరి దృష్టి పడింది. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే ఓ రేంజ్లో దూసుకెళ్తోన్న సలార్ ముందు.. షారుక్ ఖాన్ డంకీ పోటీలో నిలుస్తుందా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే. కాగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, టిను ఆనంద్, జగపతి బాబు కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం కోసం తెలుగు రాష్ట్రాల్లో యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు షారుక్ ఖాన్ డంకీ చిత్రంలో తాప్సీ పన్ను, బోమన్ ఇరానీ, విక్కీ కౌశల్ కూడా కీలక పాత్రల్లో నటించారు. -
అవతార్-2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డుల మోత
సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అవతార్-2 నేడు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పంచ వ్యాప్తంగా 52000 స్క్రీన్స్‌లో అవతార్-2 గ్రాండ్‌గా విడుదలైంది.అయితే రిలీజ్‌కు ముందే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డుల మోత మోగించింది. గతంలో ఏ సినిమాకి లేనంతగా అవతార్-2కి అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఈ క్రమంలో భారత్‌లో కేజీఎఫ్ రికార్డును అవతార్-2 బ్రేక్ చేసేసింది. దీంతో ఓపెనింగ్ కలెక్షన్స్‌పై కూడా భారీగా అంచనాలు క్రియేట్ అయ్యాయి. భారత్‌లో సుమారు రూ.30-40 కోట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అవతార్-2 మూవీ కోసం 4,41,960 మంది భారత్‌లో అడ్వాన్స్‌గా టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇప్పటి వరకూ ఏ సినిమాకి కూడా ఇంతమంది అడ్వాన్స్‌గా టికెట్లు బుక్ చేసుకోలేదు. కేజీఎఫ్-2కి 4,11,000 మంది, బ్రహ్మస్త్రకి 3,02,000, దృశ్యం-2కి 1,16,000, ఆర్ఆర్ఆర్కి 1,05,000 టికెట్లు అడ్వాన్స్‌గా బుక్ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 800 ప్లస్ థియేటర్స్ ఈ సినిమా రిలీజ్ అయ్యింది. దీన్ని బట్టి ఓవరాల్‌గా తొలి మూడు రోజుల్లోనే భారత్‌లో అవతార్-2 రూ.100కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టే అవకాశం కనిపిస్తుంది. -
అదిరిపోయే ఫీచర్లతో కియా ఎలక్ట్రిక్ కారు.. బుకింగ్స్ షురూ..
అనతి కాలంలోనే ఇండియన్ కార్ల మార్కెట్లో తనదైన ముద్ర వేసిన కియా నుంచి త్వరలో ఎలక్ట్రిక్ కారు రాబోతుంది. 2022 జూన్ 2న కారును మార్కెట్లో రిలీజ్ చేయబోతుంది కియా. దీంతో ఆన్లైన్లో ఆడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించింది. కియా అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ముందస్తుగా కియా ఎలక్ట్రిక్ కారు ఈవీ 6ను బుక్ చేసుకోవచ్చు. టోకెన్ అమౌంట్‌గా మూడు లక్షల రూపాయలను అడ్వాన్స్ బుకింగ్ సమయంలో చెల్లించాల్సి ఉంటుంది. కియా సంస్థ ఇటీవల ఎలక్ట్రిక్ కారును తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఈవీ 6 పేరుతో ఈ మోడల్‌ను రిలీజ్ చేయనుంది. ఈవీ కారులో 77.4 కిలోవాట్ బ్యాటరీని అమర్చారు. సింగిల్ ఛార్జ్‌తో 528 కిలోమీటర్లు ప్రయాణం చేయోచ్చని కియా చెబుతోంది. 5.2 సెకన్లలో వంద కిలోమీటర్ల స్పీడును ఈ కారు అందుకోగలదు. గరిష్ట వేగం గంటకు 192 కిలోమీటర్లు. కియా ఈవీ 6 ధర రూ.60 లక్షల వరకు ఉంచవచ్చని అంచనా. 18 నిమిషాల్లో బ్యాటరీ 80 శాతం ఛార్జ్ అవుతుంది. లార్జ్ బూట్ స్పేస్, పెద్దదైన సన్‌రూఫ్, ఎల్లాయ్వీల్స్, అధునాత టెయిల్ ల్యాంప్ సిస్టమ్, లెటెస్ట ఇన్ఫోంటైన్ సిస్టమ్, ఆగ్యుమెంటెడ్ రియాల్టీ హెడ్అప్ డిస్ప్లే, ఆల్‌వీల్ డ్రైవ్, నార్మల్, స్పోర్ట్స్, ఎకో డ్రైవింగ్ మోడ్స్, ఈవీ రిమోట్ ఛార్జింగ్ కంట్రోల్, సరౌండ్ వ్యూ మానిటరింగ్, ఈవీ రిమోట్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఈ కారులో పొందు పరిచారు. ఈవీ 6 మోడల్లో జీటీ లైన్, జీటీ లైన్ ఏవీడీ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. చదవండి: వచ్చేస్తోంది..కియా ఎలక్ట్రిక్ కారు..మొదలుకానున్న బుకింగ్స్..ఎప్పుడంటే..? -
ఆగస్టు వరకు రైలు ప్రయాణాలు లేనట్టేనా?
న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు రవాణా రంగం దారుణంగా దెబ్బతిన్నది. దాదాపు రెండు నెలల తర్వాత బస్సులు రోడ్డెక్కాయి. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికి కూడా హైదరాబాద్‌లో సిటీ బస్సులు తిరగడం లేదు. కఠిన నియమ నిబంధనల మధ్య దేశీయ విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికి కూడా కేంద్రం రైల్వే సర్వీసులకు అనుమతివ్వడం లేదు. ఈ క్రమంలో ఆగస్టు మధ్య వరకు కూడా రైల్వే సేవలను పునరుద్ధరించబోవడం లేదనేది తాజా సమాచారం. ఈ క్రమంలో రైల్వే మంత్రిత్వ శాఖ.. అన్ని రకాల అడ్వాన్స్ టికెట్ బుకింగ్‌లకు సంబంధించి పూర్తి సొమ్మును ప్రయాణికులకు రీఫండ్ చేయాల్సిందిగా అన్ని జోన్లకు సూచించినట్లు సమాచారం. (రైల్వే ఇక మేడిన్ ఇండియా) ఏప్రిల్ 14న లేదా అంతకు ముందు వరకు బుక్ చేసుకున్న అన్ని టిక్కెట్లను రద్దు చేయాలని.. ప్రయాణికులకు పూర్తి సొమ్మును వాపసు చేయాల్సిందిగా రైల్వే మంత్రిత్వ శాఖ సోమవారం అన్ని జోన్లకు ఒక సర్క్యులర్ జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం రైల్వే శాఖ రోజు 230 మెయిల్స్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతోంది. అయితే కరోనా నేపథ్యంలో సామాజిక దూరాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఎక్కువ రైళ్లను నడపాలని రైల్వే శాఖ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆగస్టు మధ్య వరకు రైలు ప్రయాణాలను వాయిదా వేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే జూన్ 30 వరకు అన్ని సాధారణ రైళ్ల నిర్వహణను రైల్వే శాఖ రద్దు చేసిన సంగతి తెలిసిందే. (‘జపాన్ అని చెప్పి.. చైనాకు లాక్కెళ్తారా’) -
రైల్వే బుకింగ్‌లు షురూ!
సాక్షి, సిటీబ్యూరో: రైల్వే అడ్వాన్స్ బుకింగ్‌లు తిరిగి మొదలయ్యాయి. లాక్డౌన్ కారణంగా గత 10 రోజులుగా నిలిచిపోయిన రిజర్వేషన్ బుకింగ్‌ల కోసం ప్రయాణికులు క్రమంగా ముందుకొస్తున్నారు. ప్రస్తుతం రిజర్వేషన్ కేంద్రాలు మూసి ఉంచడంతో ఐఆర్సీటీసీ నుంచి ఆన్లైన్ ద్వారా మాత్రమే ప్రయాణికులు తమ రిజర్వేషన్లను బుక్ చేసుకొనే సదుపాయం ఉంది. లాక్డౌన్ పొడిగింపు ప్రతిపాదనలు లేవని కేంద్రం ఇటీవల ప్రకటించడంతో పాటు, లాక్డౌన్ తర్వాత రాకపోకలు సాగించేవారు తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చునని పేర్కొనడంతో గత రెండ్రోజులుగా ప్రయాణికులు రిజర్వేషన్లు బుక్ చేసుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తేస్తే ఏప్రిల్ 16 తర్వాత హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రైళ్లు నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు రైల్వే అన్ని రకాల చర్యలు చేపట్టిందని, రైళ్లను కెమికల్ వాష్ చేయడంతో పాటు, ఎప్పటికప్పుడు శానిటేషన్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. లాక్డౌన్ అనంతరం కూడా రైళ్ల నిర్వహణలో పూర్తి జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలిపారు. కరోనాను అడ్డుకునేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో గత 10 రోజులుగా ఎక్కడికక్కడ ప్రయాణికుల రాకపోకలు స్తంభించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రయాణికులు అప్పటికప్పుడు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. అత్యవసర రాకపోకలు సైతం నిలిచిపోయాయి. ఈ నెల 15 నుంచి రైళ్లు పట్టాలెక్కితే ప్రయాణికుల రాకపోకలు తిరిగి మొదలుకావొచ్చు ప్రతిరోజూ 2.5 లక్షల మంది రాకపోకలు సాధారణ రోజుల్లో హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి, తదితర రైల్వేస్టేషన్ల నుంచి ప్రతిరోజూ 2.5 లక్షల మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. ఒక్క సికింద్రాబాద్ నుంచే ప్రతిరోజూ 1.8 లక్షల మంది ప్రయాణిస్తారు. రోజుకు కనీసం 200 రైళ్లు హైదరాబాద్ నుంచి నడుస్తాయి. లాక్‌డౌన్‌తో ఈ రాకపోకలన్నీ నిలిచిపోయాయి. ఈ నెల 15 నుంచి లాక్డౌన్ తొలగించినప్పటికీ రద్దీ అంతగా ఉండకపోవచ్చునని, కరోనా భ యం దృష్ట్యా తప్పనిసరిగా వెళ్లాల్సిన వారు. అత్యవసర ప్రయాణికులు మాత్రమే బయలుదేరొచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. ‘ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం లాక్డౌన్ తొలగించిన వెంటనే రైళ్లు అందుబాటులోకి వస్తాయి. కానీ ఈ లోపు ఏవైనా అనుకోని సంఘటనలు చోటుచేసుకొని లాక్డౌన్ కొనసాగించే పరిస్థితులు తిరిగి ఉత్పన్నమైతే ఇప్పటివరకు రిజర్వేషన్లు బుక్ చేసుకున్న వారు మరోసారి రద్దు చేసుకునేందుకు కూడా సిద్ధంగా ఉండాల్సిరావచ్చు’అని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. ఎయిర్‌లైన్స్ బుకింగ్‌లు ఓపెన్.. లాక్డౌన్ తొలగించిన అనంతరం దేశీయ విమానాల రాకపోకలు కూడా మొదలుకానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే పలు ఎయిర్‌లైన్స్ సంస్థలు బుకింగ్‌లను ఓపెన్ చేశాయి. మరోవైపు దేశీయ విమానాల రాకపోకల కోసం శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా సిద్ధమవుతోంది. ఎయిర్‌పోర్టును పూర్తిగా కెమికల్ వాష్ చేస్తున్నారు. అన్ని విభాగాల్లోనూ శానిటేషన్ ప్రక్రియ చేపట్టారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రతిరోజూ 60 వేల మందికి పైగా రాకపోకలు సాగిస్తుండగా వీరిలో సుమారు 50 వేల మంది దేశీయ ప్రయాణికులే ఉంటాయి. పలు ఎయిర్‌లైన్స్ సంస్థలు బుకింగ్‌లు ప్రారంభించినప్పటికీ ప్రయాణికుల రద్దీ వెంటనే కనిపించకపోవచ్చునని, అందుకు కొంత సమయం పట్టవచ్చునని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. -
బుకింగ్స్‌లో ‘2.ఓ’ ఆల్‌టైమ్ రికార్డ్
ఇప్పుడు ‘2.ఓ’ ట్రెండ్ నడుస్తోంది. అవును.. ఎక్కడ చూసినా రజనీ-శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన 2.ఓ గురించే వినిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక మిగిలింది బాక్సాఫీస్ రికార్డులను వేటాడమే. అయితే ఇప్పటికే కొన్ని రికార్డులను 2.ఓ సెట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6800 థియేటర్లలో పదివేల స్ర్కీన్లపై ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌పై సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన మీమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆన్లైన్ బుకింగ్స్ ద్వారా ఈ మూవీ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే పేటీఎమ్ ద్వారా 1.25 మిలియన్స్ టికెట్స్ అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ఇక బుక్‌మైషో ద్వారా దాదాపు పది లక్షల టికెట్లు తెగాయని సమాచారం. ఇలా ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ఇన్ని లక్షల టికెట్లు తెగడం ‘2.ఓ’తోనే సాధ్యమైందని తలైవా అభిమానులు సంబరపడుతున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించిన ఈ చిత్రాన్ని లైకా సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. Breaking all Booking Records, 1.25 Million+ Tickets of #2Point0 Sold in @PaytmTickets! Grab your #2Point0 tickets now! PayTm Tamil - https://t.co/kC3nGgPULC PayTm Telugu - https://t.co/zGoiohA9SA PayTm Hindi - https://t.co/Tiwbmgusxf — 2.0 (@2Point0movie) November 28, 2018 -
టయోటా యారిస్ వచ్చేస్తోంది..!
న్యూఢిల్లీ: జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా తమ బ్రాండ్ వినియోగదారులకు కార్ల సిరీస్‌లో మరో కొత్త వేరియంట్‌ను పరిచయం చేయనుంది. యారిస్ పేరుతో సీ- సెగ్మెంట్ కారును ప్రవేశపెడుతోంది. వచ్చే నెల నుంచి బుకింగ్స్ చేసుకోవచ్చని, మే నుంచి అమ్మకాలు మొదలవుతాయని సంస్థ తెలిపింది. తమ కొత్త యారిస్... హోండా సిటీ, మారుతీ సుజుకీ సియాజ్, హ్యూందాయ్ వెర్నాలకు గట్టిపోటీనిస్తుందని సంస్థ ప్రతినిధులు విశ్వాసం వ్యక్తం చేశారు. తమ బ్రాండ్ వినియోగదారులకు ఇతియోస్ సెడాన్, కరోలా అట్లిస్ వంటి ఉత్తమ కార్లను అందజేశామని, ఇప్పుడు యారిస్ కూడా అందరి అభిమానాన్ని చూరగొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యారిస్ ఫీచర్లు... 1.5 లీటర్ల పెట్రోల్ సామర్థ్యం గల ఇంజన్ రెండు గేర్ బాక్సులు(6- స్పీడ్ మాన్వల్ లేదా 7- స్ఫీడ్ సీవీటీ ఆటోమేటిక్) 7 ఎయిర్ బ్యాగులు ధర : 10 నుంచి 12 లక్షలు(ఢిల్లీ ఎక్స్ షోరూం) -
రైల్వే అడ్వాన్స్ బుకింగ్: భారీ డిస్కౌంట్
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణీకులకు త్వరలోనే శుభవార్త అందనుంది. భారీగా డిస్కౌంట్లను అందించే విమానయాన సంస్థల మాదిరిగానే రైల్వే కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. విమాన టికెట్ల మాదిరిగానే అడ్వాన్స్ బుకింగ్ రైల్వే టికెట్లపై డిస్కౌంట్లను , ఇతర ఆఫర్లను అందించాలని కమిటీ కీలక సిఫారసులు చేసింది. ఈ మేరకు కమిటీ ప్రతిపాదనలకు రైల్వే బోర్డు ఆమోదం లభిస్తే రైల్వే ప్రయాణీకులకు భారీ ప్రయోజనం లభించనుంది. ఒక నెల రోజుల ముందు రైల్వే ప్రయాణీకులు తమ టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకుంటే భారీ డిస్కౌంట్ లభించనుంది. కమిటీ అందించిన నివేదిక ప్రకారం 50శాతం నుంచి 20శాతం దాకా అడ్వాన్స్ బుకింగ్‌పై డిస్కౌంట్ లభిస్తుంది. రైలులో ఖాళీగా ఉన్న సీట్లను బట్టి ఈ డిస్కౌంట్లను అందించాలని కమిటీ ప్రతిపాదించింది. అంతేకాదు రైలు బయలుదేరడానికి ముందు రెండు రోజుల నుంచి రెండు గంటల వరకు కూడా డిస్కౌంట్లను ఆఫర్ చేయవచ్చని సూచించింది. అలాగే లోయర్ బెర్త్ కోరుకునే ప్రయాణీకులు మాత్రం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే వృద్ధులకు, మహిళలకు , పిల్లలకు లోయర్ బెర్త్ కేటాయింపు ఉచితమని పునరుద్ఘాటించింది. దీంతోపాటు అర్థరాత్రి , అపరాత్రి కాకుండా, కన్వీనియంట్ సమయాల్లో గమ్యానికి చేరే రైళ్లలో టికెట్ ధరలను పెంచాలని కూడా సూచించింది. -
జోస్ ఆలుక్కాస్లో అక్షయ అడ్వాన్స్ బుకింగ్‌లు
హైదరాబాద్: జోస్ ఆలుక్కాస్ షోరూమ్‌ల్లో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. వినియోగదారులు ముందుగానే ఆభరణాలు బుక్ చేసుకోవడం ద్వారా అదనపు ప్రయోజనాలు పొందవచ్చని జోస్ ఆలుక్కాస్ ఒక ప్రకటనలో తెలిపింది. మే 8 లోపు రూ.30వేల విలువైన అడ్వాన్స్ బుకింగ్‌పై ఒక బంగారు నాణెం ఉచితంగా పొందవచ్చని జోస్ ఆలుక్కాస్ గ్రూప్ చైర్మన్ జోస్ ఆలుక్కా పేర్కొన్నారు. అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేకమైన డైమండ్ జువెలరీ కలెక్షన్‌ను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఈ సీజన్లో రూ.50వేల విలువైన వజ్రాల కొనుగోళ్లపై ఒక బంగారు నాణెం, రూ.లక్ష విలువైన వజ్రాల కొనుగోళ్లపై డైమండ్ పెండెంట్ ఉచితంగా పొందవచ్చని పేర్కొన్నారు. -
శాంసంగ్ గెలాక్సీ ఫోన్లకు బిగ్ సి ఆడ్వాన్స్ బుకింగ్ ఆఫర్
హైదరాబాద్: శాంసంగ్ గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్ మొబైల్స్‌కు బిగ్ సి అడ్వాన్స్ బుకింగ్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ శాంసంగ్ ఫోన్లకు అడ్వాన్స్ బుకింగ్‌లను ఈ నెల 8 నుంచి ప్రారంభించామని బిగ్ సి ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 17 వరకూ ఈ అడ్వాన్స్ బుకింగ్ ఆఫర్ ఉంటుందని బిగ్ సి సీఎండి బాలు చౌదరి పేర్కొన్నారు. రూ.2,000 చెల్లించి ఈ ఫోన్లను అడ్వాన్స్‌గా బుక్ చేసుకోవచ్చని, రూ.7,999 విలువ గల శాంసంగ్ ‘గేర్ వీ ఆర్’ను ఉచితంగా అందిస్తామని వివరించారు. తెలంగాణ, అంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని బిగ్ సి షోరూమ్‌ల్లో ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించారు.